కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కోసం గాలింపు | Minister Konda Surekha’s Former OSD Sumanth’s Driver Arrested | Sakshi
Sakshi News home page

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కోసం గాలింపు

Aug 24 2026 9:54 AM | Updated on Aug 24 2026 10:04 AM

Minister Konda Surekha’s Former OSD Sumanth’s Driver Arrested

హైదరాబాద్: హత్యాయత్నం కేసులో మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ నార్ల సుమంత్‌ కోసం జూబ్లీహిల్స్‌ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు మూడు బృందాలు ఏర్పాటు చేయగా టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు ఒక బృందంగా ఏర్పడి గాలిస్తున్నారు. గత నెల 30న జూబ్లీహిల్స్‌ లోని తన కార్యాలయానికి సుమంత్‌ సహచరులు రాము డబ్బు వ్యవహారంలో మాట్లాడేందుకు చెంగిచెర్ల కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి గొంగిడి హరికృష్ణ ని పిలిపించారు. 

అక్కడే ఉన్న సుమంత్‌ ఆయన అనుచరులు ప్రశాంత్, అరుణ్‌ కుమార్‌ రెడ్డి, కార్తీక్, మహేందర్‌ రెడ్డి, రాము తదితరులు ఇనుపరాడు తో తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితులు ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న సుమంత్‌ ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ చేసి పరారయ్యాడు. ఆయన డ్రైవర్‌ నవీన్‌ ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement