బంగారం ద్రవాన్ని చీరపై స్ప్రేగా చల్లి అక్రమ రవాణా

gold saree Seized In Shamshabad Airport  - Sakshi

హైదరాబాద్: అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి దుబాయ్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న ఓ ప్రయాణికుడి కదలికలను అనుమానించిన అధికారులు అతడి లగేజీని పరిశీలించారు.

అందులో ఉన్న ఓ కాటన్‌ చీరపై బంగారం ద్రవాన్ని స్ప్రేగా చల్లి తీసుకొచ్చినట్లు గుర్తించి దానిని బయటికి తీశారు. బయటపడిన 461 గ్రాముల బంగారం విలువ రూ.28 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top