వికృత సైకోపై తుపాకీ తూటా | Bengaluru Police Open Fire on Man Accused | Sakshi
Sakshi News home page

వికృత సైకోపై తుపాకీ తూటా

Nov 29 2026 8:18 AM | Updated on Nov 29 2026 8:18 AM

Bengaluru Police Open Fire on Man Accused

బనశంకరి: మహిళా పీజీ హాస్టళ్లలోకి చొరబడి లైంగిక వేధింపులకు పాల్పడడం, తరచూ అత్యాచారం, దొంగతనాలు, దోపిడీలకు ఒడిగడుతున్న క్రిమినల్‌పై తూ­టా పేలింది. బెంగళూరు చిక్కజాల పోలీసులు కా­ల్పులు జరిపి ఏపీ మదనపల్లి నివాసి నరేశ్‌ అలియాస్‌ బెట్టనరసప్ప (34)ను అదుపులోకి తీసుకున్నారు.  

మహిళల హాస్టళ్లపై కన్ను  
శుక్రవారం వేకువజామున చిక్కజాల ఠాణా పరిధిలోని ఓ పీజీలోకి చొరబడి యువతి మొబైల్‌ఫోన్‌ను లాక్కెళ్లడానికి ప్రయతి్నంచగా ఆమె అడ్డుకుని కేకలు వేసింది. దీంతో ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. యువతి ఆర్తనాదాలు చేయడంతో ఇతర యువతులు రావడంతో మొబైల్‌ లాక్కుని నరేశ్‌ పారిపోయాడు. తరువాత మరో పీజీలోకి చొరబడి ఇదేవిధంగా ప్రవర్తించాడు. అప్పటినుంచి పోలీసులు వేట ప్రారంభించారు. సీఐ మల్లికార్జున, పోలీసులు బాధిత యువతులను విచారించి సైకో ఆనవాళ్లను సేకరించారు. ఎరుపు రంగు బైక్‌లో, నలుపు రంగు జర్కిన్‌ ధరించి పీజీలోకి వచ్చాడని తెలిపారు.  

పోలీసులు వెంటాడుతూ..  
శనివారం తెల్లవారుజామున 5:30 సమయంలో బెంగళూరు ఉత్తర తాలూకా టెర్రాఫామ్‌ వద్ద కనబడటంతో పోలీసులు వెంబడించారు. నిందితుడు నరేష్‌ బైక్‌లో వేగంగా వెళ్తూ కిందపడి తరువాత టెర్రాఫాంలోకి పారిపోయాడు. పట్టుకోబోయిన పోలీసులపై చాకుతో దాడిచేశాడు. సీఐ మల్లికార్జున్‌ గాల్లోకి ఒక రౌండ్‌ కాల్చి లొంగిపోవాలని సూచించారు. కానీ నిందితుడు మళ్లీ  కత్తి తీయడంతో కాల్పులు జరిపారు. రెండు బుల్లెట్లు అతని ఎడమ కాలికి తగలడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే పట్టుకుని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు.  

రెండు చోట్లా నేరచరిత 
సైకో నరేశ్‌ మదనపల్లి, బెంగళూరు అడ్డాగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. 12 ఏళ్ల క్రితం పెళ్లి కాగా, ఇతనితో విసిగిపోయి భార్య వెళ్లిపోయింది. బెంగళూరు సుద్దగుంటెపాళ్యలో లైంగికదాడి కేసులో నిందితునిగా ఉన్నాడు. ఈ కేసులో జైలులో ఉంటూ 8 రోజుల క్రితం విడుదలయ్యాడు. వచ్చీ రాగానే మహిళల హాస్టళ్లలో నేరాలకు పాల్పడసాగాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement