ఎయిర్పోర్ట్లో గుట్కా స్మగ్లింగ్ ముఠా అరెస్ట్ | Five Held For Smuggling Gutkha at Shamshabad airport | Sakshi
Sakshi News home page

ఎయిర్పోర్ట్లో గుట్కా స్మగ్లింగ్ ముఠా అరెస్ట్

Jul 27 2014 8:38 AM | Updated on Apr 4 2019 5:25 PM

అయిదుగురు సభ్యుల గుట్కా స్మగ్లింగ్ ముఠా గుట్టును శంషాబాద్ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు రట్టు చేశారు.

హైదరాబాద్: అయిదుగురు సభ్యుల గుట్కా స్మగ్లింగ్ ముఠా గుట్టును శంషాబాద్ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు రట్టు చేశారు. నగరం నుంచి భారీగా గుట్కా ప్యాకెట్లను దోహ తరలించేందుకు ప్రయత్నిస్తున్న అయిదుగురు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఆదివారం దోహ వెళ్తున్న ప్రయాణికుల బ్యాగ్లను కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్బంగా అయిదుగురు ప్రయాణికుల లగేజీలో భారీగా గుట్కా ప్యాకెట్లు ఉన్నట్లు కనుగొన్నారు. దాంతో కస్టమ్స్ అధికారులు సదరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అనంతరం నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement