Customs officials
-
గొప్పగా మాట్లాడి వస్తే ఇలాగేనా చెక్ చేసేది ?
న్యూఢిల్లీ: పాక్ బాలికల విద్య, హక్కుల ఉద్యమకారిణి మలాలా యూసఫ్జాయ్లాగా తానేమీ స్వదేశం వదిలిపోలేదని, సొంత కశ్మీర్లో హాయిగా ఉన్నానంటూ బ్రిటన్ పార్లమెంట్ భవనంలో ప్రసంగించిన కశ్మీర్ యువతి యానా మిర్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. బ్రిటన్ నుంచి విమానంలో తిరిగొచ్చాక ఆమె బ్యాగులను ఢిల్లీ కస్టమ్స్ అధికారులు తనిఖీచేయడమే ఆమె ఆగ్రహానికి లోనయ్యారు. బ్రిటన్‌లో భారత్ గురించి గొప్పగా ప్రసంగించిన నాలాంటి వ్యక్తిని ఇలాగేనా అవమానించేది?. ఖరీదైన లూయిస్ విట్టన్ బ్రాండ్ షాపింగ్ ఖాళీ సంచులు తెచి్చనందుకే బిల్లులు ఎగ్గొట్టిన దొంగలా చూస్తున్నారు. నన్ను వాళ్లు ఇండియా మీడియా యోధురాలిగా భావిస్తే మీరేమో ఇక్కడ నన్ను బ్రాండ్ స్మగ్లర్లా భావించి పరువు తీస్తున్నారు’’ అని అధికారులతో స్వరం పెంచి మాట్లాడారు. అధికారులతో వాగ్వాదం తాలూకు వీడియోను స్వయంగా కెమెరాతో షూట్‌చేసి ‘ఎక్స్’లో షేర్చేశారు. దీనిపై ఢిల్లీ కస్టమ్స్ అధికారులు వివరణ ఇచ్చారు. ‘‘ అంతర్జాతీయ ప్రయాణికుల బ్యాగులను స్కానింగ్ చేయడం సర్వసాధారణం. గౌరవం చట్టాలకు అతీతం కాదు. బ్యాగ్ స్కానింగ్‌కు ఆమె ఒప్పకోలేదు’ అని అన్నారు. -
RGIA Hyderabad: బంగారం తెచ్చి.. చెత్తబుట్టలో వేసి
సాక్షి, శంషాబాద్: కస్టమ్స్ తనిఖీలు తప్పించుకుని బంగారాన్ని బయటికి తరలించేందుకు స్మగ్లర్లు కొత్తకొత్త మార్గాలను ఆశ్రయిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులే బంగారాన్ని బయటికి తీసుకురాకుండా, ఎయిర్‌పోర్టు ఉద్యోగులతో బయటికి తరలిస్తున్న సంఘటనలు బయటపడుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు కస్టమ్స్ తనిఖీలకు రాకముందు అరైవల్‌లో ఉన్న మరుగుదొడ్డిలోకి వెళ్లాడు. అక్కడి ఓ చెత్త డబ్బాలో తాను తీసుకొచ్చిన బంగారాన్ని వేసి యథాతథంగా కస్టమ్స్ తనిఖీలకు వెళ్లాడు. తనిఖీల్లో ఏమీ దొరక్కపోయినా అనుమానించిన అధికారులు అతడిని విచారించడంతో తాను తీసుకొచ్చిన బంగారాన్ని చెత్తడబ్బాలో వేసినట్లు చెప్పాడు. దానిని ఎయిర్‌పోర్టు ఉద్యోగి బయటికి తీసుకెళ్లనున్నట్లు చెప్పడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే బంగారాన్ని తరలించేందుకు వెళ్లిన సదరు ఎయిర్‌పోర్టు ఉద్యోగిని కూడా అరెస్ట్ చేశారు. 933 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం ఉదయం కూడా ఇదే తరహాలో కువైట్ నుంచి వచ్చిన ప్రయాణికుడు 1,300 గ్రాముల బంగారాన్ని చెత్తడబ్బాలో దాచిపెట్టడంతో కస్టమ్స్ అధికారులు దానిని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: వర్షం ఉంటే బడులకు సెలవులివ్వండి.. విద్యాశాఖ ఆదేశం -
8 కిలోల బంగారం దుస్తుల్లో దాచేశారు..
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా రవాణా చేస్తున్న 8 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం తెల్లవారు జామున బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా ఓ ప్రయాణికుడు ప్యాంటులో దాచి తీసుకొచ్చిన 2 కేజీల బంగారం బిస్కెట్ ముక్కలు బయటపడ్డాయి. వీటి విలువ రూ.1.21 కోట్లు ఉంటుందని నిర్ధారించారు. అదే విమానంలో వచ్చిన మరో ప్రయాణికుడు కూడా లోదుస్తుల్లో దాచుకుని తీసుకొచ్చిన 1.75 కేజీల బంగారం బయటపడింది. దీని విలువ 1.8 కోట్లుగా నిర్ధారించారు. షార్జా నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి వద్ద లో దుస్తుల్లో దాచుకుని తీసుకొచ్చిన 2.17 కేజీల బంగారం పేస్టును బయటికి తీశారు. దీని విలువ 1.31 కోట్లుగా నిర్ధారించారు. దుబాయ్ నుంచి వచ్చిన మరో వ్యక్తి ధరించిన లో దుస్తుల్లో 2.05 కేజీల బంగారం బయటపడింది. దీని 1.24 కోట్లుగా నిర్ధారించారు. ఆ నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం పట్టుబడిన 8 కేజీల బంగారం విలువ రూ.4.86 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ ఏడాదిలో ఒకే రోజులో అత్యధికంగా పట్టుబడిన బంగారం ఇదేనని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. -
బంగారం ద్రవాన్ని చీరపై స్ప్రేగా చల్లి అక్రమ రవాణా
హైదరాబాద్: అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఓ ప్రయాణికుడి కదలికలను అనుమానించిన అధికారులు అతడి లగేజీని పరిశీలించారు. అందులో ఉన్న ఓ కాటన్ చీరపై బంగారం ద్రవాన్ని స్ప్రేగా చల్లి తీసుకొచ్చినట్లు గుర్తించి దానిని బయటికి తీశారు. బయటపడిన 461 గ్రాముల బంగారం విలువ రూ.28 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కాలి బ్యాండేజీలో బంగారం
దొడ్డబళ్లాపురం: కాలికి గాయమైనట్లు బ్యాండేజీ చుట్టుకుని లోపల బంగారం దాచి అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. రూ.43లక్షల విలువైన 700 గ్రాముల బంగారాన్ని స్వా«దీనం చేసుకున్నారు. మే 21న బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడు బంగారం తరలిస్తున్నట్టు తెలియడంతో అతన్ని తనిఖీలు చేశారు. అతడి కాలికి చుట్టిన బ్యాండేజీపై అనుమానం వచ్చి విప్పి చూడగా రెండు బంగారు బిస్కెట్లు పట్టుబడ్డాయి. మరో చైను కూడా అతడి నుండి స్వాధీనం చేసుకున్నారు. స్టీలు కడియం రూపంలో. చేతి కడియానికి స్టీలు పూత పూసి బంగారును తరలిస్తున్న వ్యక్తిని విమానాశ్రయంలో పట్టుకున్నారు. మే 20న బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికునిపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు అతన్ని తనిఖీ చేయగా, చేతికి ఉన్న పెద్ద స్టీలు కనిపించింది. దానిని పరిశీలించగా, బంగారు కడియమని, పైకి కనబడకుండా ఉండడానికి స్టీలు పూత పూసినట్లు వెల్లడైంది. రూ.31 లక్షల విలువ చేసే అర్ధ కేజీ బంగారాన్ని స్వాదీనం చేసుకొన్నారు. -
టాయిలెట్లో రూ.2 కోట్లు విలువ చేసే బంగారు కడ్డీలు
సాక్షి, ఢిల్లీ: టాయిలెట్లో రెండు కోట్లు విలువ చేసే బంగారు కడ్డీలు కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటన న్యూఢిల్లీలోని ఇందీరాగాంధీ ఇంటర్నేషనల్(ఐజీఐ) విమానాశ్రయంలో ఆదివారం చోటు చేసుకుంది. దేశీయ పర్యటనలు పూర్తి చేసుకున్న అంతర్జాతీయ విమానg ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 2వద్ద ఆగినప్పుడూ ఈ ఘటన వెలుగు చూసిందని అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారుల ఎయిర్‌పోర్ట్‌లో ఆగి ఉన్న విమానాన్ని తనిఖీ చేస్తుండగా.. వాషరూమ్లో సింక్‌కు దిగువున టేప్‌తో అతికించిన బూడిదరంగు పర్సును కనుగొన్నారు. దీంతో వెంటనే అధికారులు ఆ పర్సును స్వాధీనం చేసుకుని చూడగా..మొత్తం మూడు వేల గ్రాములకు బరువున్న నాలుగు దీర్ఘచతురస్రాకరా బంగారు కడ్డీలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. దీర్ఘచతురస్రాకారంలో ఉండే బంగారు కడ్డీల ధర సుమారు 2 కోట్లు రూపాయాలపైనే ఉంటుందని ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. (చదవండి: 'మా రక్షణ కోసం చేస్తున్న యుద్ధం': రష్యా విదేశాంగ మంత్రి) -
భారీగా బంగారం పట్టివేత
శంషాబాద్: ఇద్దరు ప్రయాణికులు అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో శనివారం ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ప్రసాద్‌గౌడ్ అనే వ్యక్తి బంగారు బిస్కెట్లు ఉన్న లగేజీని కస్టమ్స్ కంటపడకుండా తరలించేందకు యత్నించాడు. అతడి కదలికలను అనుమానించిన అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టడంతో లగేజీలో 2.1 కేజీ బరువు కలిగిన బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. బంగారం విలువ రూ.కోటి ఉంటుందని నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేపడుతున్నారు. ప్రసాద్‌గౌడ్ క్యారియర్‌గా బంగారాన్ని తరలించేందుకు యత్నించినట్లు అనుమానిస్తున్నారు. అలాగే కువైట్ నుంచి కేయూ–373 విమానంలో వచ్చిన అహ్మద్ అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి కదలికలను అనుమానించి అతడి లగేజిని తనిఖీ చేయగా 268 గ్రాముల బంగారాన్ని బయటికి తీశారు. బంగారం విలువ రూ.12 లక్షలు ఉంటుదని నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎయిర్‌పోర్ట్‌లో షారూక్‌ను అడ్డుకున్న అధికారులు.. ఆ తర్వాతే బయటకు..!
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ముంబై విమానాశ్రయంలో బాలీవుడ్ స్టార్‌ను కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. అయన వద్ద నుంచి అత్యంత ఖరీదైన వాచీలను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి తిరిగి వస్తుండగా భద్రతా సిబ్బంది షారూక్‌ను నిలువరించారు. రూ.18 లక్షల లగ్జరీ వాచీలు షారూక్ ఖాన్ బ్యాగ్‌లో ఉండగా విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఆరా తీశారు. అయితే ఆ తర్వాత వాటిపై కస్టమ్ డ్యూటీ మొత్తం రూ.6.83 లక్షలను బాలీవుడ్ హీరో చెల్లించారు. కస్టమ్స్ డ్యూటీ చెల్లించాక షారూక్ ఖాన్ విమానాశ్రయం నుంచి పంపించివేశారు. అయితే షారూక్‌ను ఎయిర్‌పోర్ట్‌లో అడ్డుకోవడం ఇదేం మొదటిసారి కాదు. 2011లో విదేశీ వస్తువులను తీసుకురావడంతో కస్టమ్స్ అధికారులు రూ1.5 కోట్ల జరిమానా విధించారు. ప్రస్తుతం ఎస్ఆర్కే స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ పఠాన్‌లో నటిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె, జాన్ అబ్రహం నటిస్తున్న ఈ చిత్రం జనవరి 25, 2023న విడుదల కానుంది. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ 'టైగర్ 3'లో అతిథి పాత్రతో పాటు 'జవాన్', 'డుంకీ' కూడా కనిపించనున్నారు. దుబాయ్‌లోని షార్జాలో జరిగిన ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్- 2022లో పాల్గొన్న షారూక్ తిరిగి ముంబై చేరుకున్నారు. -
అక్రమంగా తరలిస్తున్న సిగరెట్ల పట్టివేత
శంషాబాద్: అక్రమంగా నిషేధిత సిగరెట్లను తరలిస్తున్న నిందితులను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో రూ. 2.98 లక్షల విలువ చేసే నిషేధిత సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. బెహరాన్ నుంచి జీఎఫ్274 విమానంలో హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడి వద్ద 29,800 నిషేధిత సిగరేట్లు లభ్యమయ్యాయి. కస్టమ్స్ అధికారులు నిందితుని విచారణ చేస్తున్నారు. -
విమానాశ్రయంలో ఏకంగా 109 జంతువులు కలకలం...షాక్‌లో అధికారులు
Indian Women Luggage Contain 109 Live Animals: బ్యాంకాక్ విమానాశ్రయంలో ఇద్దరు భారతీయ మహిళలను అరెస్టు చేశారు. ఏకంగా 109 జంతువులను అక్రమంగా తరలించేందుకు యత్నించి పట్టుబడ్డారు. ఈ మేరకు నిత్య రాజీ, జకియా సుల్తాన్ అనే ఇద్దరు మహిళలు రెండు లగేజ్ల్లో జంతువులు తరలించేందుకు యత్నించారు. ఆ మహిళల లగేజ్ల్లో బతికే ఉన్న రెండు తెల్ల పందికొక్కులు, రెండు అర్మడిల్లోలు, 35 తాజేళ్లు , 50 బల్లులు, 20 పాములు కనిపించాయని అధికారులు వెల్లడించారు. ఆ మహిళిద్దరూ విమానంలో చెన్నైకి వెళ్లాల్సి ఉందని చెప్పారు. వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు. ఇటీవల, గత నెలలో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు థాయ్‌లాండ్ నుంచి వన్యప్రాణులను స్మగ్లింగ్ చేసేందుకు చేసిన రెండు ప్రయత్నాలను అడ్డుకున్నారు కూడా. -
పొట్ట విప్పి చూడ డ్రగ్స్ ఉండు!
శంషాబాద్: మాదకద్రవ్యాలను క్యాప్సుల్స్ రూపంలో ప్యాక్ చేసి, కడుపులో దాచుకుని స్మగ్లింగ్ చేస్తున్న విదేశీయులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వరుసగా పట్టుబడుతున్నారు. గత నెల 21న ఒకరిని టాంజానియా జాతీయుడిని పట్టుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు రూ.11.57 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. గత నెల 26న టాంజానియాకు చెందిన మరో వ్యక్తిని పట్టుకున్నామని, ఆరు రోజుల చికిత్స అనంతరం రూ.11.53 కోట్ల విలువైన హెరాయిన్ క్యాప్సుల్స్ రికవరీ చేశామని కస్టమ్స్ అధికారులు బుధవారం ప్రకటించారు. డ్రగ్స్ మాఫియా వాళ్లు 1.38 కేజీల హెరాయిన్‌ను పారదర్శకంగా ఉండే టేప్‌తో 108 క్యాప్సుల్స్‌గా మార్చారన్నారు. టాంజానియాకు చెందిన 50 ఏళ్ల వ్యక్తిని క్యారియర్‌గా మార్చుకుని అతడికి భారత్ రావడానికి టూరిస్ట్ వీసా ఇప్పించారని చెప్పారు. అతడితో హెరాయిన్ క్యాప్సుల్స్‌ను మింగించి ఎథిహాద్ ఎయిర్వేస్కు చెందిన విమానంలో అబుదాబి మీదుగా హైదరాబాద్ పంపినట్లు తెలిపారు. ప్రయాణికుల జాబితా వడపోసి.. కస్టమ్స్ అధికారులు అనునిత్యం విదేశాల నుంచి ప్రధానంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల జాబితాను సేకరించి ప్యాసింజర్స్ ప్రొఫైలింగ్ విధానంతో వడపోస్తారు. గత నెల 26న వచ్చిన ప్యాసింజర్స్ జాబితాను ఇలాగే వడపోయగా టాంజానియా జాతీయుడిపై అనుమానం వచ్చింది. శంషాబాద్ విమానాశ్రయంలో అతడిని అదుపులోకి తీసుకున్న ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రాథమిక విచారణ చేసింది. తాను హెరాయిన్ క్యాప్సుల్స్ మింగి వస్తున్నానని, రెండు మూడు రోజుల్లో వీటిని తన వద్దకు వచ్చే రిసీవర్లకు అందించాల్సి ఉందని అంగీకరించాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు ఆరు రోజులు ఆస్పత్రిలో ఉంచి వైద్యుల పర్యవేక్షణలో 108 క్యాప్సుల్స్ బయటకు వచ్చేలా చేశారు. వీటిలో ఉన్న 1.38 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ డ్రగ్స్ ఉత్తరాదికి వెళ్లాల్సి ఉందని కస్టమ్స్ అధికారులు అనుమానిస్తున్నారు. శంషాబాద్ లో గత 15 రోజుల్లోనే మొత్తం రూ.113.47 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. -
బంగారం పట్టివేత
సాక్షి, శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడి కదలికలను అనుమానించిన అధికారులు క్షుణంగా తనిఖీ చేశారు. అతడి ప్యాంట్ లోపలి భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జేబులో 475 గ్రాముల బంగారాన్ని గుర్తిచి బయటికి తీశారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ. 24.8 లక్షలు ఉంటుందని నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకోని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: డ్రగ్స్ సరఫరాదారుల అరెస్ట్) -
బెంగళూరు ఎయిర్‌పోర్టులో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
బెంగళూరు: బెంగళూరు కెంపెగౌడ ఎయిర్‌పోర్టులో సుమారు రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్‌పోర్టులోని కార్గో సెక్షన్ వద్ద బెడ్షీట్లు, మిషన్ విడిభాగాల్లో దాచి ఉంచిన ఎక్స్టసీ మాత్రలు, హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నైజిరియన్ వ్యక్తితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితులపై దర్యాప్తు చేపటినట్లు పేర్కొన్నారు. సరుకుల రూపంలో డ్రగ్స్‌ను జాంబీయా, బెల్జియం నుంచి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అధికారులు స్వాధీనం చేసుకున్న కిలో హెరాయిన్ సుమారు రూ.7కోట్లు, 4.551 కిలోల ఎక్స్టసీ మాత్రలు దాదాపు రూ.3కోట్ల విలువ ఉంటుందని అంచనా. -
ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం అర్ధరాత్రి 6ఈ025 విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి లగేజీ తనిఖీ చేయగా అందులో 2.7 కేజీల బంగారు గొలుసులు, కవర్లలో చుట్టి తీసుకొచ్చిన బంగారం పేస్టు బయటపడ్డాయి. వీటి విలువ రూ.1.36 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పేస్టులా మార్చి.. కాళ్లకు చుట్టుకుని..
సాక్షి, శంషాబాద్(హైదరాబాద్): అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. షార్జా నుంచి జి–9–450 విమానంలో సోమవారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా అతడి వద్ద బంగారం బయటపడింది. పేస్టులా మార్చిన బంగారాన్ని రెండు కాళ్లకు టేపుతో అతికించి తీసుకొచ్చాడు. 970 గ్రాముల బరువు కలిగిన బంగారం విలువ రూ. 47.55 లక్షలుంటుందని అధికారులు పేర్కొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కూతురు ప్రేమ వివాహం.. తండ్రి ఆత్మహత్య -
వీడొక్కడే సినిమాలో లాగా.. మహిళ కడుపులో.. అధికారులు షాక్..
న్యూఢిల్లీ: కడుపులో కొకైన్ దాచుకుని విదేశాల నుంచి వస్తున్న ఒక మహిళను కస్టమ్స్ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. ఆ మహిళ ఉగాండ దేశస్థురాలిగా గుర్తించారు. ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు ప్రయాణికులను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో సదరు మహిళ కదలికలు అనుమానాస్పదంగా ఉండటాన్ని అధికారులు గుర్తించారు. తొలుత అధికారులు.. సదరు మహిళ గర్భవతి కాబోలు అని భావించారు. ఆమెను సహయం చేయడానికి ఆమెవైపు చేరుకున్నారు. అయితే.. ఆ మహిళ మాత్రం అధికారులను చూడగానే భయంతో వణికిపోయింది. అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు తమదైన శైలీలో విచారించారు. ఆ తర్వాత... మహిళను ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్‌లో సదరు మహిళ కడుపులో ఒక కేజీ కొకైన్ క్యాప్సుల్స్ ఉన్నట్లు గుర్తించారు. కాగా, వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆమె కడుపులో నుంచి 91 కొకైన్ క్యాప్సుల్స్లను బయటకు తీశారు. వాటి బరువు 993 గ్రాముల వరకు ఉన్నట్లు తెలిపారు. దీని విలువ దాదాపు రూ. 14 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ సంఘటనను చూసి అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాధారణంగా ఇప్పటి వరకు 400 గ్రాముల వరకు కొకైన్‌ను రవాణా చేయడం మాత్రమే చూశామన్నారు. ఇంత భారీ ఎత్తున కొకైన్ రవాణా చేయడం చూడలేదన్నారు. ఇది కడుపులో విస్ఫోటనం చెందితే మహిళ ప్రాణాలకే ప్రమాదమన్నారు. బాధిత మహిళ కోలుకోవడానికి మరో నాలుగు రోజులు పడుతుందని వైద్యులు తెలిపారు. మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఇదేం ఐడియారా బాబు..’, ‘వీడొక్కడే సినిమా గుర్తొచ్చిందంటూ..’ కామెంట్లు చేస్తున్నారు. Correction: The estimated value of the drug is Rs. 14 crores. This is the 24th case of seizure of NDPS covered drugs at Delhi airport this year. 32 passengers have been arrested so far. The estimated value of drug seizures would go into more than Rs. 845* crores: Customs Dept pic.twitter.com/nSgyZQo79U — ANI (@ANI) December 29, 2021 -
జ్యూస్ యంత్రంలో బంగారం
శంషాబాద్: జ్యూస్ యంత్రంలో అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ–952 విమానంలో శనివారం రాత్రి ఓ ప్రయాణికుడు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. అతని కదలికలకపై అనుమానం కలిగిన కస్టమ్స్ అధికారులు ప్రయాణికుడి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చేతితో జ్యూస్ తయారు చేసే ఓ యంత్రాన్ని కనుగొని, దాన్ని కట్ చేయగా 671 గ్రాముల బంగారం బయటపడింది. బంగారం విలువ 34.18 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎమర్జెన్సీ లాంతరులో ఆరు కిలోల బంగారం
శంషాబాద్: అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి ఈకే 524 విమానంలో మంగళవారం ఉదయం శంషాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి కదలికలపై కస్టమ్స్ అధికారులకు అనుమానం కలిగింది. అతని వస్తువులను క్షుణ్ణంగా పరిశీలిం చగా ఎమర్జెన్సీ లాంతరు వెనుక భాగంలో బ్యాటరీల సైజులో నలుపు రంగు కవర్లో అమర్చిన బంగారు కడ్డీలు బయటపడ్డాయి. 6.06 కిలోల బరువున్న ఈ బంగారం విలువ 2.96 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ప్రయాణికుడిని కొరియర్‌గా ఉపయోగించుకుని బంగారాన్ని స్మగ్లర్లు అక్రమ రవాణా చేయించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దొంగ తెలివి... చాక్లెట్లు కూడా బంగారమే!
శంషాబాద్: అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రియాద్ నుంచి జజీరా ఎయిర్‌లైన్స్ విమానంలో సోమవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికుడి కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. దీంతో కస్టమ్స్ అధికారులు అతడిని క్షుణ్నంగా తనిఖీ చేశారు. అతడి సామగ్రిలో చాక్లెట్లు, బిస్కెట్లలో 763 గ్రాముల బరువు కలిగిన బంగారు బిస్కెట్లు, నాణేలు బయటపడ్డాయి. వాటి విలువ 32.24 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. చదవండి: ‘డ్రోన్ డెలివరీ’ అద్భుతం: వరద ప్రభావిత ప్రాంతాల్లో మందుల సరఫరా’ -
ప్రయాణికుడి వద్ద బంగారం పట్టివేత
శంషాబాద్: ఓ ప్రయాణికుడు అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన యువకుడు సోమవారం రియాద్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టిన కస్టమ్స్ అధికారులకు లోదుస్తుల్లో ప్రయాణికుడు దాచిన 100 గ్రాముల బంగారు కడ్డీ బయటపడింది. దీని విలువ సుమారు 4.90 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చెప్పులో బంగారం
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణాను కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. దుబాయ్ నుంచి ఈకే–526 విమానంలో గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి కదలికలను అనుమానించిన అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అతడు ధరించిన చెప్పులకు వెండి రంగులో ఉన్న డిజైన్ పలకలను తొలగించడంతో బంగారం బయటపడింది. అంతేకాకుండా అతడి బ్యాగేజీలో ఉన్న ఫేషియల్ క్రీమ్ బాక్సులో కూడా బంగారం లభించింది. మొత్తం 495 గ్రాముల బరువు కలిగిన బంగారం విలువ 24.14 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. -
కడుపులో రూ.11 కోట్ల విలువైన కొకైన్
బెంగళూరు: బెంగళూరు ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. ఆఫ్రికన్ దేశస్తుడి నుంచి దాదాపు రూ. 11 కోట్ల విలువైన కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన ఆఫ్రికా దేశస్తుడు విమానంలో ప్రయాణం చేసేటప్పుడు ఆహారం, మంచినీరు తీసుకోలేదు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు అతడినిక స్కాన్ చేయగా.. పొట్టలో కొకైన్ ఉన్నట్లు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వైద్యుల సహాయంతో అతని కడుపులోంచి కొకైన్‌ను బయటికి తీశారు. కాగా కొకైన్ విలువ దాదాపు రూ. 11 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. చదవండి: నా చావుకు భార్య, అత్తింటివారే కారణం.. పెళ్లి చేసుకుంటానని పిలిచి లాడ్జికి తీసుకెళ్లి.. -
దొంగ తెలివి.. కుక్కర్లో 8 కిలోల బంగారం
తిరువొత్తియూరు (తమిళనాడు): చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ సిబ్బంది ఎన్ని తనిఖీలు చేస్తున్నా బంగారం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. తాజాగా దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో కుక్కర్, మిక్సీలో 8.17 కిలోల బంగారాన్ని తీసుకొచ్చి దొరికిపోయారు. ఆదివారం రాత్రి దుబాయ్ నుంచి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో 104 మంది ప్రయాణికులు వచ్చారు. కస్టమ్స్ సిబ్బంది వారిని తనిఖీ చేశారు. చెన్నై, రామనాథపురానికి చెందిన ఇద్దరిపై అనుమానం రావడంతో ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి వారి లగేజీలను పరిశీలించారు. ఎలక్ట్రానిక్ కుక్కర్, మిక్సీ తదితర గృహోపకరణాల్లో 8.17 కిలోల బంగారు బిస్కెట్లను గుర్తించారు. వాటి విలువ రూ.4.03 కోట్లు ఉంటుందని అంచనా. బంగారాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. -
చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా అక్రమ బంగారం పట్టివేత
-
పేస్ట్ రూపంలో బంగారం; కాళ్లకు వేసుకునే సాక్స్‌లో
చెన్నై: చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని బుధవారం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బహ్రయిన్ ప్రయాణికుడి వద్ద నుంచి రెండు కేజీలకు పైగా బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో ఆ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని అడ్డుకున్న అధికారులు విచారించగా బంగారం దాచిన విషయం బయటపడింది. బంగారాన్ని కరిగించి పేస్టు రూపంలో చేసి కాళ్లకు వేసుకునే సాక్స్‌లో దాచిన రెండు కేజీలు స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు -
ఎయిర్‌పోర్టులో రూ. కోటి విలువైన ఐఫోన్లు పట్టివేత
శంషాబాద్: కస్టమ్స్ సుంకం చెల్లించకుండా వాణిజ్య అవసరాల కోసం తీసుకొచ్చిన 80 ఐఫోన్లను శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బుధవారం రాత్రి షార్జా నుంచి జి9458 విమానంలో వచ్చిన ఇద్దరు ప్రయాణికులు లగేజీ బెల్టు వద్ద ఓ బ్యాగును వదిలేశారు. కస్టమ్స్ అధికారులు అనుమానించి బ్యాగును తెరిచి చూడగా అందులో సుమారు రూ. 1,00,65,000 విలువ చేసే 80 ఐఫోన్లను గుర్తించారు. బ్యాగును తీసుకొచ్చిన ఇద్దరు ప్రయాణికులతో పాటు దాన్ని తరలించేందుకు వచ్చిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లింగ్‌లో భాగంగా ఐఫోన్లను తీసుకొచ్చినట్లు నిందితులు విచారణలో తెలిపారు. -
క్యాప్యూల్స్ రూపంలో బంగారం.. ముగ్గురు మహిళలు అరెస్ట్
తిరువనంతపురం: కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గురువారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి వచ్చిన ముగ్గురు మహిళల వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా బంగారాన్ని పేస్ట్‌గా మార్చి క్యాప్యూల్స్‌లో నింపిన సదరు మహిళలు ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించారు. అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు వారిని అడ్డుకొని పరిశీలించగా క్యాప్యూల్స్ రూపంలో ఉన్న బంగారం బయటపడింది. దీంతో ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
చూయింగ్‌గమ్, చెప్పుల్లో బంగారం స్మగ్లింగ్
సాక్షి, శంషాబాద్: ఎయిర్‌పోర్టులో నలుగురు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు 471 గ్రాముల బంగారం, ఒక ఉంగరం స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి షార్జా నుంచి 6ఈ–1406 విమానంలో వచ్చిన నలుగురు ప్రయాణికుల లగేజీలను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా ఏమీ దొరకలేదు. అయితే వారి కదలికలు, మాటల తీరు అనుమానించిన అధికారులు నోట్లో తనిఖీ చేశారు. నలుగురి నోట్లో ఉన్న చూయింగ్ గమ్‌ను బయటకు తీయించగా, అందులో 471 గ్రాముల చిన్న చిన్న ముక్కలుగా ఉన్న బంగారంతో పాటు ఒక ఉంగరం బయటపడింది. ఈ బంగారం విలువ సుమారు రూ.20.67 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. అలాగే షార్జా నుంచి ఎయిర్ అరేబియా జి–9458 విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి చెప్పుల్లో 694 గ్రాముల బంగారం బయటపడింది. ఈ చెప్పులను కవర్లు, కార్బన్ పేపర్లతో ప్రత్యేకంగా తయారు చేయించినట్లు అధికారులు గుర్తించారు. ఈ బంగారం విలువ రూ.27.04 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
సీఎం విజయన్‌కు తలబొప్పి
కొచ్చి: ఎన్నికల నేపథ్యంలో, బంగారం అక్రమ రవాణా కేసు తాజా పరిణామాలు కేరళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించేలా ఉన్నాయి. ప్రధానంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఇది పెద్ద తలనొప్పిలా తయారైంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్, అసెంబ్లీ స్పీకర్ పి శ్రీరామకృష్ణన్, మరో ముగ్గురు మంత్రులను గురించి ఈ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్నా సురేశ్ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించినట్టు కస్టమ్స్ చీఫ్ కేరళ హైకోర్టుకి సమర్పించిన రిపోర్టులో తెలిపారు. ముఖ్యమంత్రి, స్పీకర్ సహా మరో ముగ్గురు మంత్రులు అక్రమ ఆర్థిక లావాదేవీలకు పాల్పడినట్టు స్వప్నా సురేశ్ దర్యాప్తులో వెల్లడించిన విషయం రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు కీలక ప్రచార అస్త్రంగా మారనుంది. అయితే అధికార సీపీఎం మాత్రం రానున్న ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వ ఎత్తుగడగా ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్, స్పీకర్ శ్రీరామకృష్ణన్‌లు యుఏఈ కాన్సుల్ జనరల్ సహాయంతో అక్రమ ఆర్థిక లావాదేవీలకు పాల్పడినట్టు కీలక నిందితురాలు స్వప్న సురేశ్ స్పష్టం చేశారని, కస్టమ్స్ కమిషనర్ సుమిత్ కుమార్, కేరళ హైకోర్టుకి సమర్పించిన ఒక రిపోర్టులో తెలిపారు. తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేట్ మాజీ ఫైనాన్స్ చీఫ్, ఒమన్‌లోని మస్కట్‌కు 1,90,000 అమెరికన్ డాలర్లను(1.30 కోట్ల రూపాయలను) అక్రమ రవాణా చేసినట్లు డాలర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బంగారం స్మగ్లింగ్ కేసులో సహ నిందితులుగా ఉన్న స్వప్నా సురేశ్, సరిత్ పిఎస్‌లను, డాలర్ కేసుతో సంబంధం ఉన్నదన్న కారణంగా కస్టమ్స్ అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. విజయన్‌కి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే హక్కులేదని, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చెన్నితాల అన్నారు. ఏప్రిల్ 6న జరిగే ఎన్నికల్లో కేరళలో తిరిగి లెఫ్ట్ ప్రభుత్వం వస్తుందని రూఢీ కావడంతోనే బీజేపీ ఆందోళనలో పడిందని సీపీఎం ఆరోపించింది. సీఎం విజయన్, ప్రధాన కార్యదర్శి, ఆయన వ్యక్తిగత సిబ్బందితో తనకు సన్నిహిత సంబంధాలున్నట్టు స్వప్న సురేశ్ పేర్కొన్నట్టు కస్టమ్స్ అధికారి తెలిపారు. ముఖ్యమంత్రి, స్పీకర్ ఆదేశాల మేరకు విదేశీ కరెన్సీని అక్రమంగా రవాణా చేసిన విషయం తనకు తెలుసునని స్వప్న అంగీకరించినట్లు కస్టమ్స్ కమిషనర్ వెల్లడించారు. ‘‘కాన్సులేట్ సాయంతో, ముఖ్యమంత్రి, స్పీకర్లు, విదేశీ కరెన్సీ అక్రమ రవాణా చేసిన విషయం తెలుసునని ఆమె స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గంలోని ముగ్గురు మంత్రులు, స్పీకర్ల అసంబద్ధమైన, అక్రమ కార్యకలాపాలను గురించి ఆమె బహిరంగపరిచారు’’అని కస్టమ్స్ అధికారులు హై కోర్టుకి సమర్పించిన రిపోర్టులో పేర్కొన్నారు. గత ఏడాది జూలై 5న తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్‌కు వస్తోన్న పార్శిల్స్‌లో 30 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో ఈ స్మగ్లింగ్ రాకెట్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత కేసుతో సంబంధం ఉన్న స్వప్నా సురేశ్ సహా 15 మందిని అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
బెంగళూరు ఎయిర్‌పోర్టులో 206 ఐఫోన్లు సీజ్
సాక్షి, దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రూ.2.8 కోట్ల విలువైన ఆపిల్ కంపెనీ ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అమెరికా పాస్‌పోర్టు కలిగిన భారతీయ దంపతుల నుంచి వీటిని సీజ్ చేశారు. ఫిబ్రవరి 13న ముంబై నుంచి ఫ్రాన్స్ వెళ్లిన దంపతులు ఆదివారం రాత్రి ప్యారిస్ నుంచి విమానంలో బెంగళూరు విమానాశ్రయంలో దిగారు. అధికారులు వారి లగేజీని సోదా చేయగా రూ.2.8 కోట్ల విలువ చేసే 206 ఐఫోన్ 12ప్రొ మాక్స్ ఫోన్లు బయటపడ్డాయి. బిల్లులు చూపకపోవడంతో ఫోన్లను స్వాధీనం చేసుకుని, ఆ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: (పెట్రోలు బాంబు మంటల్లో హీరోకు గాయాలు) -
‘వందే భారత్ మిషన్’నూ వదల్లేదు..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. వందే భారత్ మిషన్ విమానాల్లో వస్తున్న ప్రయాణికుల్లో కొంతమంది అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారు. దామన్ నుండి వస్తున్న 11 మంది ప్రయాణికులు అధికారులు కన్నుగప్పి లోదుస్తుల్లో బంగారాన్ని తరలించడానికి ప్రయత్నించారు. వారి నుంచి నుంచి కోటి అరవై లక్షల రూపాయలు విలువైన 3.11 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
బంగారు ఇస్త్రీపెట్టెలు
శంషాబాద్: బంగారం అక్రమ రవాణాను అధికారులు అడ్డుకుంటున్నా.. అక్రమార్కులు మాత్రం కొత్త దారులు వెతుకుతూనే ఉన్నారు. తాజాగా దుబాయి నుంచి భారీఎత్తున బంగారాన్ని తీసుకు వచి్చన ఓ ప్రయాణికుడిని ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి దుబాయి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి కదలికలను కస్టమ్స్ అధికారులు అనుమానించారు. అతడి వద్ద ఉన్న బ్యాగుల్లోని 4 ఇస్త్రీ పెట్టెలను విప్పిచూడగా అందులో కాయిల్స్ రూపంలో 9.2 కేజీల బంగారం బయటపడింది. బహి రంగ మార్కెట్లో ఈ బంగారం విలువ రూ.3.46 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. నిందితుడిని అదు పులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
దాని కోసం పేద, మధ్య తరగతి మహిళలే టార్గెట్
సాక్షి, సిటీబ్యూరో: స్మగ్లింగ్ చేసేందుకు ప్రధాన సూత్రధారులు మహిళలను క్యారియర్లుగా నియమించుకుంటున్నారు. కస్టమ్స్ అధికారులు మహిళలపై ఎక్కువగా దృష్టిసారించరనే ఉద్దేశంతోనే వారిని వినియోగించుకుంటున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. దుబాయ్ నుంచి రూ.3.62 కోట్ల విలువైన బంగారంతో వస్తూ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల చిక్కిన జియా ఉన్నిసా ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రాథమిక ఆధారాలను బట్టి ప్రధాన సూత్రధారులైన స్మగ్లర్ల తరఫున ఈమె క్యారియర్‌గా పని చేస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. గడిచిన కొన్నేళ్లలో ఈ తరహాలో బంగారం, మాదకద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తూ 9 మంది మహిళలు పట్టుబడ్డారు. సాధారణంగా స్మగ్లర్లు అనగానే అందరి మదిలో మెదిలేది పురుషులే. దీనికి తోడు మహిళలూ.. అందునా గర్భంతో, పసి పిల్లలతో వచ్చే వారిని అధికారులు తక్కువగా అనుమానిస్తారు. దీంతో దుబాయ్ తదితర దేశాల నుంచి వచ్చే పేద, మధ్య తరగతి మహిళలకు కమీషన్ ఆశ చూపుతున్న బడా స్మగ్లర్లు వారికి బంగారం, మాదకద్రవ్యాలు అప్పగిస్తున్నారు. డ్రగ్స్ మాట అటుంచితే మహిళా క్యారియర్లను ఎక్కువగా ఆయా దేశాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనే పసిడి ఇచ్చి పంపుతున్నారు. మాదకద్యవాలను కడుపులో దాచి గర్భవతులుగా, చంటి బిడ్డలతో వస్తున్న వారికి ఇచ్చి పంపిస్తున్నారు. డీఎఫ్‌ఎండీల వద్దా బురిడీ.. వివిధ రూపాల్లో, వివిధ పంథాల్లో దుస్తుల్లో దాచుకుని బంగారం తీసుకొస్తున్న మహిళలను విమానాశ్రయాల్లోని డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్ (డీఎఫ్ఎండీ)లు కూడా కొంత వరకు సహకరిస్తున్నాయి. ఏదైనా అక్రమరవాణా విషయం కస్టమ్స్ అధికారులు గుర్తించాలంటే పక్కా సమాచారం, ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) నిఘాల కంటే డీఎఫ్‌ఎండీఏ ఎక్కువగా ఉపకారం చేస్తాయి. క్యారియర్లు దాటుతున్న సమయంలో లోపల దాచి ఉంచిన లోహాలను గుర్తించి డీఎఫ్ఎండీలు శబ్దం చేస్తాయి. మహిళలు సాధారణంగానే కొంతవరకు నగలు ధరించి ఉంటారు. వీటి వల్లే శబ్దం వచ్చి ఉంటుందని అధికారులు భావించే ఆస్కారం ఉంటుంది. అందుకే బడా స్మగ్లర్లు మహిళల్ని క్యారియర్లుగా వాడుకుంటున్నారు. ముమ్మర కసరత్తు బడా స్మగ్లర్లు మహిళల్ని అక్రమరవాణాకు వినియోగించుకుంటున్నారనే ఉద్దేశంతో ప్రతి మహిళలను ఆపడం, క్షుణ్నంగా తనిఖీ చేయడం సాధ్యం కాదు. అలా చేస్తే అమాయకులు సైతం తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కస్టమ్స్ సహా ఇతర ఏజెన్సీల అధికారులు మహిళా ప్రయాణికుల జాబితాను ముందే సేకరిస్తున్నారు. వారు విదేశాలకు ఎప్పుడు వెళ్లారు.. ఆఖరిసారి ఎప్పుడు వచ్చారు? ఏ వీసాపై వెళ్లారు.. వారి నేపథ్యం ఏంటి.. తదితరాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పదమైన వారిని మాత్రమే అదుపులోకి తీసుకుంటూ ఫలితాలు సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు మహిళా క్యారియర్లు కస్టమ్స్ కన్నుగప్పి తప్పించుకుంటున్నారు. జియా ఉన్నిసా సైతం ఎగ్జిట్ గేటు వరకు వచ్చేశాక ముందే సమాచారం ఉన్న డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. కీలక వ్యక్తులు చిక్కడం కష్టమే ఈ తరహాలో అక్రమ రవాణా చేస్తూ చిక్కుతున్న మహిళల్ని ఎంత విచారించినా... ముఠా వెనుక ఉన్న సూత్రధారుల్ని కనిపెట్టడం కష్టసాధ్యంగా మారుతోందని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. ఆయా దేశాల్లోని విమానాశ్రయాల్లో వీరికి బంగారం అప్పగించే ముఠా సభ్యులు దాన్ని ఎవరికి డెలివరీ చేయాలో మాత్రం మహిళలకు చెప్పట్లేదు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చాక ఓ ప్రాంతంలో వేచి ఉండాలనో.. పలానా హోటల్/లాడ్జిలో బస చేయాలనో సూచిస్తున్నారు. ముఠాకు చెందిన రిసీవర్లు అక్కడికే వెళ్లి బంగారం తీసుకుని కమీషన్లు చెల్లిస్తున్నారు. ఈ కారణంగానే విమానాశ్రయాల్లో పట్టుబడుతున్న క్యారియర్ల కేసుల్లో పురోగతి ఉండట్లేదని వివరిస్తున్నారు. అయితే జియా ఉన్నిసా వ్యవహారాన్ని మాత్రం అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఆమెను ఓ స్టార్ హోటల్లో ఉంచి మరీ ఈ వ్యవహారం సాగిస్తుండటంతో సూత్రధారుల్ని గుర్తించే పనిలో పడ్డారు. 4కేజీలుబ్యాంకాక్,దుబాయ్ నుంచి వచ్చిన నలుగురు మహిళల్ని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు వారి నుంచి 4 కేజీలబంగారం స్వాధీనం చేసుకున్నారు. 793గ్రాముల కొకైన్దుబాయ్ నుంచి గర్భవతిగా వచ్చిన సౌతాఫ్రికా మహిళ మూసా తన కడుపులో 793 గ్రాముల కొకైన్‌తో చిక్కింది. ఉదాహరణలు ఎన్నో..ళీ సౌదీ నుంచి తన భర్త, ఏడాదిన్నర కుమారుడితో కలసి వచ్చిన మహిళ 1.75 కేజీల బంగారంతో పట్టుబడింది. ♦ సింగపూర్ నుంచి వచ్చిన ముగ్గురు మహిళల్ని తనిఖీ చేసిన అధికారులు 5.1 కేజీల బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ♦ యూఏఈ నుంచి వచ్చిన ఇద్దరు మహిళల వద్ద నుంచి 1.3 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. -
ఒకేరోజు ఇద్దరు స్మగ్లర్లు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధీనంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) అధికారులు బుధవారం ఒక్క రోజే ఇద్దరు స్మగ్లర్లను పట్టుకున్నారు. వీరిలో ఒకరు రెక్టమ్ కన్సీల్మెంట్ రూపంలో, మరొకరు పౌడర్‌గా మార్చి బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారు. వీరిద్దరి నుంచి 4 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు సూత్రధారుల కోసం లోతుగా విచారిస్తున్నారు. ప్రత్యేక శస్త్రచికిత్సలు.. ఈ స్మగ్లింగ్ వ్యవహారంలో సూత్రధారులుగా ఉన్న వారి వద్ద పనిచేస్తూ లేదా కమీషన్ తీసుకుంటూ పసిడిని దేశంలోకి తీసుకువచ్చే వారిని క్యారియర్లు అంటారు. ఈ కీలక వ్యక్తులు సుదీర్ఘకాలం తమ వద్ద పనిచేసే క్యారియర్లకు ముంబై, కేరళల్లో ప్రత్యేక శస్త్రచికిత్సలు చేయించడం ద్వారా వారి మలద్వారాన్ని అవసరమైన మేర వెడల్పు చేయిస్తున్నారు. ఇందులో గరిష్టంగా రెండు కేజీల వరకు బంగారాన్ని చిన్న బిస్కెట్ల రూపంలో పెట్టేలా ఏర్పాటు చేస్తున్నారు. బంగారానికి నల్ల కార్బన్ పేపర్ చుట్టడం ద్వారా స్కానర్‌కు చిక్కకుండా మలద్వారంలో పెట్టుకుంటున్న క్యారియర్లు అక్రమ రవాణాలకు పాల్పడుతున్నారు. బుధవారం చిక్కిన ఇద్దరిలో ఒకరు ఈ రూపంలోనే పసిడిని తీసుకువచ్చారు. హెన్నాలో బంగారం పొడి.. ఇతడు పట్టుబడిన కాసేపటికే మరో క్యారియర్ సైతం పట్టుబడ్డాడు. ఇతగాడు బంగారాన్ని పొడి చేసి.. హెన్నాతో (మెహెందీ పొడి) కలిపి.. పేస్ట్‌లా మార్చి ఎవరికీ అనుమానం రాకుండా అక్రమ రవాణా చేస్తున్నాడు. ఇలా పసిడిని పొడి రూపంలో తీసుకువచ్చి చిక్కిన కేసులూ అనేక ఉంటున్నాయి. ఆ పొడి కూడా బంగారం రంగులోనే ఉండటంతో పట్టుబడే అవకాశాలు ఎక్కువ. దీంతో మరో అడుగు ముందుకు వేసిన స్మగ్లర్లు బంగారం పొడిని గోధుమ రంగులో ఉన్న హెన్నాలో కలిపేస్తున్నారు. ఇలా తన రంగును కోల్పోయి, పౌడర్ రూపంలోకి మారిన బంగారం, హెన్నా మిక్స్‌ను పేస్ట్‌గా మార్చడానికి చాక్లెట్ తయారీకి వినియోగించే లిక్విడ్స్ వాడుతున్నారు. ఇతర కెమికల్స్ వాడితే విమానంలో తరలించడం కష్టమనే భావంతో ఈ లిక్విడ్స్ వినియోగించి ఆ మిక్స్‌ను పేస్ట్‌గా మారుస్తున్నారు. ఇలా తయారైన గోధుమ రంగు పేస్ట్‌ను ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసిన స్మగ్లర్లు దాన్ని బ్రౌన్ కవర్లలో ఉంచి పైన ప్లాస్టర్లు వేస్తున్నారు. ఇలా తీసుకువచ్చిన వ్యక్తినీ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. -
కిలో బంగారం దాటించేస్తూ అడ్డంగా దొరికాడు..
జైపూర్ : అడ్డదారుల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తులు అధికారుల కళ్లు కప్పేందుకు కొత్తదారులు వెతుకుతున్నారు. జైపూర్ ఎయిర్‌పోర్టులో 30 సంవత్సరాల వ్యక్తి తన మలద్వారంలో బంగారాన్ని దాచి దేశంలోకి ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నాన్ని అధికారులు వమ్ము చేశారు. థాయ్ ఎయిర్వేస్ విమానంలో ఆదివారం రాత్రి జైపూర్ చేరుకున్న పంకజ్ సాదువాని ప్రవర్తనపై కస్టమ్స్ అధికారులకు అనుమానం రావడంతో కస్టడీలోకి తీసుకుని తనిఖీలు చేయడంతో అవాక్కయ్యారు. తాను కిలో బంగారం విలువకలిగిన ఆరు పీస్‌లను తన ప్రైవేట్ పార్ట్స్‌లో దాచానని విచారణ సందర్భంగా సాధువాని చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. సాధువానిని తదుపరి విచారణ నిమిత్తం ప్రశ్నిస్తున్నామని కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ హోషియార్ సింగ్ వెల్లడించారు. -
పాదరక్షల్లో బంగారం తరలింపు
టీ.నగర్(చెన్నై): చెన్నై మీనంబాక్కం విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న రూ.33 లక్షల విలువగల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు మంగళవారం రాత్రి స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేశారు. చెన్నైకి చెందిన అస్మద్‌ఖాన్ (34) తాను ధరించిన పాదరక్షల అడుగు భాగంలో బంగారాన్ని దాచి తీసుకువస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అలాగే కేరళకు చెందిన ప్రకాశ్ (32) సూట్‌కేసులో దాచి తీసుకువస్తుండగా పట్టుకున్నారు. కాగా, సింగపూర్‌కు వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన చెన్నైకి చెందిన మహ్మద్ ఆసిఫ్ అనే వ్యక్తి దగ్గర కస్టమ్స్ అధికారులు రూ.5 లక్షల విలువైన అబుదాబి దేశ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అతను తన లోదుస్తుల్లో ఆ కరెన్సీని దాచుకుని వచ్చి తనిఖీల్లో పట్టుబడ్డాడు. -
స్మగ్లింగ్.. డెడ్చీప్లో మొబైల్ ఫోన్స్
సాక్షి, అమరావతి బ్యూరో : ఆటబొమ్మల పేరుతో చైనా నుంచి మనదేశంలోకి భారీగా డ్రోన్లు, సెల్ఫోన్లు స్మగ్లింగ్ చేస్తున్న రాకెట్ బాగోతం బయటపడింది. పక్కా సమాచారంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) బృందాలు తనిఖీ చేయడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. డీఆర్ఐ వర్గాలు అనధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... కొన్నేళ్లుగా పెరిగిన చైనా దిగుమతులు.. చైనా నుంచి కృష్ణపట్నం పోర్టుకు కొన్నేళ్లుగా ఆట వస్తువులు భారీగా దిగుమతి అవుతున్నాయి. అయితే పిల్లల ఆట వస్తువుల పేరుతో సెల్ఫోన్లు, కెమెరా కలిగిన డ్రోన్లు అక్రమంగా దిగుమతి అవుతున్నట్లు హైదరాబాద్‌లోని డీఆర్ఐ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. వారు ఇచ్చిన సమాచారంతో విజయవాడలోని డీఆర్ఐ ప్రాంతీయ ఆపరేషన్స్ విభాగం అధికారులు ఈనెల 3, 4వ తేదీల్లో కృష్ణపట్నం పోర్టులో తనిఖీలు చేశారు. ఆటవస్తువుల పేరుతో దిగుమతి అయిన కంటైనర్లను తనిఖీ చేయడంతో విషయం బట్టబయలైంది. హైదరాబాద్ తరలించేందుకే? చైనా నుంచి వచ్చిన కంటైనర్లలో భారీ సంఖ్యలో సెల్ఫోన్లు, డ్రోన్లు ఉన్నట్లు గుర్తించారు. ఓ కంటైనర్‌లో దాదాపు 5,500 సెల్ఫోన్లు, 5 ఫాంటమ్ 4 డ్రోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలున్నాయి. వీటి విలువ దాదాపు రూ.2 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇతర కంటైనర్లలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. డ్రోన్లు అక్రమంగా దిగుమతి కావడం ఆందోళనకరమైన అంశమని అధికారవర్గాలు చెబుతున్నాయి. డ్రోన్లను కృష్ణపట్నం పోర్టు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తనిఖీలపై డీఆర్ఐ కేంద్ర కార్యాలయానికి నివేదించిన అనంతరం అధికారికంగా ప్రకటన విడుదల చేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇలా స్మగ్లింగ్ చేసిన వాటిని వారంటీ, గ్యారంటీ లేకుండా తక్కువ ధరకు విక్రయిస్తున్నారని అధికారులు చెప్పారు. వీటివల్ల దేశ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని అన్నారు. అక్రమ డ్రోన్లు ఎవరి కోసం? చైనా నుంచి అక్రమంగా దిగుమతి చేస్తున్న సెల్ఫోన్లు, డ్రోన్లు ఎక్కడికి తరలిస్తున్నారనే అంశంపై డీఆర్ఐ వర్గాలు ఆరా తీస్తున్నాయి. డ్రోన్ల వినియోగానికి పోలీసుల అనుమతి తప్పనిసరి. విచ్ఛిన్నకర శక్తులు సంఘ విద్రోహ కార్యకలాపాలకు వీటిని వినియోగించే ప్రమాదం ఉండటంతో డ్రోన్ల వాడకంపై స్పష్టమైన విధివిధానాలను రూపొందించారు. -
ముడుపులతో పట్టుబడ్డ కస్టమ్స్ అధికారులు..
సాక్షి, ముంబయి: లంచాలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన నలుగురు కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్లను, మరో ఇద్దరిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ముడుపులు తీసుకుంటున్న డిప్యూటీ కమిషనర్లు ముఖేష్ మీనా, రాజీవ్ కుమార్ సింగ్, సుదర్శన్ మీనా, సందీప్ యాదవ్, సూపరింటెండెంట్ మనీష్ సింగ్ మరో వ్యక్తి నీలేష్ సింగ్‌లను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కన్సైన్మెంట్కు అనుమతి ఇచ్చేందుకు కస్టమ్స్ అధికారులు రూ 50 లక్షల ముడుపులు అడిగారనే ఫిర్యాదుపై సీబీఐ ఈ దాడులు చేపట్టింది. తొలుత రూ 5 లక్షలు లంచం తీసుకుంటూ ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు, ఓ ప్రైవేట్ వ్యక్తి పట్టుబడగా, వారి ద్వారా మిగిలిన అధికారుల పాత్రనూ సీబీఐ పసిగట్టి వారినీ అదుపులోకి తీసుకుంది. నిందితుల కార్యాలయాలు, నివాసాలపై ఏకకాలంలో సీబీఐ దాడులు చేపట్టింది. -
భారీ మొత్తంలో ఫారెన్ కరెన్సీ పట్టివేత
సాక్షి, చెన్నై : భారత్ నుంచి విదేశాలకు ఫారెన్ కరెన్సీని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. అతని వద్ద దాదాపు కోటిన్నర విలువచేసే అరబ్ దేశాలకు సంబందించిన కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా విదేశీ నగదు తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో.. దుబాయ్ వెళ్లే ప్రయాణికులపై నిఘా పెట్టామని, దీంతో చెన్నైకు చెందిన సయ్యద్ అనే వ్యక్తి వద్ద ఈమేరకు భారీ విదేశీ నగదు పట్టుబడిందని కస్టమ్స్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు. అరబ్ దేశాలకు చెందిన ఖతార్, ఒమన్, కువైట్, సౌదీ అరేబియాలకు చెందిన కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. -
విమానాశ్రయంలో కిలో బంగారం పట్టివేత
శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు వేర్వేరు ప్రయాణికుల నుంచి 1,047 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఉదయం జజీరా ఎయిర్‌లైన్స్ జె9–608 విమానంలో కువైట్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ వ్యక్తితో పాటు మహిళ కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు వారిని తనిఖీ చేశారు. వ్యక్తి తన ప్యాంటు వెనుక భాగంలో దాచిన 4 బంగారు కడియాలు, మహిళ తన దుస్తుల లోపల దాచుకున్న 6 బంగారు కడియాలు బయటపడ్డాయి. సుమారు 1,047 గ్రాములు బరువు ఉన్న వీటి విలువ రూ.32,87,580 ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. వీరిద్దరు కలిసే బంగారం అక్రమ రవాణా చేసినట్లు అనుమానిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మరో నౌకను అదుపులోకి తీసుకున్న ద.కొరియా!
సియోల్: ఐక్యరాజ్యసమితి(ఐరాస) ఆంక్షలను ఉల్లంఘించి ఉత్తర కొరియాకు ముడిచమురును సరఫరా చేస్తున్న మరో నౌకను దక్షిణ కొరియా అదుపులోకి తీసుకుంది. ద.కొరియాలోని ప్యాంగ్‌టెక్–డాంగ్జిన్ పోర్టులోపనామాకు చెందిన 5,100 టన్నులున్న ‘కొటి’నౌకను డిసెంబర్ 21న స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. ఈ నౌక ఉ.కొరియాకు చెందిన నౌకకు చమురును బదిలీ చేసిందని పేర్కొన్నారు. ఈ నౌకా సిబ్బందిని పోలీసులు, నిఘా సిబ్బంది ప్రశ్నిస్తున్నారన్నారు. -
షూలలో రెండు కిలోల బంగారం బిస్కెట్లు
తమిళనాడు: చెన్నై విమానాశ్రమానికి అక్రమంగా తెచ్చిన రెండు కిలోల బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. షార్జా నుంచి ఆదివారం సాయంత్రం తిరువనంతపురం మార్గంలో చెన్నైకి ఓ విమానం వచ్చింది. అందులో వచ్చిన ప్రయాణికులను అధికారులు క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తిరువనంతపురంలోని కోలికోడ్‌కు చెందిన ఇస్రాత్ (33) పట్టుబడ్డాడు. ఆయన ధరించిన షూలను తనిఖీ చేయగా రెండు కిలోల బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. ఆయన వాటిని షూలోని ప్రత్యేక అరలో అమర్చుకుని అక్రమంగా తరలించేందుకు యత్నించాడు. వీటి విలువ రూ.60 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. రెండు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని, అతనిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. -
బంగారంపై మెటల్ కోటింగ్!
- ట్రాలీ సూట్ కేస్‌కు బిగించి స్మగ్లింగ్ - దుబాయ్ నుంచి తెచ్చిన కర్ణాటక వాసి - విమానాశ్రయంలో పట్టుకున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: అక్రమంగా బంగారం దేశంలోకి తీసుకొస్తున్న ఒకరిని శంషాబాద్ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు బుధవారం పట్టుకున్నారు. పసిడిపై మెటల్ కోటింగ్ వేసి దుబాయ్ నుంచి తీసుకువస్తూ చిక్కాడు. కర్ణాటకకు చెందిన ఇతని నుంచి రూ.25.33 లక్షల విలువైన 866 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేస్తున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా అధికారు లు.. ప్రయాణికుల జాబితాను పరిశీలించారు. కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన ఓ ప్రయాణికుడు హైదరాబాద్‌కు వస్తున్నట్లు గుర్తించారు. భత్కల్‌కు సమీపంలో బెంగళూరు, మంగళూరు విమానాశ్రయాలు ఉన్నా.. హైదరాబాద్‌కు వస్తుండటం, అదీ ఇదే తొలిసారి కావడంతో అనుమానం వచ్చింది. దీంతో భత్కల్ వాసిని అదుపులోకి తీసుకుని.. అతని ట్రాలీ సూట్‌కేస్‌కు ఉండే మెటల్ పట్టీలను పరిశీలించారు. పట్టీలను బంగారంతో తయారు చేయించి వాటిపై మెటల్ కోటింగ్ వేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ పట్టీల్లో 866 గ్రాముల బంగారం ఉన్నట్లు తేలింది. దీంతో భత్కల్ వాసిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే టికెట్ ధర తక్కువగా ఉన్నందునే హైదరాబా ద్‌కు వచ్చినట్లు అతడు చెబుతున్నాడు. -
నోట్ల మార్పిడికి ముగిసిన గడువు
న్యూఢిల్లీ: రద్దయిన నోట్లను మార్పిడిచేసుకోవడానికి విదేశాల్లో ఉన్న భారతీయులకిచ్చిన గడువు శుక్రవారంతో ముగిసింది. విధానపరమైన అవగాహన లోపం, పరిమిత సంఖ్యలో కౌంటర్ల ఏర్పాటు వల్ల ఇంకా చాలా మంది నోట్లు మార్చుకోలేదని తెలిసింది. తలా రూ. 25 వేలకు మించకుండా ఎన్ఆర్ఐలు తమ వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకోవడానికి మాత్రం గడువు మరో మూడు నెలలు(జూన్ 30 వరకు) మిగిలే ఉంది. విదేశాల నుంచి వచ్చే ఎన్ఆర్ఐలు విమానాశ్రయాల్లోనే తమ వద్దనున్న పాతనోట్ల వివరాలను కస్టమ్స్ అధికారులకు తెలిపి ఒక సర్టిఫికెట్‌ను పొందాలి. నోట్ల మార్పిడి వెసులుబాటు కల్పించిన ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, నాగ్‌పూర్ ఆర్బీఐ కేంద్రాల్లో చివరి రోజైన శుక్రవారం ప్రజలు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిలబడ్డారు. -
శంషాబాద్‌లో బంగారం స్వాధీనం
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీలు చేపడుతున్న కస్టమ్స్ అధికారులు ఓ వ్యక్తి నుంచి 226 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి శుక్రవారం ఇక్కడికి చేరుకున్న ఓ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
గోల్డ్ స్మగ్లర్ ‘డబుల్ ధమాకా’
⇒ ఒకే సమయంలో రెండు రకాలుగా అక్రమ రవాణా ⇒ చెన్నై వాసిని పట్టుకున్న ఎయిర్పోర్ట్ కస్టమ్స్ టీమ్ సాక్షి, హైదరాబాద్: విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా రవాణా చేసే స్మగ్లర్లు నానాటికీ తెలివి మీరుతున్నారు. గతానికి భిన్నంగా అక్రమ రవాణా అవుతున్న పసిడిని శంషాబాద్ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు ఆదివారం తెల్లవారుజామున పట్టుకున్నారు. చెన్నైకి చెందిన ఈ స్మగ్లర్ ‘రెండు రకాలు’గా బంగారం తీసుకువస్తూ చిక్కాడు. కస్టమ్స్ అధికారులు ఇతడి నుంచి రూ.59.10 లక్షల విలువైన రెండు కేజీల పసిడి స్వాధీనం చేసుకున్నారు. ఎల్ఈడీ లైట్లలో అమర్చి... స్మగ్లర్లను కనిపెట్టడానికి కస్టమ్స్ అధికారులు కొన్ని దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు సంబంధించి ప్రొఫైలింగ్ చేపడుతుంటారు. ఆ వ్యక్తి ఎంత కాలంలో, ఎన్నిసార్లు, ఏఏ దేశాల నుంచి వచ్చి వెళ్లాడనేది అధ్యయనం చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం టైగర్ ఎయిర్వేస్ ఫ్లైట్‌లో సింగపూర్ నుంచి వచ్చిన ఓ తమిళనాడు వాసిపై అనుమానం వచ్చింది. చెన్నైకు చెందిన ఇతగాడు గడిచిన కొన్ని నెలల్లో పదేపదే సింగపూర్ వెళ్లి వచ్చిన విషయాన్ని పాస్‌పోర్ట్ ఆధారంగా గుర్తించారు. చెన్నైలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నప్పటికీ ఒక్కోసారి ఒక్కో విమానాశ్రయం లో దిగుతుండటంతో అనుమానించిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) అదుపు లోకి తీసుకుంది. ఇతడు లగేజీలో 2 ఎల్ఈడీ లైట్లను తీసుకువచ్చాడు. తక్కువ ఖరీదైన ఈ తరహా లైట్లను విదేశాల నుంచి తీసుకురా వడానికి ఎలాంటి అభ్యంతరం లేకపోవడం తో వీటిని ఎంచుకున్నాడు. 800 గ్రాముల బంగారాన్ని 8 బిస్కెట్లుగా మార్చి ఆ లైట్ల వెనుక ఉండే భాగంగా అమర్చాడు. ఈ రెం డింటినీ ఎక్స్‌రే స్కానింగ్ ద్వారా పరిశీలించిన ఏఐయూ అధికారులు రొటీన్‌కు భిన్నమైన షేడ్స్ గుర్తించారు. దీంతో వాటిని విప్పి చూడగా బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. అతడిని పూర్తిగా సోదా చేశారు. దీంతో ‘రెక్టమ్ కన్సీల్మెంట్’ను గుర్తించారు. 2 కేజీల బంగారం స్వాధీనం సుదీర్ఘకాలం స్మగ్లర్లు, క్యారియర్లుగా పని చేసేవారు ముంబై, కేరళల్లో ప్రత్యేక శస్త్రచికిత్సల ద్వారా వారి మలద్వారాన్ని అవసరమైన మేర వెడల్పు చేసుకుంటున్నా రు. ఇందులో గరిష్టంగా 2 కేజీల వరకు బంగారాన్ని చిన్న బిస్కెట్ల రూపంలో పెట్టేలా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉం టుంది. ఆదివారం చిక్కిన చెన్నై వాసి 1,200 గ్రాముల 12 బంగారం బిస్కెట్లను రెక్టమ్ కన్సీల్మెంట్ ద్వారా తీసుకువచ్చా డు. ఇతడి నుంచి 2 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నెల న్నరలో రెక్టమ్ కన్సీల్మెంట్కు చిక్కడం ఇది రెండోసారని అధికారులు చెబుతున్నారు. -
యూపీఎస్సీ తాత్కాలిక చైర్మన్‌గా డేవిడ్
కేంద్ర మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తాత్కాలిక చైర్మన్‌గా విద్యావేత్త డేవిడ్ ఆర్ సిమ్లిహ్ నియామకానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డేవిడ్ 2012 జూన్ నుంచి యూపీఎస్సీ సభ్యునిగా ఉన్నారు. షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్ట్రన్ హిల్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసిన డేవిడ్.. అదే వర్సిటీలో పలు హోదాల్లో పనిచేశారు. ఈశాన్య రాష్ట్రాల చరిత్రపై ఆయన అనేక పుస్తకాలు రాశారు. మరోవైపు కస్టమ్స్ అంశాలకు సంబంధించి భారత్ – ఉరుగ్వే మధ్య ఒప్పందాన్ని కేబినెట్ ఆమోదించింది. ఈ ఒప్పందం జరిగితే ఇరు దేశాల కస్టమ్స్ అధికారులు సమాచార మార్పిడి.. నిఘా విషయాలను బదిలీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. -
ప్రయాణికుడి నుంచి బంగారం స్వాధీనం
శంషాబాద్: బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ప్రయాణి కుడిని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళ వారం ఉదయం షార్జా నుంచి వచ్చిన విమానాన్ని తనిఖీ చేస్తుండగా ఓ ప్రయాణికుడి లగేజీలో అరకేజీ బరువున్న బంగారు బిస్కెట్లు బయట పడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుడిని పోలీసుస్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. -
కరాచీ టు సిటీ వయా షార్జా!
