దొంగ తెలివి.. కుక్కర్‌లో 8 కిలోల బంగారం  | Sakshi
Sakshi News home page

దొంగ తెలివి.. కుక్కర్‌లో 8 కిలోల బంగారం 

Published Tue, Jul 27 2021 8:46 AM

Customs Officials Arrested Two Persons Smuggling Gold In Chennai Airport - Sakshi

తిరువొత్తియూరు (తమిళనాడు): చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్‌ సిబ్బంది ఎన్ని తనిఖీలు చేస్తున్నా బంగారం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. తాజాగా దుబాయ్‌ నుంచి వచ్చిన విమానంలో కుక్కర్, మిక్సీలో 8.17 కిలోల బంగారాన్ని తీసుకొచ్చి దొరికిపోయారు. ఆదివారం రాత్రి   దుబాయ్‌ నుంచి ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో 104 మంది ప్రయాణికులు వచ్చారు.

కస్టమ్స్‌ సిబ్బంది వారిని తనిఖీ చేశారు. చెన్నై, రామనాథపురానికి చెందిన ఇద్దరిపై అనుమానం రావడంతో ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి వారి లగేజీలను పరిశీలించారు. ఎలక్ట్రానిక్‌ కుక్కర్, మిక్సీ తదితర గృహోపకరణాల్లో 8.17 కిలోల బంగారు బిస్కెట్లను గుర్తించారు. వాటి విలువ రూ.4.03 కోట్లు ఉంటుందని అంచనా. బంగారాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement