Ranya Rao
-
Gold Smuggling: తెలుగు నటుడు తరుణ్ రాజ్ కొండూరు అరెస్ట్
-
రన్యా రావు కేసులో బిగ్ ట్విస్ట్.. టాలీవుడ్ హీరో అరెస్ట్!
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ దొరికిపోయిన కన్నడ నటి రన్యా రావు (Ranya Rao Case) కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో తెలుగు నటుడు తరుణ్ రాజ్ కొండూరుని పోలీసులు అరెస్ట్ చేశారు.‘పరిచయం’(2018)అనే సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన తరుణ్ రాజ్.. డెబ్యూ ఫిల్మ్‌తోనే ప్లాప్‌ని మూటగట్టుకున్నాడు. లక్ష్మీకాంత్ చెన్నా ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, సిమ్రత్ కౌర్ హీరోయిన్గా నటించింది. 2018 తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ఇప్పుడు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ కావడంతో తరుణ్‌రాజ్ కొండూరు పేరు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. రోజుకో ట్విస్ట్గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం డీఆర్ఐ కస్టడీలో ఉన్న కన్నడ నటి రన్యారావు గురించి రోజుకో ట్విస్ట్ బయటకు వస్తూనే ఉంది. ఆమెకు గత నవంబర్‌లో వివాహం అయిందట. పెళ్లయిన నెల నుంచే తాము విడిగా ఉంటున్నట్లు ఆమె భర్త జతిన్ హుక్కేరి కోర్టులో వెల్లడించారు. తాము అధికారికంగా విడిపోలేదని, అయితే కొన్ని కారణాల వల్ల వేరుగా జీవిస్తున్నామని చెప్పారు. ఈ కేసు విషయంలో తాజాగా జతిన్ హుక్కేరీని అధికారులు కర్ణాటక హైకోర్టులో హాజరుపరిచారు. రన్యారావు చేస్తున్న స్మగ్లింగ్ తో ఏమైనా సంబంధాలు ఉన్నాయన్న కోణంలో జతిన్ ను కస్టడీకి ఇవ్వాలంటూ డీఆర్ఐ కోరింది. ఈ క్రమంలోనే జతిన్ ను మరోసారి ఈరోజు(సోమవారం) కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే రన్యారావు స్మగ్మింగ్ తో తనకు ఏమీ సంబంధం లేదని చెబుతున్న జతిన్.. తాము పెళ్లి చేసుకున్నాం.. కానీ వేరుగా ఉంటున్నామని కోర్టుకు తెలిపాడు. ఇదే విషయాన్ని జతిన్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అతని విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కోర్టు.. తదుపరి విచారణ వరకూ జతిన్ పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించారు.ఏం జరిగింది?నటి రన్యారావు మార్చి 3న బెంగళూరు ఎయిర్‌పోర్టులో 14 కిలోల బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తూ పట్టుబడింది. ఈమెకు సీనియర్ ఐపీఎస్ అధికారి కె.రామచంద్రారావు సవతి తండ్రి అవుతాడు. భద్రతా తనిఖీలను తప్పించుకునేందుకు తండ్రి పేరును దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలున్నాయి. ఆమెను అరెస్టు చేసిన అధికారులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. -
పెళ్లి చేసుకున్నాం.. కానీ వేరుగా ఉంటున్నాం!
బెంగళూరు: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం డీఆర్ఐ కస్టడీలో ఉన్న కన్నడ నటి రన్యారావు కేసుకు సంబంధించి ఆమె భర్త జతిన్ హుక్కేరీని మరోసారి కర్ణాటక హైకోర్టులో హాజరుపరిచారు. రన్యారావు చేస్తున్న స్మగ్లింగ్ తో ఏమైనా సంబంధాలు ఉన్నాయన్న కోణంలో జతిన్ ను కస్టడీకి ఇవ్వాలంటూ డీఆర్ఐ కోరింది. ఈ క్రమంలోనే జతిన్ ను మరోసారి ఈరోజు(సోమవారం) కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే రన్యారావు స్మగ్మింగ్ తో తనకు ఏమీ సంబంధం లేదని చెబుతున్న జతిన్.. తాము పెళ్లి చేసుకున్నాం.. కానీ వేరుగా ఉంటున్నామని కోర్టుకు తెలిపాడు. గతేడాది నవంబర్ లో తమ పెళ్లి జరగ్గా, డిసెంబర్ నుంచి ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. ఇదే విషయాన్ని జతిన్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. తన క్లయింట్ కు ఇందులో ఎటువంటి సంబంధం లేదని, జతిన్ ను కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేదని వాదించారు. దాంతో ఏకీభవించిన కోర్టు.. తదుపరి విచారణ వరకూ జతిన్ పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు. ఈనెల 11వ తేదీన కూడా హైకోర్టు ఇదే విషయాన్ని స్పష్టం చేయగా, మరోసారి రన్యారావు భర్త జతిన్ పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని డీఆర్ఐ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.కాగా, 12 కేజీలకు పైగా బంగారం కడ్డీలను తన బెల్ట్ లో పెట్టుకుని దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తూ రన్యారావు పట్టుబడింది. బెంగూళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె అధికారులకు చిక్కింది. ప్రస్తుతం ఆమె మూడు రోజుల డీఆర్ఐ అధికారుల కస్టడీలో ఉంది. దీనిలో భాగంగా ఆమెను విచారిస్తున్న అధికారులు ఇందులో ‘కింగ్ పిన్’ ఎవరు అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. అయితే బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. శనివారం సెషన్స్ కోర్టులో బెయిల్ కోరుతూ పిటిషన్ వేయగా దాన్ని కోర్టు తిరస్కరించింది. -
రన్యా రావుపై బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు
బెంగళూరు: కన్నడ నటి రన్యారావుపై బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె తన ప్రైవేటు భాగాల్లో బంగారం దాచిపెట్టి స్మగ్లింగ్ చేసిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో మంత్రుల ప్రమేయం కూడా ఉందని అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.బీజాపూర్ బీజేపీ ఎమ్మెల్యే బసంగౌడ పాటిల్ యత్నాల్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రన్యారావు తన శరీరమంతా బంగారంతో కప్పేసింది. ఆమె తన శరీరంలో ఏయే చోట్ల బంగారం దాచుకుని వచ్చిందో నాకు తెలుసు. ఆమె తన ప్రైవేటు భాగాల్లో బంగారం దాచిపెట్టి స్మగ్లింగ్ చేసింది. బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో మంత్రులకు కూడా ప్రమేయం ఉంది. ఈ విషయాలు అన్నీ నాకు తెలుసు. శాససభ సమావేశాల్లో ఒక్కొక్కరి బండారం బయటపెడతాను. ప్రతి పాయింట్ అసెంబ్లీలో వివరిస్తాను. రన్యా రావుతో పరిచయం ఉన్న ఇద్దరు మంత్రుల పేర్లను సభలో చెబుతాను. నేను ఇప్పుడు మీడియా ముందు దాని గురించి మాట్లాడను. ఆమెకు ప్రోటోకాల్ ఇచ్చిన వారి గురించి మేము సమాచారాన్ని సేకరించాం. వాళ్ళకి బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి కోసం తెచ్చారో నాకు తెలుసు. ఎవరు తప్పు చేసినా, అది తప్పే. కస్టమ్స్ అధికారులు తప్పు చేస్తే, మేం వారిని సమర్థించడం లేదు’ అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మరోవైపు కస్టడీలో తనను టార్చర్ చేస్తున్నారంటూ రన్యా రావు కోర్టుకు వెల్లడించిన విషయం తెలిసిందే. తెల్ల కాగితంపై తన సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. కనీసం నిద్ర పోనివ్వకుండా, తిండి కూడా తిననివ్వడం లేదంటూ ఫిర్యాదు చేశారు. కాగా, రన్యా రావు కేసు విషయంలో ఎయిర్ పోర్టులో ప్రోటోకాల్ ఉల్లంఘన వెనుక ఆమె సవితి తండ్రి, ఐపీఎస్ అధికారి రామచంద్రరావు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో, ఆయన పాత్రపై విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. Karnataka BJP MLA Basangouda Patil Yatnal-"I will name all Ministers involved in Ranta Rao gold smuggling case in Assembly session. I have complete information about her relationships and how the gold was brought in.She had gold all over her body and smuggled it in." pic.twitter.com/6xd4dy5Tne— News Arena India (@NewsArenaIndia) March 17, 2025ఇదిలా ఉండగా.. బంగారం స్మగ్లింగ్ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార కాంగ్రెస్-బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. మార్చి 3న బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో రూ.12 కోట్ల విలువైన బంగారంతో రన్యా రావు పట్టుబడిన విషయం తెలిసిందే. దీంతో, రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు ఈ కేసును దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
పోలీసులపై కన్నడ నటి రన్యా రావ్ సంచలన ఆరోపణలు
-
రన్యారావు సంచలన ఆరోపణలు
బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ పట్టుబడిన కేసులో నిందితురాలు, కన్నడ నటి రన్యా రావు తాజాగా రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులపై ఆరోపణలు గుప్పించారు. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)కు మార్చి ఆరో తేదీన హర్షవర్థిని రన్యా పేరిట ఆమె రాసిన లేఖ తాజాగా బహిర్గతమైంది.పరప్పన అగ్రహార జైలు చీఫ్ సూపరింటెండెంట్ ద్వారా ఆమె ఈ లేఖను డీఆర్ఐకు పంపించారు. దుబాయ్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నప్పుడు తాను బంగారాన్ని తీసుకురాలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. కస్టడీలో ఉన్న సమయంలో రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పలుమార్లు చెంప దెబ్బ కొట్టారని, తెల్ల కాగితాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని చెప్పారు.‘‘ఈ అంశంలో నేను నిరపరాధినని వివరించేందుకు ఎంత ప్రయత్నించినా అధికారులు నా మాటల్ని వినిపించుకోలేదు. ఎయిర్పోర్ట్ బయటకాకుండా విమానంలోనే నన్ను అరెస్ట్‌చేశారు. కోర్టులో హాజరుపరచడానికి ముందు వరకు అధికారులు మొత్తంగా 10, 15 సార్లు చెంపదెబ్బ కొట్టారు. కొట్టినా, చెంపదెబ్బ తిన్నాసరే వాళ్లు టైప్‌చేసిన పేజీలపై సంతకాలు చేయబోనని చెప్పా. దీంతో అన్యాయంగా మా తండ్రి పేరును ఈ కేసులోకి లాగి పరువు తీస్తామని బెదిరించారు. తీవ్రమైన ఒత్తిడి కారణంగా వాళ్లు చెప్పినపనిచేశా. దాదాపు 60 టైప్‌చేసిన పేజీలపై, 40 తెల్లకాగితాలపై సంతకాలు చేశా’’అని అన్నారు.రన్యా రావు సవతి తండ్రి కె.