పేస్ట్‌ రూపంలో బంగారం; కాళ్లకు వేసుకునే సాక్స్‌లో | Customs officials on Wednesday seized gold smuggled at the Chennai airport | Sakshi
Sakshi News home page

పేస్ట్‌ రూపంలో బంగారం; కాళ్లకు వేసుకునే సాక్స్‌లో

Jul 7 2021 10:40 AM | Updated on Jul 7 2021 12:31 PM

Customs officials on Wednesday seized gold smuggled at the Chennai airport - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చెన్నై: చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని బుధవారం కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. బహ్రయిన్‌ ప్రయాణికుడి వద్ద నుంచి రెండు కేజీలకు పైగా బంగారాన్ని అధికారులు సీజ్‌ చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో ఆ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని అడ్డుకున్న అధికారులు విచారించగా బంగారం దాచిన విషయం బయటపడింది. బంగారాన్ని కరిగించి పేస్టు రూపంలో చేసి కాళ్లకు వేసుకునే సాక్స్‌లో దాచిన రెండు కేజీలు స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు

Advertisement
 
Advertisement
Advertisement