- అంతర్జాతీయ నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు - ముగ్గురు నిందితుల అరెస్టు, రూ. 9 లక్షలు సీజ్ - తొలిసారిగా వెలుగులోకి విమానమార్గ రవాణా సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు అయింది. పాకిస్తాన్లో ముద్రితమైన నకిలీ కరెన్సీని కరాచీ నుంచి షార్జా మీదుగా హైదరాబాద్ తీసుకువచ్చిన అంతర్జాతీయ ముఠా గుట్టును హైదరాబాద్ ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసి రూ.9 లక్షల నకిలీనోట్లు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ బి.లింబారెడ్డి బుధవారం వెల్లడించారు. వీరి అరెస్టుతో నకిలీ నోట్లు విమానాల ద్వారా హైదరాబాద్‌కు వస్తున్న విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. హైదరాబాద్‌లోని మొఘల్‌పుర ప్రాంతానికి చెందిన మహ్మద్ అఖీల్ మార్ఫానీ గతంలో సౌదీ, షార్జాల్లో కార్పెంటర్‌గా పనిచేశాడు. ఇటీవల అనారోగ్యం కారణంగా షార్జా నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చేయాలనుకున్నాడు. కరాచీలో ఉంటున్న తన మేనమామ యాసీన్‌కు ఇదే విషయాన్ని ఫోన్ ద్వారా చెప్పాడు. పాకిస్తాన్లో ముద్రితమయ్యే భారత నకిలీ నోట్లను మార్పిడి చేస్తే మంచి లాభాలు ఉంటాయని ‘సలహా’ ఇచ్చాడు. తన ఏజెంట్ ద్వారా రూ.వెయ్యి, రూ.500 డినామినేషన్లో ఉన్న రూ.9 లక్షల నకిలీ కరెన్సీని కరాచీ నుంచి షార్జాకు పంపుతానన్నాడు. ఆ నగదును హైదరాబాద్ తీసుకువెళ్ళి చెలామణీ చేయాలని, తన వాటాగా రూ.3 లక్షలు ఇస్తే చాలని మార్ఫానీతో చెప్పాడు. దీనికి మార్ఫానీ అంగీకరించడంతో దుబాయ్‌లోని డేరా ప్రాంతంలో ఉన్న ఏజెంట్ ద్వారా యాసీన్ నకిలీ నోట్లు అందించాడు. ఈ నోట్లను ఓ బ్యాగ్ అడుగు భాగంగా నేర్పుగా పేర్చిన మార్ఫానీ దాన్ని తీసుకుని ఈ నెల 3న స్పైస్ జెట్ విమానంలో హైదరాబాద్ వచ్చాడు. గుర్తించని కస్టమ్స్ అధికారులు... ప్రయాణం నేపథ్యంలో నకిలీ కరెన్సీ ఉన్న బ్యాగ్‌ను లగేజ్‌లో వేసి తీసుకువచ్చాడు. దీన్ని ఏ దశలోనూ కస్టమ్స్ అధికారులు గుర్తించకపోవడంతో నకిలీ నోట్ల బ్యాగ్‌ను మార్ఫానీ శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. కొన్ని రోజులపాటు రహస్య ప్రదేశంలో దాచి మార్పిడి కోసం తన స్నేహితులైన ఘియాస్ మోహియుద్దీన్ (హుస్సేనిఆలం), మహ్మద్ తౌఫీఖ్ అహ్మద్ (సంగారెడ్డి) సహాయం తీసుకోవాలని నిర్ణయించాడు. వాటాలు ఇస్తానని చెప్పడంతో వీరిద్దరూ ముందుకు వచ్చారు. ఈ ముగ్గురూ కలసి నకిలీ నోట్లను మార్పిడి చేసే యత్నాల్లో ఉన్నారనే సమాచారం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అందింది. అప్రమత్తమైన ఇన్స్పెక్టర్ పి.బల్వంతయ్య, ఎస్సైలు పి.చంద్రశేఖర్‌రెడ్డి, బి.శ్రవణ్ కుమార్, కేఎస్ రవి తమ బృందాలతో వలపన్ని ముగ్గురినీ పట్టుకున్నారు. కేసును మహంకాళి పోలీసులకు అప్పగించామని, కరాచీలో ఉన్న యాసీన్ కోసం లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేస్తామని డీసీపీ తెలిపారు. -
రూ.60 లక్షల హవాలా సొమ్ము పట్టివేత
సాక్షి ప్రతినిధి, చెన్నై: శ్రీలంకకు రహస్యంగా తరలిస్తున్న రూ.60 లక్షల హవాలా సొమ్మును చెన్నై విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై-శ్రీలంక విమానం బుధవారం రాత్రి 9.15 గంటలకు బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. ఇంతలో కస్టమ్స్ అధికారులకు ఓ సమాచారం అందింది. వెంటనే కస్టమ్స్ అధికారులు విమానంలోకి ప్రవేశించి ఇద్దరు అనుమానితులను దించేశారు. చెన్నైకి చెందిన మహ్మద్ (40), అతని సహచరుడి లగేజీలను తనిఖీ చేయగా రూ.60 లక్షల విలువచేసే అమెరికన్ డాలర్లు, యూరో కరెన్సీ బయటపడింది. వారిద్దర్నీ అరెస్ట్ చేశారు. ఈ తనిఖీల కారణంగా శ్రీలంక విమానం 10.30 గంటలకు బయలుదేరింది. -
మహిళ నుంచి 33 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం
ఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సోమవారం రాత్రి కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ మహిళ వద్ద నుంచి 33 రౌండ్ల బుల్లెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న మహిళపై ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నీటిశుద్ధి యంత్రంలో బంగారు గుళికలు
అక్రమంగా తరలిస్తున్న 5 కేజీల గోల్డ్ పట్టివేత సాక్షి, విజయవాడ బ్యూరో: సముద్రమార్గాన్ని ఎంచుకున్న తమిళనాడుకు చెందిన బంగారం స్మగ్లర్‌కు భారతదేశంలో అడుగుపెట్టేవరకు అంతా అనుకున్నట్లే జరిగింది. కోల్‌కతాలో దిగి ట్రైన్లో చెన్నైకు ఐదు కేజీల బంగారం తీసుకెళ్లడానికి పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. బంగారాన్ని గుళికల రూపంలోకి మార్చి నీటిశుద్ధి యంత్రంలో(ఫిల్టర్)లో దాచి రైలు ఎక్కాడు. ఈ అక్రమ రవాణా గుట్టును రాష్ట్ర కస్టమ్స్ అధికారులు రాజమహేంద్రవరంలో రైలును ఆపి రట్టు చేశారు. స్మగ్లర్ల వద్ద నుంచి రూ. 1.45 కోట్ల విలువైన 5 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను ఏపీ కస్టమ్స్ కమిషనర్ ఎస్కే రెహమాన్ మంగళవారం విజయవాడ కేంద్ర కార్యాలయంలో విలేకరులకు వివరించారు. అదుపులోకి తీసుకున్న యువకుడు నేరాన్ని అంగీకరించాడని తెలిపారు. బంగారం స్మగ్లింగ్ తెలిసిన వారెవరైనా అందుబాటులో ఉన్న కస్టమ్స్ ప్రివెంటివ్ టీమ్‌కు సమాచారం అందజేస్తే సీజ్ చేసిన సరుకు విలువలో 20 శాతం రివార్డు కింద అందజేస్తారన్నారు. కమిషనర్‌తో సూపరింటెండెంట్ గుమ్మడి సీతారామయ్య ఉన్నారు. -
అక్రమంగా తరలిస్తున్న 5 కేజీల బంగారం స్వాధీనం
విజయవాడ: బంగారాన్ని చిన్న చిన్న రవ్వంత పరిమాణంలోకి మార్చి వాటర్ ప్యూరిఫయర్లలో పెట్టి తరలిస్తుండగా... కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఏపీ కస్టమ్స్ కమిషనర్ మంగళవారం విజయవాడలో ఈ ఘటన వివరాలను విలేకరులకు వెల్లడించారు. మలేసియా నుంచి కోల్‌కతా ఓడరేవుకు వచ్చిన 5 కిలోల బంగారాన్ని... తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి రైల్లో చెన్నైకి తరలిస్తున్నాడు. సమాచారం అందుకున్న కస్టమ్స్ అధికారులు సోమవారం ఉదయం రాజమండ్రి రైల్వే స్టేషన్లో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. నీటి శుద్ధి యంత్రాల్లో చిన్న రేణువుల రూపంలో ఉంచి తరలిస్తున్నట్టు గుర్తించారు. మొత్తం 5 కిలోల మేర బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని హైదరాబాద్ ఆర్థిక నేరాల కోర్టులో హాజరుపరిచినట్టు తెలిపారు. -
మూడు కిలోల బంగారం స్వాధీనం
శంషాబాద్: ఓ విమానంలోని సీటు కింద 3 కేజీల 148 గ్రాముల బంగారాన్సి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో బంగారం అక్రమ రవాణా జరుగుతున్న సమాచారం తెలుసుకున్న అధికారులు విమానంలో సోదాలు జరపగా ఓ సీటు కింద దాచిన మూడు కేజీల బంగారు బిస్కెట్లు కలిగిన లగేజీ కనుగొన్నారు. -
భయపడి బంగారం వదిలేశాడు
-
ఐదు కిలోల బంగారం పట్టివేత
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఐదు కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం దుబాయ్ నుంచి విమానంలో వచ్చిన ఇద్దరు ప్రయాణికుల సీట్ల వద్దనున్న లగేజీలో ఐదు కిలోల బంగారుబిస్కెట్లను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని నిందితు లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు హైదరాబాద్ పాతబస్తీకి చెందినవారిగా గుర్తించారు. ప్రైవేట్ బస్సులో 50 కిలోల వెండి వస్తువులు.. జడ్చర్ల: ఓ ప్రైవేట్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న దాదాపు 50 కిలోల వెండి సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి కొందరు అక్రమంగా మద్యం తరలిస్తున్నారని ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో మహబూబ్‌నగర్ జిల్లా రాయకల్ టోల్‌ప్లాజా దగ్గర తనిఖీలు చేపట్టి బెంగళూర్ నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును పరిశీలించారు. మూడు బ్యాగుల్లో రూ.17 లక్షల విలువజేసే 50 కిలోల వెండి సామగ్రిని గుర్తించారు. వీటికి సంబంధించిన పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకుని వాణిజ్యపన్నులశాఖ అధికారులకు అప్పగించారు. దీంతో సీటీవో రాధాగోపాల్ పన్ను, జరిమానా కింద రూ.55,536 వసూలు చేసి సామగ్రిని సదరు వ్యక్తికి అప్పగించారు. -
శంషాబాద్‌లో 5 కేజీల బంగారం స్వాధీనం
-
శంషాబాద్‌లో 5 కేజీల బంగారం స్వాధీనం
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మంగళవారం కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా దుబాయి నుంచి వచ్చిన విమానంలో ప్రయాణికుల వద్ద సోదాలు చేశారు. ఓ ప్రయాణికుడి నుంచి 5 కేజీల బంగారాన్ని ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
కోట్ల రూపాయల విదేశీ సిగరెట్లు సీజ్
కొచి: దుబాయ్ నుంచి భారత్‌కు అక్రమంగా రవాణాచేస్తున్న 91లక్షల రూపాయల విలువైన విదేశీ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కేరళలోని కోచి పోర్ట్‌లో ఓ కంటెయినర్ లో తీసుకువస్తున్న సిగరెట్లను గుర్తించి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతవారం 67లక్షల రూపాయల విలువ చేసే విదేశీ సిగరెట్లను సీజ్ చేసినట్లు కస్టమ్స్ కమిషనర్ కెఎన్ రాఘవన్ మీడియాకు తెలిపారు. కంటెయినర్లో ఉన్న ఫర్నిచర్స్లో సిగరెట్లను దాచి ఉంచినట్లు గుర్తించినట్లు చెప్పారు. విదేశీ సిగరెట్లను ఇంత భారీ మొత్తంలో సీజ్ చేయడం గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే 1.58కోట్ల రూపాయల విదేశీ సిగరెట్లను సీజ్ చేశామని విచారణ చేపట్టినట్లు రాఘవన్ వివరించారు. -
ఎయిర్ పోర్ట్‌లో కిలో బంగారం పట్టివేత
చెన్నై: లక్షల రూపాయలు విలువ చేసే బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని చెన్నై ఎయిర్ పోర్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. అధికారుల వివరాల ప్రకారం... దుబాయ్ నుంచి వచ్చిన ఓ విమానంలో కేరళకు చెందిన ప్రయాణికుడు అష్రాఫ్ శనివారం ఉదయం చెన్నై విమానాశ్రయంలో దిగాడు. తన వద్ద ఉన్న మ్యూజిక్ సిస్టమ్‌లో ఒక కిలో బంగారాన్ని దాచి ఉంచి అక్రమంగా రవాణా చేస్తున్నాడు. కస్టమ్స్ అధికారులు విషయాన్ని గ్రహించి కేరళ ప్రయాణికుడ్ని తనిఖీ చేసి అతడ్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.25 లక్షల విలువ చేసే కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. -
ఎనిమిది కిలోల బంగారం పట్టివేత
చెన్నై: చెన్నై విమానాశ్రయంలో మంగళవారం ఎనిమిది కిలోల బంగారం పట్టుబడింది. దీని విలువ రెండున్నర కోట్ల రూపాయలుంటుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో భాగంగా ముందు రెండు బ్యాగుల్లో అక్రమంగా రవాణా చేస్తున్న అయిదున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత బ్యాంకాక్ నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడు తన బ్యాగ్ లో ఉన్న 2.5 కిలోల బంగారం తనది కాదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మొత్తం 8 కిలోల గోల్డ్ ను సీజ్ చేసిన అధికారులు... సదరు ప్రయాణికుడ్ని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అతని బ్యాగ్ లోకి బంగారం ఎలా వచ్చిందనే విషయాన్ని ఆరా తీస్తున్నామని, విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. -
అతివలూ సమిధలే..!
మహిళలు.. పోకిరీలు, మృగాళ్లకే కాదు.. స్మగ్లర్లకూ టార్గెట్ అవుతున్నారు. వారికి రకరకాల ఆశలు చూపి క్యారియర్లుగా వినియోగిస్తున్నారు. కస్టమ్స్ అధికారుల కన్ను మహిళలపై ఎక్కువగా ఉండదనే ఉద్దేశంతో ఈ పంథా అనుసరిస్తున్నట్లు అధికారుల అనుమానం. గడిచిన మూడు నెలల్లో ఈ తరహాలో బంగారం, మాదకద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తూ ఏడుగురు మహిళలు పట్టుబడడమే ఇందుకు నిదర్శనం. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన గంగుల మల్లేశ్వరి బ్యాంకాక్ నుంచి 4.5 కేజీల బంగారు బిస్కెట్లతో వస్తూ శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది. * క్యారియర్లుగా వినియోగించుకుంటున్న స్మగ్లర్లు * కస్టమ్స్ అధికారులకూ అనుమానం రాకూడదనే.. * ఇటీవల 4.5 కేజీల పసిడితో చిక్కిన కడప మహిళ * శంషాబాద్ విమానాశ్రయం కేంద్రంగా వ్యవహారం వారిని అనుమానించడం తక్కువే.. సాధారణంగా స్మగ్లర్లు అనగానే అందరి మదిలో మెదిలేది పురుషులే. దీనికి తోడు మహిళలూ.. అందునా నిండు గర్భిణి, చంకలో పసి పిల్లలతో వచ్చేవారిని అధికారులు అనుమానించడం తక్కువ. ఈ కారణంగా దుబాయ్ తదితర దేశాల నుంచి వచ్చే పేద, మధ్య తరగతి మహిళలకు కమీషన్ ఆశ చూపుతున్న బడా స్మగ్లర్లు వారికి బంగారం, మాదకద్రవ్యాలు అప్పగిస్తున్నారు. డ్రగ్స్ మాట అటుంచితే.. పసిడి తీసుకువచ్చే ఉమెన్ క్యారియర్లను ఎక్కువగా ఆయా దేశాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనే గుర్తించి స్మగ్లర్లు వారికి ఇచ్చి పంపిస్తున్నారు. మాదకద్రవ్యాలను కడుపులో దాచి గర్భవతులుగా, చంటి బిడ్డలతో వస్తున్న వారికి బంగారం తదితరాలను అప్పగించి పంపిస్తున్నారు. డీఎఫ్‌ఎమ్‌డీల వద్దా బురిడీ.. వివిధ రూపాలు, పంథాల్లో బంగారం అక్రమంగా తీసుకొస్తున్న మహిళలకు విమానాశ్రయాల్లోని డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్ (డీఎఫ్ఎండీ)లు కూడా కొంత వరకు ‘సహకరిస్తున్నాయి’. ఏదైనా అక్రమ రవాణా విషయం కస్టమ్స్ అధికారులు గుర్తించాలంటే పక్కా సమాచారం, ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) నిఘాల కంటే డీఎఫ్‌ఎండీఏ ఎక్కువగా ఉపకరిస్తున్నాయి. క్యారియర్లు దాటుతున్న సమయంలో లోపల దాచి ఉంచిన మెటల్ కారణంగా డీఎఫ్ఎండీలు శబ్ధం చేస్తాయి. మహిళలు సాధారణంగానే కొంత వరకు నగలు ధరించి ఉంటారు. వీటి వల్లే శబ్ధం వచ్చి ఉంటుందని అధికారులు భావించే ఆస్కారం సైతం ఉంటుందనే బడా స్మగ్లర్లు మహిళల్ని వినియోగించుకుంటున్నారు. కీలక వ్యక్తులు చిక్కడం కష్టమే.. ఈ తరహాలో అక్రమ రవాణా చేస్తూ చిక్కుతున్న మహిళల్ని ఎంత విచారించినా ముఠా వెనుక ఉన్న సూత్రధారులను కనిపెట్టడం కష్టంగా మారుతోందని కస్టమ్స్ అధికారులు చెప్తున్నారు. ఆయా దేశాల్లోని విమానాశ్రయాల్లో వీరికి బంగారం అప్పగించే ముఠా సభ్యులు దాన్ని ఎవరికి డెలివరీ చేయాలో మాత్రం మహిళలకు చెప్పట్లేదు. కేవలం విమానాశ్రయం నుంచి బయటకు వచ్చాక ఓ ప్రాంతంలో వేచి ఉండమనో, ఫలానా హోటల్/లాడ్జిలో బస చేయాలనో సూచిస్తున్నారు. ముఠాకు చెందిన రిసీవర్లు అక్కడికే వెళ్లి బంగారం తీసుకుని మహిళలకు కమీషన్ చెల్లిస్తున్నారు. ఈ కారణంగానే విమానాశ్రయాల్లో పట్టుబడుతున్న క్యారియర్ల కేసుల్లో పురోగతి ఉండట్లేదని వివరిస్తున్నారు. ముమ్మర కసరత్తు చేస్తున్న కస్టమ్స్.. బడా స్మగ్లర్లు మహిళలను అక్రమ రవాణాకు వినియోగించుకుంటున్నారనే ఉద్దేశంతో ప్రతి మహిళను ఆపి తనిఖీ చేయడం సాధ్యం కాదు. అలా చేస్తే అమాయకులు సైతం తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కస్టమ్స్ సహా ఇతర ఏజెన్సీల అధికారులు మహిళా ప్రయాణికుల జాబితాను ముందే సేకరిస్తున్నారు. వారు విదేశాలకు ఎప్పుడు వెళ్లారు? ఆఖరుసారిగా ఎప్పుడు వచ్చారు? ఏ వీసాపై వెళ్లారు? వారి నేపథ్యం ఏమిటి? తదితరాలను ఆరా తీస్తున్నారు. కేవలం అనుమానాస్పదమైన వారిని మాత్రమే అదుపులోకి తీసుకుంటూ ఫలితాలు సాధిస్తున్నారు. ఉదాహరణలు ఎన్నో.. * ఇటీవల దుబాయ్ నుంచి ‘గర్భిణిగా’ వచ్చిన సౌత్ ఆఫ్రికా మహిళ మూసా తన కడుపులో 793 గ్రాముల కొకైన్‌తో చిక్కింది. * మూడు నెలల క్రితం సౌదీ నుంచి తన భర్త, ఏడాదిన్నర కుమారుడితో వచ్చిన మహిళ 1.75 కేజీల బంగారంతో పట్టుబడింది. * బ్యాంకాక్, దుబాయ్ నుంచి వచ్చిన నలుగురు మహిళల్ని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు వారి నుంచి నాలుగు కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. * సింగపూర్ నుంచి వచ్చిన ముగ్గురు మహిళల్ని తనిఖీ చేయగా 5.1 కేజీల బంగారంతో పట్టుబడ్డారు. * యూఏఈ నుంచి వచ్చిన ఇద్దరు మహిళల్ని పట్టుకున్న కస్టమ్స్ అధికారులుకు 1.3 కేజీల బంగారం దొరికింది. -
‘ట్రీటీ’తో బురిడీ...!
♦ ఇండోనేషియా నుంచి అక్రమంగా బంగారం దిగుమతి ♦ రెండేళ్లలో వివిధ దఫాల్లో దాదాపు 400 కేజీల పైనే ♦ భారత్‌కు ఇండోనేషియాతో ఉన్న ఒప్పందంతో మాయ ♦ కస్టమ్స్ కళ్లుగప్పిన చిక్కడపల్లికి చెందిన పసిడి వ్యాపారి ♦ నోటీసుల జారీకి కస్టమ్స్ సన్నద్ధం సాక్షి, హైదరాబాద్: ఇండోనేషియా నుంచి రెండేళ్లలో 400 కేజీల పసిడి దిగుమతి.. ఆన్ రికార్డు ప్రకారం అంతా క్లీన్.. కానీ రెండేళ్లలో ఒకే వ్యాపారికి, ఒకే దేశం నుంచి, ఒకే రకమైన ఆభరణాలు రావడంతో అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు ఆరా తీయగా.. ‘ట్రీటీ’(ఒప్పందం) పేరుతో బురిడీ కొట్టించినట్టు తేలింది. హైదరాబాద్‌లోని చిక్కడపల్లికి చెందిన ఓ పసిడి వ్యాపారి శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి 400 కేజీల గోల్డ్‌స్కామ్ దందా నడిపినట్టు గుర్తించారు. ట్రీటీని అనుకూలంగా మార్చుకున్న వ్యాపారి.. బంగారం సహా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్రతి వస్తువుపైనా నిర్ణీత శాతం కస్టమ్స్ డ్యూటీ(పన్ను) చెల్లించాలి. అయితే అంతర్జాతీయ సంబంధాలు, వాణిజ్య లావాదేవీలతో పాటు అనేక కారణాల నేపథ్యంలో భారత్ కొన్ని దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఇలా ఒప్పందం చేసుకున్న దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై పూర్తి స్థాయిలో/నిర్ణీత శాతం కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఉంటుంది. బంగారంతో పాటు కొన్ని రకాల వస్తువుల దిగుమతికి సంబంధించి భారత్‌కు ఇండోనేషియాతో ఒప్పందం ఉంది. దీని ప్రకారం సదరు బంగారం, వస్తువు ఆ దేశంలోనే తయారైందని ధ్రువీకరణ పత్రంతో దిగుమతి చేసుకుంటే కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. సరిగ్గా ఇదే ఒప్పందాన్ని చిక్కడపల్లికి చెందిన పసిడి వ్యాపారి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. రెండేళ్లుగా ఇండోనేషియా నుంచి బంగారం దిగుమతి చేసుకుంటున్న సదరు వ్యాపారి.. అధికారిక ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆన్ రికార్డ్ అన్నీ పక్కాగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. రెండేళ్లలో 400 కేజీల వరకు దిగుమతి.. ఇండోనేషియా నుంచి బంగారాన్ని కడ్డీలు, దిమ్మెల రూపంలో తెచ్చుకోవడానికి నిబంధనలు అంగీకరించవు. కచ్చితంగా ఆభరణాలుగానే దిగుమతి చేసుకోవాలి. దీంతో ఇండోనేషియాలోనే కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్న సదరు వ్యాపారి కడ్డీలు, దిమ్మెలను నామ్‌కే వాస్తేగా రింగుల రూపంలోకి మార్చి దిగుమతి చేసుకోవడం ప్రారంభించాడు. అయితే ఒకే వ్యాపారికి, ఒకే దేశం నుంచి, ఒకే రకమైన ఆభరణాలు వస్తుండటం, రెండేళ్లలో పలు దఫాల్లో 400 కేజీల వరకు దిగుమతి కావడంతో కస్టమ్స్ అధికారులకు సందేహం వచ్చింది. ఆరా తీయాలని ఢిల్లీలోని కస్టమ్స్ ప్రధాన కార్యాలయాన్ని(సీబీఈసీ)కోరారు. దీంతో ప్రత్యేక అధికారిని ఇండోనేషియా పంపి ఆరా తీయగా.. పసిడి వ్యా పారి చెపుతున్నట్లుగా బంగారం ఆ దేశానికి చెందినది కాద ని తేలింది. ఏజెంట్ల సహకారంతో దుబాయ్, సౌదీ వంటి దేశాల నుంచి ఇండోనేషియాకు తరలించి, అక్కడ అధికారిక ధ్రువీకరణ పత్రాలు పుట్టించి విమానంలో హైదరాబాద్‌కు తీసుకువస్తూ సుంకం ఎగ్గొడుతున్నట్లు నిర్ధారించారు. దీంతో 400 కేజీల పసిడిపై పన్ను చెల్లించాల్సిన సదరు వ్యాపారికి నోటీసులు జారీ చేయడానికి కస్టమ్స్ విభాగం సన్నద్ధమవుతోంది. ఈ తరహా వ్యాపారం చేసే ముఠాలు మరికొన్ని ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు జరుపుతోంది. -
ఎయిర్ పోర్ట్‌లో 30 కేజీల బంగారం పట్టివేత
-
ఎయిర్ పోర్ట్‌లో 30 కేజీల బంగారం పట్టివేత
చెన్నై : మదురై ఎయిర్ పోర్ట్‌లో ఆదివారం భారీ ఎత్తున బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోలంబో, దుబాయిల నుండి వచ్చిన విమానాల్లో దాదాపు 30 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు కనుగొన్నారు. అనంతరం సదరు విమానాల్లో ప్రయాణించిన 10 మంది ప్రయాణీకులను అధికారులు అదుపులోకి తీసుకుని... ప్రశ్నిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులను అప్పగించారు. పట్టుబడిన బంగారం విలువ రూ. 8.38 కోట్లు ఉంటుందని డీఆర్ఐ అధికారులు తెలిపారు. సదరు విమానాల్లో భారీగా బంగారం అక్రమ రవాణా అవుతున్నట్లు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఈ విమానాలు ఎయిర్ పోర్ట్ చేరుకోగానే.... కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. -
బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయారు
సాక్షి, విశాఖపట్నం: దుబాయ్ నుంచి విశాఖకు బంగారం బిస్కెట్లు స్మగ్లింగ్ చేస్తున్న ఏడుగురు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏ1-952 దుబాయ్ నుంచి హైదరాబాద్ మీదుగా సోమవారం విశాఖ చేరుకుంది. దానిలో నుంచి దిగిన ఏడుగురు తమ శరీరం లోపల బంగారం బిస్కెట్లు దాచి స్మగ్లింగ్‌కు పాల్పడ్డారు. సెక్యూరిటీ విజిల్ మోగడంతో కస్టమ్స్ అధికారులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.1.14 కోట్ల విలువైన 4.20 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
సెల్‌ఫోన్ బ్యాటరీల్లో బంగారం..
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి పెద్ద ఎత్తున బంగారం పట్టుబడింది. అబుదాబి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి సోమవారం ఉదయం సుమారు రెండు కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల తనిఖీల్లో పట్టుబడతామనే ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో ప్రయాణికులు పలు రకాలుగా బంగారాన్ని తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ ప్రయాణికుడు కూడా సెల్‌ఫోన్ బ్యాటరీల స్థానంలో బంగారాన్ని అమర్చి తీసుకు వచ్చాడు. అయితే అధికారుల తనిఖీల్లో ఆ విషయం బటయపడింది. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. -
480 గ్రాముల బంగారం పట్టివేత
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఇద్దరు ప్రయాణికుల నుంచి 480 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అక్రమంగా తరలిస్తున్న480 గ్రాముల బంగారాన్ని వారి వద్ద గుర్తించారు . అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులు కేరళకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. -
540 గ్రాముల బంగారం పట్టివేత
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మహిళా ప్రయాణికురాలి నుంచి 540 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన మహిళా ప్రయాణికురాలి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న నిందితురాలిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. -
ఏడు కిలోల బంగారం పట్టివేత
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి ఏడు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎయిరిండియా విమానంలో గురువారం తెల్లవారుజామున దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు మహిళా ప్రయాణికుల లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఏడు కిలోల వంద గ్రాముల బరువు కలిగిన నాలుగు బంగారు కడ్డీలు బయటపడ్డాయి. వీరు ముంబైకి చెందిన సమీరా, సిందియాలుగా గుర్తించారు. అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. -
విమానాశ్రయంలో రూ.36 లక్షల విలువైన బంగారం స్వాధీనం
సాక్షి, ముంబై: ముంబై విమానాశ్రయంలో ఇద్దరు ప్రయాణికుల నుండి రూ. 36 లక్షల విలువ చేసే బంగారం కడ్డీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేశ విదేశాలకు వస్తువులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులు, తమ కంప్యూటర్ సీపీయూ, వంట చేసే పాన్‌లో బంగారాన్ని దాచి తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుండి వచ్చిన హిరేన్ చౌహ న్ సామగ్రిని స్క్రీనింగ్ చేయగా, అతని కంప్యూటర్ సీపీయూలో 10 బంగారు కడ్డీలు బైట పడ్డాయని, ఒక్కొక్కటి 116 గ్రాముల బరువుందని, వాటి మొత్తం విలువ రూ.27.88 లక్షలుంటుందని కస్టమ్స్ కమిషనరు ఏపీఎస్ సూరి చెప్పారు. రహస్యంగా దాచిన బంగారాన్ని గుర్తించడానికి ముంబై విమానాశ్రయంలో అత్యాధునిక లైన్ స్క్రీనింగ్ పరికరాన్ని ఉపయోగిస్తున్నామన్నారు. షార్జా నుంచి వచ్చిన సఫియా షరీఫ్ మొహమ్మద్ అనే మహిళా ప్రయాణికురాలినుంచి రూ.8.74 లక్షల విలువ చేసే 350 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని మరో కస్టమ్స్ అధికారి మిలింద్ లాంగేవర్ తెలిపారు. -
ఎయిర్‌పోర్ట్‌లో ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక దంపతుల నుంచి కిలోన్నర బంగారం, 8 ఐఫోన్లతోపాటు 10 ల్యాప్‌టాప్‌లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల కథనం ప్రకారం... సింగపూర్ నుంచి ఆ దేశ ఎయిర్‌లైన్స్ విమానంలో నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా కస్టమ్స్ అధికారులు ప్రయాణికుల లగేజీలను తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా సదరు దంపతుల లగేజీలో బంగారం ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఆ లేగేజీలోని ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు కూడా ఉన్నట్లు కనుగొన్నారు. దీంతో వాటీని కూడా స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఆ దంపతులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
మలద్వారంలో 349 బంగారు బిస్కెట్లు
చెన్నై: శ్రీలంక నుంచి భారత్‌కు అక్రమంగా తరలిస్తున్న 14 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సినీపక్కీలో పట్టుకున్నారు. విమానాశ్రయాల్లో నిఘా పెరగడంతో స్మగ్లర్లు సముద్రమార్గాన్ని ఎంచుకున్నారు. నాగపట్నం జిల్లా నాగూరు నుంచి కారులలో భారీ ఎత్తున బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో గురువారం అర్ధరాత్రి నుంచి నిఘాపెట్టారు. తెల్లవారుజామున వాంజూరు చెక్‌పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక కారు నిలపకుండా వెళ్లిపోయింది. అధికారులు వెంటనే ఆ వాహనాన్ని వెంబడించారు. ఎట్టకేలకు కారైక్కాల్ సమీపం పట్టిన్నం అనే ప్రాంతంలో కారును పట్టుకోగలిగారు. కారు సీటు కింద ఉన్న పార్శిల్‌ను విప్పిచూడగా అందులో 14 కిలోల బంగారు బిస్కెట్లు లభ్యమయ్యాయి. కారులో ఉన్న నాగూర్‌కు చెందిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. ఇదిలావుండగా మరో బంగారు అక్రమరవాణా కేసులో శ్రీలంక నుంచి తిరుచ్చీకి గురువారం సాయంత్రం శ్రీలంకన్ విమానం వచ్చింది. ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి నడకతీరుపై అధికారులకు అనుమానం కలిగింది. అతన్ని ప్రత్యేక గదికి తీసుకెళ్లి తనిఖీ చేయగా, మలద్వారం వద్ద దాచిపెట్టి ఉన్న రూ.10 లక్షల విలువైన 349 బంగారు బిస్కెట్లు లభ్యమైనాయి. చెన్నై సాలిగ్రామానికి చెందిన మహమ్మద్ బషీర్ (59) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. -
ప్రయాణికురాలి నుంచి 70 కేజీల వెండి స్వాధీనం
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ మహిళ నుంచి 70 కేజీల వెండిని కస్టమ్స్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. స్పైస్ జెట్ విమానంలో చెన్నై వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్న ఆమె లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె లగేజీలో భారీగా వెండి ఆభరణాలను కనుగొన్నారు. ఆ వెండి ఆభరణాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం ఆ మహిళలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
ఎయిర్‌పోర్ట్‌లో గుట్కా స్మగ్లింగ్ ముఠా అరెస్ట్
హైదరాబాద్: అయిదుగురు సభ్యుల గుట్కా స్మగ్లింగ్ ముఠా గుట్టును శంషాబాద్ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు రట్టు చేశారు. నగరం నుంచి భారీగా గుట్కా ప్యాకెట్లను దోహ తరలించేందుకు ప్రయత్నిస్తున్న అయిదుగురు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఆదివారం దోహ వెళ్తున్న ప్రయాణికుల బ్యాగ్‌లను కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అయిదుగురు ప్రయాణికుల లగేజీలో భారీగా గుట్కా ప్యాకెట్లు ఉన్నట్లు కనుగొన్నారు. దాంతో కస్టమ్స్ అధికారులు సదరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అనంతరం నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. -
బంగారం..బంగారం...!
చెన్నై/హైదరాబాద్: బంగారం, బంగారం... బస్టాండులలో, విమానాశ్రయాలలో ఎక్కడ చూసినా బంగారమే. అక్రమంగా తరలిస్తున్న కిలోలకొద్ది బంగారం. కస్టమ్స్ అధికారులు, పోలీసులు ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకుంటూనే ఉన్నారు. అయినా ఈ అక్రమ తరలింపు మాత్రం ఆగడంలేదు. చెన్నై కోయంబేడు బస్టాండులో ఈ రోజు పోలీసులు ఏకంగా 8 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. ఈ బంగారానికి సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ తెల్లవారుజామున కస్టమ్స్ అధికారుల దుబాయి నుంచి వస్తున్న ఒక వ్యక్తి నుంచి 640 గ్రాముల బంగారు చైన్లను స్వాధీనం చేసుకున్నారు. షార్జా విమానంలో వచ్చిన కపిల్ రామ్‌లాల్ అనే ప్రయాణికుడు నుంచి స్వాధీనం చేసుకున్న ఈ బంగారం విలువ 18 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. అయితే ఆ ప్రయాణికుడిని అరెస్ట్ చేయలేదని కస్టమ్స్ అధికారులు తెలిపారు. Follow @sakshinews -
రూ.75లక్షల ఫారెన్ కరెన్సీ స్వాధీనం
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయం మరోసారి వార్తల్లో నిలిచింది. నిన్న మొన్నటి వరకూ బంగారం, ఎర్ర చందనం పౌడర్‌ను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు తాజాగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఎమిరేట్ విమానంలో దుబాయ్ వెళుతున్న ఓ వ్యక్తి నుంచి సోమవారం ఉదయం రూ. 72 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
విమానాశ్రయంలో కిలోన్నర బంగారం పట్టివేత
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఇద్దరు ప్రయాణికుల నుంచి కిలోన్నర బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం దుబాయి నుంచి వచ్చిన కెన్యా దేశానికి చెందిన రజీయా లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయడంతో 1,300 గ్రాముల బరువు కలిగిన బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. అంతకుముందు ఉదయం దోహా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద ఎలాంటి రశీదులు లేకుండా తీసుకొచ్చిన 150 గ్రాముల బంగారాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎయిర్‌పోర్ట్‌లో రెండున్నర కిలోల బంగారం పట్టివేత
శంషాబాద్, న్యూస్‌లైన్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సింగపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు రెండున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మీర్ మహ్మద్ హుస్సేన్(35) సింగపూర్ నుంచి సిల్క్ ఎయిర్‌లైన్స్ ఎంఐ(478) విమానంలో గురువారం అర్ధరాత్రి సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతడి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో కస్టమ్స్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్యాంటు, చొక్కా లోపలి భాగంలో రెండు బంగారు బిస్కెట్లు, ఓ బ్రాస్లెట్ కనిపించడంతో స్వాధీనం చేసుకున్నారు. ఇవి 2 కిలోల 499 గ్రాముల బరువు ఉన్నాయి. వీటి రూ.75 లక్షల విలువ ఉంటుందని అధికారులు నిర్ధారించారు. హుస్సేన్ అక్రవుంగా బంగారం తెస్తున్నందున అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. తనిఖీల్లో కస్టమ్స్ అడిషనల్ కమిషనర్ ఆర్. మనోహర్, డిప్యూటీ కమిషనర్ ఈవీఎన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ కల్యాణ్, కస్టమ్స్ సూపరిండెంట్ రామకృష్ణారావు, ఎయిర్ ఇంటలిజెన్స్ అధికారులు అన్వర్, మొహినుద్దీన్, ప్రతాప్‌రెడ్డి, హుస్సేన్ పాల్గొన్నారు. ఫిబ్రవరి మాసంలో అధికంగా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఫిబ్రవరి నెలలోనే పదికిపైగా బంగారం పట్టివేత కేసులు నమోదయ్యాయి. వివిధ కేసుల్లో కస్టమ్స్ అధికారులు సుమారు పది కిలోలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కేజీ బంగారానికి సంబంధించి మూడు కేసులు ఉన్నాయి. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఎలక్ట్రో ప్లేట్ల రూపంలో రెండున్నర కేజీల బంగారాన్ని తీసుకొచ్చాడు. పాప్‌కార్న్ యంత్రం, షూ సాక్సుల్లో, లో దుస్తుల్లో, లగేజీ బ్యాగులకు డిజైనింగ్ తీగల మాదిరిగా ఇలా పలు విధాలుగా ప్రయాణికులు విదేశాల నుంచి బంగారాన్ని తీసుకొచ్చి అడ్డంగా దొరికిపోయూరు. -
షూ సాక్సుల్లో అర కిలో బంగారం
శంషాబాద్, న్యూస్‌లైన్: షూ సాక్సుల్లో అరకిలో బంగారు బిస్కెట్లను దుబాయ్ నుంచి అక్రమంగా తీసుకొచ్చిన ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి ఫ్లై దుబాయ్ ఎయిర్‌లైన్స్ విమానంలో వచ్చిన వరంగల్ జిల్లాకు చెందిన ఖాజా(30)ను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అతడి షూ సాక్సుల్లో నాలుగు బంగారు బిస్కెట్లు, ఓ రింగ్ ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 565 గ్రాముల బరువు ఉన్న వీటి విలువ రూ. 17.56 లక్షల వరకు ఉంటుందని అంచనా. -
‘శంషాబాద్’లో కిలో బంగారం స్వాధీనం
హైదరాబాద్, న్యూస్‌లైన్: శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి నుంచి కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారుల కథనం ప్రకారం.. గురువారం ఉదయం థాయ్ ఎయిర్వేస్కు చెందిన టీజీ 329 విమానంలో బ్యాంకాక్ నుంచి విశాఖపట్నానికి చెందిన సురేష్ (35) శంషాబాద్ వచ్చాడు. అతడు జీన్స్ ప్యాంటుకు ప్రత్యేకంగా కుట్టించుకున్న జేబులో రెండు బంగారు బిస్కెట్లు, లోదుస్తుల్లో మరో రెండు బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బంగారం దాదాపు కిలో బరువు ఉంది. దీని విలువ రూ. 30 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అధికారులు సురేష్‌పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
విమానాశ్రయంలో రూ.9 కోట్ల బంగారం సీజ్
సాక్షి, చెన్నై: దుబాయి నుంచి అక్రమంగా తరలించిన రూ.9 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లను చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున 5.30 గంటలకు దుబాయి నుంచి రానున్న ఎయిర్ ఇండియా విమానంలో భారీ ఎత్తున బంగారం తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో అధికారులు అనుమానంతో ఐదుగురిని విచారించగా విమానంలోని టాయిలెట్లో ఐదు పార్సిళ్లలో దాచివుంచిన రూ.9 కోట్ల విలువైన 30 కిలోల బంగారం దొరికింది. దీంతో వారిని అరెస్టు చేసి విచారణ సాగిస్తున్నారు.