కిలో బంగారం దాటించేస్తూ అడ్డంగా దొరికాడు.. | Man Arrested After Odd Behaviour At Jaipur Airport | Sakshi
Sakshi News home page

కిలో బంగారం దాటించేస్తూ అడ్డంగా దొరికాడు..

Dec 26 2018 1:43 PM | Updated on Dec 26 2018 1:43 PM

Man Arrested After Odd Behaviour At Jaipur Airport - Sakshi

బంగారం తరలిస్తూ పట్టుబడ్డ వ్యక్తి అరెస్ట్‌

జైపూర్‌ : అడ్డదారుల్లో బంగారాన్ని స్మగ్లింగ్‌ చేస్తున్న వ్యక్తులు అధికారుల కళ్లు కప్పేందుకు కొత్తదారులు వెతుకుతున్నారు. జైపూర్‌ ఎయిర్‌పోర్టులో 30 సంవత్సరాల వ్యక్తి తన మలద్వారంలో బంగారాన్ని దాచి దేశంలోకి ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నాన్ని అధికారులు వమ్ము చేశారు. థాయ్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో ఆదివారం రాత్రి జైపూర్‌ చేరుకున్న పంకజ్‌ సాదువాని ప్రవర్తనపై ‍కస్టమ్స్‌ అధికారులకు అనుమానం రావడంతో కస్టడీలోకి తీసుకుని తనిఖీలు చేయడంతో అవాక్కయ్యారు.

తాను కిలో బంగారం విలువకలిగిన ఆరు పీస్‌లను తన ప్రైవేట్‌ పార్ట్స్‌లో దాచానని విచారణ సందర్భంగా సాధువాని చెప్పారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. సాధువానిని తదుపరి విచారణ నిమిత్తం ప్రశ్నిస్తున్నామని కస్టమ్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ హోషియార్‌ సింగ్‌ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement