480 గ్రాముల బంగారం పట్టివేత | 480 grams gold cought in rajiv gaandi international airport | Sakshi
Sakshi News home page

480 గ్రాముల బంగారం పట్టివేత

Apr 28 2015 8:05 AM | Updated on Sep 3 2017 1:02 AM

రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఇద్దరు ప్రయాణికుల నుంచి 480 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఇద్దరు ప్రయాణికుల నుంచి 480 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అక్రమంగా తరలిస్తున్న480 గ్రాముల బంగారాన్ని వారి వద్ద గుర్తించారు . అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులు కేరళకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement