ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఘటన
9 మంది అరెస్ట్
ముంబై: ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయలో ఒకే రోజు పలు ఘటనల్లో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్, కస్టమ్స్ అధికారులు ఏకంగా దాదాపు రూ.40 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు, బంగారాన్ని పట్టుకున్నారు. నవంబర్ 27, 28 తేదీల్లో ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన సోదాలు, లభ్యమైన అత్యంత ఖరీదైన డ్రగ్స్, పుత్తడి వివరాలను పోలీస్ వర్గాలు శనివారం వెల్లడించాయి. ఈ ఘటనల్లో మొత్తంగా 9 మందిని అరెస్ట్‌చేశారు.
థాయ్ ఎయిర్‌లైన్స్ టీజీ–318 విమానంలో ముంబైకి చేరుకున్న ఒక అనుమానాస్పద వ్యక్తిని తనిఖీచేయగా 5 కేజీల మత్తుపదార్థాలు లభించాయి. మరింత సోదాలు చేయగా మరో 7 కేజీల మాదకద్రవ్యం కేటమైన్ లభించింది. వీటి విలువ రూ.36 కోట్లు. ఈ ఘటనలో డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాలోని మొత్తం ముగ్గురిని అరెస్ట్‌చేశారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన మరో ఇద్దరిని సోదా చేయగా రూ.2.27 కోట్ల విలువైన నాణ్యమైన గంజాయి ప్యాకెట్లు దొరికాయి. వీళ్లనూ అరెస్ట్‌చేశారు. మరో కేసులో ముంబైకి చేరుకున్న ఐదుగురికి తనిఖీచేయగా 1,443 గ్రాముల బరువైన 24 క్యారెట్ల బంగారం లభించింది. దీని విలువ రూ.1.57 కోట్లు. ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్‌చేశారు.


