ర్యాపిడో డ్రైవర్‌ కాళ్లు విరగ్గొట్టారు.. | Rapido Driver Incident In Hyderabad | Sakshi
Sakshi News home page

ర్యాపిడో డ్రైవర్‌ కాళ్లు విరగ్గొట్టారు..

Nov 29 2026 8:45 AM | Updated on Nov 29 2026 8:48 AM

Rapido Driver Incident In Hyderabad

ర్యాపిడో డ్రైవర్‌ కాళ్లు విరగ్గొట్టారు..

హైదరాబాద్: చోరీకి యత్నించారన్న అనుమానంతో కొందరు దాడి చేయగా ఇద్దరు వ్యక్తులు పారిపోయారు. వారికి చిక్కిన ర్యాపిడో డ్రైవర్‌పై దాడి చేయడంతో అతని రెండు కాళ్లు విరిగిపోయాయి. ఈ సంఘటన లంగర్‌హౌస్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. సంగం వద్ద నూతనంగా డివైడర్‌ నిర్మిస్తున్నారు. ఈ పనులు చేస్తున్న కార్మికులు సంగం సమీపంలోని తపోవనంలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. 

రెండు రోజుల క్రితం ఇక్కడ గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించి పారిపోయారు. అప్పటి నుంచి ఆ కార్మికులు నిఘా ఉంచారు. శనివారం తెల్లవారుజామున ముగ్గురు వ్యక్తులు గుడిసెల వద్దకు రావడంతో కార్మికులు వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. వారు పారిపోతుండగా వెంబడించి, చాంద్రాయణగుట్టకు చెందిన ఇర్ఫాన్‌ను పట్టుకొని చేతికి అందిన వాటితో దాడి చేశారు. ఈ ఘటనలో అతని రెండు కాళ్లు విరిగిపోయాయి. 

లంగర్‌హౌస్‌లో ఉద్రిక్తత... 
చాంద్రాయణగుట్టకు చెందిన ర్యాపిడో డ్రైవర్‌ ఇర్ఫాన్‌ టోలిచౌకిలో ఒకరిని దింపి, మరో ఆర్డర్‌ కోసం ఆ మార్గంలో వస్తుండగా దొంగ అని పొరబడి దాడి చేశారని బాధితుడి కుటుంబీకులు శనివారం రాత్రి ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీని కలిసి వివరించారు. దీంతో ఎంపీ స్థానిక ఎమ్మెల్యే కౌసర్‌ మొహినుద్దీన్‌కు ఫోన్‌ చేసి బాధితునికి అండగా నిలవాలని సూచించారు. ఎమ్మెల్యే లంగర్‌హౌస్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement