వివాదంలో కొత్త లోకా మూవీ.. దుల్కర్ సల్మాన్ నిర్మాణ సంస్థ క్షమాపణలు! | Kotha Lokah makers apologise to remove dialogue demeaning of women | Sakshi
Sakshi News home page

Kotha Lokah: కొత్త లోకా వివాదాస్పద సీన్‌.. దుల్కర్ సల్మాన్ సంస్థ క్షమాపణలు!

Sep 2 2025 7:10 PM | Updated on Sep 2 2025 7:48 PM

Kotha Lokah makers apologise to remove dialogue demeaning of women

మలయాళ చిత్రాలకు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ఉంటోంది. కంటెంట్బాగుంటే మనవాళ్ల థియేటర్లకు ఎగబడుతున్నారు. ఇటీవల రిలీజైన మరో మలయాళ చిత్రం కొత్త లోక ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇప్పటికే సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్లకు పైగా నికర వసూళ్లను సాధించింది. మూవీలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్, శాండీ కీలక పాత్రలు పోషించారు. సినిమాకు డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు.

అయితే సినిమాలోని సీన్వివాదానికి దారితీసింది. బెంగళూరు మహిళలను కించపరిచేలా ఉందంటూ విమర్శలొచ్చాయి. దీంతో దుల్కర్ సల్మాన్కు చెందిన నిర్మాణ సంస్థ వేఫరర్‌ ఫిల్మ్స్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మీ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న సన్నివేశాన్ని తొలగిస్తామని ట్వీట్ చేసింది. కన్నడ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపింది. విషయంలో తమను క్షమించాలని కోరుతూ వేఫరర్‌ ఫిల్మ్స్‌ లేఖను పోస్ట్చేశారు.

సినిమాలో ఇన్‌స్పెక్టర్ నాచియప్ప గౌడ (కొరియోగ్రాఫర్ శాండీ పోషించిన పాత్ర) బెంగళూరుకు చెందిన మహిళలను వివాహం చేసుకోవడం ఇష్టం లేదని.. వారు క్యారెక్టర్లెస్అంటూ మాట్లాడారు. సీన్బెంగళూరు మహిళలను కించపరిచేలా ఉందని సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. కన్నడ డైరెక్టర్మన్సూర్సైతం సినిమాపై విమర్శలు చేశారు. కన్నడ భీమ, మలయాళ చిత్రాలు ఆఫీసర్ ఆన్ డ్యూటీ, ఆవేశం, ఇప్పుడు కొత్త లోకా లాంటి సినిమాలతో బెంగళూరును మాదకద్రవ్యాలు, నేరాలకు రాజధానిగా చిత్రీకరించారని అన్నారు. ఒకప్పుడు, సినిమాల్లో అందమైన పట్టణంగా చూపించిన బెంగళూరు.. నియంత్రణ లేని వలసల కారణంగా ఇలాంటి స్థితికి చేరుకుందని ట్వీట్లో రాసుకొచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement