యూపీఐ పల్లె సై | UPI is top payment mode for 81 percent in rural telangana | Sakshi
Sakshi News home page

యూపీఐ పల్లె సై

Nov 29 2026 5:56 AM | Updated on Nov 29 2026 5:56 AM

UPI is top payment mode for 81 percent in rural telangana

గ్రామీణ తెలంగాణలో 81% చెల్లింపులు  

98 శాతం గ్రామాల్లో అందుబాటులో మొబైల్‌ ఫోన్‌ 

నెట్‌ బ్యాంకింగ్‌ చేసేవారు కేవలం 0.2 శాతమే 

అత్యధికంగా త్రిపురలో, అత్యల్పంగా మిజోరంలో యూపీఐ వాడకం 

2025 మార్చి నాటి గణాంకాలను వెల్లడించిన 

ఆర్‌బీఐ నివేదిక

సాక్షి, హైదరాబాద్‌: బస్సులో టికెట్‌.. రోడ్డు పక్కన బండిపై పానిపురి.. ఖరీదైన షాపింగ్‌మాల్‌లో వీకెండ్‌ కొనుగోలు.. కిరాణా షాపులో నెలసరి సామాన్లు..ఏది అయినా, ఏది కొనాలన్నా ఒకప్పుడు జేబు నిండా డబ్బులుండాలి.. కానీ ఇప్పుడు సొమ్ము జేబులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు..చేతిలో సెల్‌ఫోన్‌ ఉంటే చాలు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ద్వారా ఏదో ఒక యాప్‌ ఓపెన్‌ చేసి చెల్లించడమే. అలాంటి యూపీఐ చెల్లింపులు గ్రామీణ భారతంలో ఎలా జరుగుతున్నాయి? ఎంతమంది గ్రామీణులకు యూపీఐ చెల్లింపులు అందుబాటులో ఉన్నాయన్న దానిపై రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఇ చ్చిన నివేదికలో ఆసక్తికర అంశాలు వెల్లడించింది.

లోకల్‌ ఫైనాన్సెస్‌ అండ్‌ కెపాసిటీ బిల్డింగ్‌ ఇన్‌ రూరల్‌ ఇండియా పేరిట ఇటీవల ఆర్‌బీఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలోని కొన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా, మరికొన్నింటికంటే తక్కువగా గ్రామీణ తెలంగాణలో యూపీఐ చెల్లింపులు జరుగుతున్నాయి. దేశంలోనే అత్యధికంగా త్రిపురలోని 97.2 శాతం గ్రామీణ ప్రాంతాల ప్రజలు యూపీఐల ద్వారా నగదు చెల్లింపులు చేస్తుంటే అతి తక్కువగా మిజోరంలో 61 శాతం మంది మాత్రమే ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌కు పరిమితం అయ్యారని, తెలంగాణలో 81 శాతం గ్రామీణ ప్రాంతాలకు యూపీఐ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయని ఈ నివేదిక వెల్లడించింది.  

నెట్‌ బ్యాంకింగ్‌ తక్కువే.. 
జనవరి–మార్చి 2025 మధ్యకాలంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో యూపీఐ చెల్లింపులను ఆర్‌బీఐ పరిశీలించింది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలోని 98 శాతం గ్రామాల్లో మొబైల్‌ఫోన్‌ అందుబాటులోకి వ చ్చింది. అయితే మొబైల్‌ ఫోన్‌ ఉన్న వారిలో 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న 81 శాతం మాత్రమే యూపీఐల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల్లో కేవలం 0.2 శాతం మంది మాత్రమే నగదు లావాదేవీల కోసం నెట్‌ బ్యాంకింగ్‌ను వినియోగిస్తుండగా, 18.9 మంది అటు యూపీఐ, ఇటు నెట్‌ బ్యాంకింగ్‌ ఉపయోగిస్తున్నారు.  

ఆన్‌లైన్‌ కొనుగోళ్లు కూడా.. 
    రాష్ట్రంలోని గ్రామీణ కుటుంబాల్లో ఆన్‌లైన్‌ కొనుగోళ్లు ఎలా జరుగుతున్నాయన్న దాన్ని కూడా ఆర్‌బీఐ నివేదిక విశ్లేíÙంచింది. ఈ నివేదిక ప్రకారం ఆన్‌లైన్‌ ద్వారా 4.8 శాతం గ్రామీణ కుటుంబాలు ఆహార పదార్థాలను కొనుగోలు చేస్తున్నాయి. 76.6 శాతం ఆహారేతర పదార్థాలను, 18.7 శాతం రెండింటినీ కొనుగోలు చేస్తున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement