పల్లె సందడి లేని పెళ్లి | City Weddings See Fewer Guests From Native Villages as Urban Social Circles Take Over | Sakshi
Sakshi News home page

పల్లె సందడి లేని పెళ్లి

Nov 29 2026 8:33 AM | Updated on Nov 29 2026 8:33 AM

City Weddings See Fewer Guests From Native Villages as Urban Social Circles Take Over

ఒకప్పుడు నగరంలో పెళ్లి అంటే సొంతూర్లకు వెళ్లి కొబ్బరి కుడకలు, పత్రికలు పెట్టి ఇంటిల్లిపాది రావాలని ఆహ్వానించేవారు. అక్కడినుంచి బస్సుల్లో వచ్చేవారు. దిగీ దిగుతూనే ‘ఏమ్రా బాగున్నావా?’ అని గట్టిగా పలకరింపులు సాగేవి. పెద్దవాళ్లు పంచె కట్టుకుని, ఆడవాళ్లు చీరల్లో, పిల్లలు కొత్త దుస్తులు వేసుకుని వచ్చేటోళ్లు. ఫంక్షన్‌ హాల్‌ ముందు వాళ్ల హడావుడే వేరు. ‘మా వాడి పెళ్లి’ అని గర్వంగా చెప్పుకునేటోళ్లు. అలా పెళ్లికి 2 వేలమంది వస్తే, 1,400 మంది పల్లెటూరోళ్లే కనిపించేటోళ్లు. 

తిరిగి వెళ్లేటప్పుడు అందరి కళ్లు చెమర్చేవి. అయితే, ఇప్పుడు నగరంలో పెళ్లిళ్లకు ఊళ్ల నుంచి రాక బాగా తగ్గినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఎగువ మధ్య తరగతి, సంపన్నుల కార్యక్రమాల్లో...! ఫంక్షన్‌ హాల్‌లో వెయ్యి మంది ఉంటే, 700 మంది సిటీవారే అన్నట్లుంది పరిస్థితి. ఊరోళ్లు 100 నుంచి 150 మంది మాత్రమే. కొందరికే ఆహ్వానాలు..వాట్సప్‌ ఇన్విటేషన్.. తరం మారడం ఇలా ఇందుకు కారణాలు అనేకం..! ఒకప్పుడు 3 రోజుల పెళ్లి, ఊరోళ్లకు వసతి, విందు. ఇప్పుడు ఫోటో, రీల్స్, బఫేలతో 3 గంటలు అయిపోయింది. సిటీలోనే ఫ్రెండ్స్, ఆఫీస్‌ కొలీగ్స్, అపార్ట్‌మెంట్, కాలనీ, కుల సంఘం అని కొత్త బంధం ఏర్పడింది. గెస్ట్‌ లిస్ట్‌ మారిపోయింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement