Viral: Man With 1 Crores Worth Cocaine In Stomach Nabbed In Bangalore Airport - Sakshi
Sakshi News home page

Cocaine Seized In Bangalore: కడుపులో రూ.11 కోట్ల విలువైన కొకైన్‌

Aug 22 2021 12:41 PM | Updated on Aug 22 2021 3:11 PM

11 Crore Worth Of Cocaine Seized By Customs Officials In Bangalore Airport - Sakshi

బెంగళూరు: బెంగళూరు ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు అక్రమంగా తరలిస్తున్న మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. ఆఫ్రికన్‌ దేశస్తుడి నుంచి దాదాపు రూ. 11 కోట్ల విలువైన కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి బెంగళూరుకు వచ్చిన ఆఫ్రికా దేశస్తుడు విమానంలో ప్రయాణం చేసేటప్పుడు ఆహారం, మంచినీరు తీసుకోలేదు.

దీంతో అనుమానం వచ్చిన అధికారులు అతడినిక స్కాన్‌ చేయగా.. పొట్టలో కొకైన్‌ ఉన్నట్లు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వైద్యుల సహాయంతో అతని కడుపులోంచి కొకైన్‌ను బయటికి తీశారు. కాగా కొకైన్‌ విలువ దాదాపు రూ. 11 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. 

చదవండి: నా చావుకు భార్య, అత్తింటివారే కారణం..

పెళ్లి చేసుకుంటానని పిలిచి లాడ్జికి తీసుకెళ్లి..

Advertisement
 
Advertisement
Advertisement