రామచంద్రరావు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర పోలీసుల గృహ, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. ‘‘మూడో తారీఖు సాయంత్రం అరెస్టయితే నాలుగో తేదీ రాత్రి కోర్టులో హాజరుపరిచేదాకా నన్ను నిద్రపోనివ్వలేదు, తిండి పెట్టలేదు. ఆరోజు ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల్లా నటించిన కొందరు వ్యక్తులు ఆ విమానంలోని కొందరు ప్రయాణికులను రక్షించేందుకు నన్ను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారు.జడ్జి ఎదుట హాజరుపరిచేందుకు కారులో తీసుకెళ్లేటప్పుడూ అధికారులు బెదిరించారు. కొట్టిన విషయం చెప్తే నాన్న సంగతి, నా సంగతి చూస్తామని బెదిరించారు. రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల కస్టడీలో ఉన్నకాలంలో బలవంతంగా తీసుకున్న నా వాంగ్మూలాలకు విలువ ఇవ్వకండి’’అని డీఆర్ఐకు లేఖలో విజ్ఞప్తి చేశారు. కస్టడీలో ఉన్న కాలంలో కళ్ల కింద నల్లని చారలతో, నిస్సత్తువగా ఉన్న రన్యా రావు ఫొటో ఒకటి వైరల్‌గా మారిన విషయం తెల్సిందే.మూడ్రోజులు రెవెన్యూ ఇంటెలిజెన్స్ కస్టడీలో ఉన్న ఆమెను ఆ తర్వాత జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. గతంలో రన్యా రావు భిన్న వాదనలు చేశారు. అరెస్ట్‌సమయంలో తన నుంచి పోలీసులు 17 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారని ఏడోతేదీన వాంగ్మూలంలో ఒప్పకున్నారు. అధికారులు ఇష్టమొచ్చినట్లు తిట్టారని పదో తేదీన కోర్టులో ఆమె చెప్పారు. అయితే కొట్టలేదని ఒప్పుకున్నారు. మరోవైపు, రన్యారావు సవతి తండ్రి రామచంద్రరావును కర్ణాటక ప్రభుత్వం తాజాగా సెలవుపై పంపించింది. ఈ మేరకు శనివారం నిర్ణయం తీసుకుంది. -
చెంపదెబ్బలు కొట్టారు.. ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించారు: రన్యా
-
అమాయకురాల్ని.. తెల్ల కాగితాలపై బలవంతంగా సంతకం..: రన్యా రావు లేఖ
కన్నడ నటి రన్యా రావు (Ranya Rao) కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. తానసలు బంగారం అక్రమ రవాణా చేయలేదని యూటర్న్ తీసుకుంది. తాను గోల్డ్ స్మగ్లింగ్ చేసినట్లుగా అధికారులే బలవంతంగా ఖాళీ పేపర్లపై సంతకం చేయించారని తెలిపింది. తనకు న్యాయం చేయండంటూ డీఆర్ఐ (Directorate of Revenue Intelligence) అడిషనల్ డైరెక్టర్ జనరల్‌కు లేఖ రాసింది. ఒత్తిడి చేశారుఇటీవల బెంగళూరు ఎయిర్‌పోర్టులో దాదాపు రూ.17 కోట్ల విలువైన బంగారంతో అధికారులకు పట్టుబడింది నటి రన్యారావు. ఆమెను అరెస్ట్ చేసి విచారించగా బంగారం అక్రమ రవాణా చేసినట్లు అంగీకరించింది. ఇంతలో తన తప్పే లేదంటూ లేఖ రాయడం సంచలనంగా మారింది. ఆ లేఖలో ఇంకా ఏముందంటే.. నేను ఎటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడలేదు. కావాలనే నన్ను ఈ కేసులో ఇరికించారు. పోలీసులు అరెస్టు చేసినప్పటి నుంచి కోర్టులో ప్రవేశపెట్టేవరకు నరకం చూపించారు. స్మగ్లింగ్ చేసినట్లుగా ఒప్పుకోమని ఒత్తిడి చేశారు. ఖాళీ పేపర్లపై సంతకం15 సార్లు నా చెంప పగలగట్టారు. బలవంతంగా సంతకం చేయించారు. నాపై దాడి చేసిన అధికారులను నేను గుర్తుపట్టగలను. శారీరక హింస, మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోయాను. వారు చెప్పినట్లుగా 50-60 పేజీలను చదవకుండానే సంతకం చేశాను. అలాగే మరో 40 తెల్లకాగితాలపైనా సంతకం చేయించారు. దయచేసి ఈ కేసులో పారదర్శక విచారణ జరిపించి నాకు న్యాయం చేయండి అని లేఖలో పేర్కొంది. ఇకపోతే ఇటీవల రన్య కస్టడీలో ఉన్నప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో రన్య కళ్ల కింద చర్మం కమిలిపోయి ఉండటం స్పష్టంగా కనిపించింది.(చదవండి: నితిన్ వల్లే ఐటం సాంగ్ చేశా.. ఇప్పటికీ ఇబ్బందిగా అనిపిస్తుంది: గుత్తా జ్వాల)ఏం జరిగింది?నటి రన్యారావు మార్చి 3న బెంగళూరు ఎయిర్‌పోర్టులో 14 కిలోల బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తూ పట్టుబడింది. ఈమెకు సీనియర్ ఐపీఎస్ అధికారి కె.రామచంద్రారావు సవతి తండ్రి అవుతాడు. భద్రతా తనిఖీలను తప్పించుకునేందుకు తండ్రి పేరును దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలున్నాయి. ఆమెను అరెస్టు చేసిన అధికారులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. విచారణలో స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారి అంటూ నేరాన్ని అంగీకరించిన ఆమె ఇప్పుడు యూటర్న్ తీసుకోవడంతో కేసు ఆసక్తికరంగా మారింది. ఇటీవల రన్యారావు బెయిల్ కోసం బెంగళూరు ఆర్థిక నేరాల కోర్టును ఆశ్రయించగా.. బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ క్రమంలో ఆమె ఉన్నతాధికారులకు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.చదవండి: హీరో విజయ్ 10 సినిమాలు రిజెక్ట్ చేశా: మ్యూజిక్ డైరెక్టర్ -
రన్యారావుతో నాకే సంబంధం లేదు: పిడుగురాళ్ల వ్యాపారి
పల్నాడు, సాక్షి: పిడుగురాళ్లలో తక్కువ ధరకే బంగారు బిస్కెట్లు ఇస్తానంటూ ఓ వ్యాపారి భారీ మోసానికి పాల్పడ్డాడన్న వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఎపిసోడ్లో ఇప్పుడు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో కన్నడ నటి, గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన రన్యా రావు(Ranya Rao) పేరు తెర మీదకు రాగా.. పరారీలో ఉన్నాడని చెబుతున్న సదరు వ్యాపారి ఈ అంశంపై స్పందించాడు. ఏం జరిగిందంటే.. స్థానికంగా తాను మిర్చి ఎగుమతి, బంగారు దిగుమతి చేస్తున్నానని.. తక్కువ ధరకే బంగారు బిస్కెట్లు ఇస్తానంటూ సదరు వ్యాపారి ప్రచారం చేశాడు. అయితే అతని ఆర్భాటాలు, అప్పటికే అతను చేసిన దానధర్మాలు చూసిన కొందరు అది నిజమేనని నమ్మారు. దాచేపల్లి, కారంపూడి, సత్తెనపల్లి, నరసరావుపేటకు చెందిన కొందరు సదరు వ్యాపారికి డబ్బు ముట్టజెప్పారు. మార్చి మొదటి వారం నుంచి ఆ వ్యాపారి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. దీంతో తాము మోసపోయామన్న ఆందోళనతో బాధితులు లబోదిబోమన్నారు. అయితే సదరు వ్యాపారి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని భావిస్తుండగా.. అతని పేరిట ఓ వాట్సాప్ సందేశం ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.తానేం దేశం విడిచి పారిపోలేదని.. ఇండియాలోనే ఉన్నానని.. తనకు రావాల్సిన డబ్బులు ఆగిపోయాయని, రెండు నెలల టైం ఇస్తే అందరి డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని ఆ ఆడియో మెసేజ్‌లో చెప్పాడు. వందల కోట్లు ఎగ్గొట్టాడని వార్తల్లో వస్తున్న కథనాలను ఆ వ్యాపారి తోసిపుచ్చాడు. అలాగే.. నటి రన్యా రావుతో లింకులు ఉన్నాయంటూ వస్తున్న కథనాలను ఆయన ఖండించాడు. ఆమెతో తనకు ఎలాంటి లావాదేవీలు లేవని ఆ ఆడియో మెసేజ్‌తో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. -
రన్యా రావు స్నేహితుడు తరుణ్‌రాజ్‌కు రిమాండ్
బంగారం అక్రమరవాణా కేసులో అరెస్ట్ అయిన నటి రన్యా రావు స్నేహితుడు తరుణ్‌రాజ్‌కు 14 రోజుల పాటు జుడీషియల్ రిమాండ్ విధిస్తూ బెంగళూరు ఆర్థిక నేరాల విభాగం కోర్టు ఆదేశించింది. తరుణ్‌రాజ్‌ను కస్టడీ గడువు ముగియడంతో డీఆర్ఐ అధికారులు అతన్ని కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు 14 రోజుల పాటు జుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించింది. ఆమె ఆప్తుడు, పారిశ్రామికవేత్త తరుణ్ రాజ్‌ను రిమాండ్‌కు తరలించడంతో ఆమెలో ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది.బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యారావు(34) వ్యవహారంపై మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు ముమ్మరం చేసింది. బెంగళూరుతో పాటు ఆమెకు సంబంధించిన పలు చోట్ల దాడులు చేపట్టింది. ఈ రాకెట్లో భారీ కుట్ర దాగి ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈడీ అధికారులు కూడా ఆ దిశగానే దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారంలో సీబీఐ కూడా ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. సౌదీ అరేబియాతో పాటు అమెరికా, పశ్చిమాసియా, ఐరోపా దేశాలలో కూడా రన్యారావు ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో అంతర్జాతీయ రాకెట్ హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. -
Ranya Rao : మరో బిగ్ షాక్.. రన్యారావు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!
బెంగళూరు : కన్నడ నటి రన్యారావు (Ranya Rao) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. భారీ మొత్తంలో అక్రమంగా బంగారం (Gold) తరలిస్తూ పట్టుబడిన రన్యా రావుకు బెంగళూరు ఆర్థిక నేరాల కోర్టు (Court for Economic Offences) ఆమెకు బెయిల్ తిరస్కరించింది. బంగారం స్మగ్లింగ్ కేసులో రన్యారావు బెంగళూరు ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆమె వెనక గోల్డ్ స్మగ్లింగ్ సిండికేట్ ఉందనే అనుమానం వ్యక్తం చేసింది. .డీఆర్ఐ అధికారుల విచారణ ముమ్మరంఇటీవల బెంగళూరు ఎయిర్ పోర్టులో రూ.12.56కోట్లు విలువైన గోల్డు బార్స్‌ని స్మగ్లింగ్ చేస్తూ రన్యారావు పట్టుబడిన కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI)దర్యాప్తు అధికారులు విచారణను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా రన్యారావుకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.2.06కోట్లు విలువ చేసే బంగారం, రూ.2.67కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. రన్యారావు కేసులో భర్త?ఈ క్రమంలో గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)అధికారులు సైతం కేసు విచారణ చేపట్టారు. రన్యా రావు తన భర్త జతిన్ హుక్కేరి క్రెడిట్ కార్డును ఉపయోగించి బెంగళూరు నుండి దుబాయ్‌కు రౌండ్ ట్రిప్ టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. దీంతో రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో అతని పాత్ర ఎంత? అనే దిశగా విచారణ ప్రారంభించారు. రన్యారావు భర్తకు తాత్కాలిక ఊరటడైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) బెంగళూరులోని హుక్కేరికి చెందిన పది ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. ఇదే కేసులో డీఆర్ఐ అధికారులు తనని అరెస్ట్ చేయకుండా ఉండేలా ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సైతం హుక్కేరీని అరెస్ట్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది.రన్యారావుకు ఫోన్ చేసింది ఎవరు?డీఆర్ఐ విచారణలో రాన్యా రావుకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు గుర్తించారు. సదరు అగంతకులు రన్యారావును గోల్డ్ స్మగ్లింగ్ చేయాలని ఆదేశించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని రన్యారావును విచారించగా.. యూట్యూబ్‌లో చూసి బంగారం అక్రమంగా ఎలా తరలించాలో నేర్చుకున్నట్లు వెల్లడించారు. ఇక ఆమెను దుబాయ్ ఎయిర్‌పోర్టులో టెర్మినల్ 3 aగేటు సమీపంలో ఓ వ్యక్తి వద్ద గోల్డ్‌ను తీసుకున్నానని, అంతకుముందు గోల్డ్ స్మగ్లింగ్ చేయలేదని చెప్పినట్లు సమాచారం. -
రన్యా రావు ఇంట్లో ఈడీ సోదాలు
-
స్మగ్లింగ్ ఇదే మొదటిసారి!
బనశంకరి: బంగారం తీసుకు రావడం ఇదే మొదటిసారి.. అని విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ కేసులో పట్టుబడిన రన్య రావు(Ranya Rao) డీఆర్ఐ అధికారుల విచారణలో చెప్పింది. మార్చి 1వ తేదీన నాకు విదేశీ ఫోన్ నంబరు నుంచి కాల్ వచ్చింది. రెండు వారాలుగా గుర్తుతెలియని విదేశీ నంబర్ల నుంచి అనేక కాల్స్ వస్తున్నాయి. దుబాయ్ విమానాశ్రయం టెర్మినల్ మూడోగేట్–ఏ కు వెళ్లాలని సూచించారు. అక్కడ బంగారం తీసుకుని బెంగళూరుకు తీసుకెళ్లాని చెప్పారు. మార్చి 3వ తేదీన దుబాయ్‌లో తెల్లని దుస్తులు ధరించిన వ్యక్తి 17 బంగారు బిస్కెట్లు ఉన్న బాక్సు ఇచ్చాడు. బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయం నుంచి బయటికి వెళ్లిన తరువాత టోల్‌గేటు దాటి సర్వీస్ రోడ్డులో ఆటో నిలిచి ఉంటుంది. అందులో ఉండే వ్యక్తికి బంగారం ఇవ్వాలని చెప్పారని ఆమె తెలిపింది. తరువాత టాయ్లెట్లోకి వెళ్లి శరీరమంతా బంగారు బిస్కెట్లు అంటించుకుని టేప్‌తో అతికించుకున్నాను. బెంగళూరుకు చేరుకోగానే పట్టుబడ్డానని తెలిపింది. బంగారాన్ని ఎలా తరలించాలో యూట్యూబ్ వీడియోలు చూసి నేర్చుకున్నానని పేర్కొంది. భర్త క్రెడిట్ కార్డుతో టికెట్లు ఫోన్ చేసిన వ్యక్తులు ఆఫ్రికన్, అమెరికన్ భాషల్లో మాట్లాడారని రన్య చెప్పింది. తన భర్త జతిన్ విజయ్‌కుమార్ క్రెడిట్‌కార్డు ద్వారా విమాన టికెట్లు బుక్ చేశానని రన్య చెబుతోంది. ఫోటోగ్రఫీ, రియల్ఎస్టేట్ పనులపై నేను అప్పుడప్పుడు యూరప్, అమెరికా, ఆఫ్రికా, పశ్చిమ ఆసియా దేశాలకు వెళ్లానని తెలిపింది. రన్య చెప్పేది నమ్మశక్యంగా లేదని డీఆర్ఐ అనుమానిస్తోంది. ఆమె మొబైల్, ల్యాప్‌టాప్‌లో స్మగ్లింగ్ సంబంధాలు లభించాయని సమాచారం. మరోవైపు తనపై మీడియాలో వ్యతిరేక వార్తలు రాయకుండా ఆదేశాలివ్వాలని ఆమె కోర్టులో అర్జీ వేశారు.Ranya Rao : రన్యారావు కేసులో భారీ ట్విస్ట్ -
రన్యా రావు ఇళ్లపై ఈడీ దాడులు
బనశంకరి: బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యా రావు, ఆమె సన్నిహితుల ఇళ్లలో గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు చేపట్టింది. బెంగళూరులోని ల్యావెల్లి రోడ్డులోని రన్యా రావు ఇల్లు, కోరమంగళ, జయనగర, బసవనగుడి తదితర ప్రాంతాల్లోని ఆమె బంధుమిత్రుల నివాసాల్లో అధికారులు సోదాలు జరిపారు. రన్యా రావు విదేశాలకు వెళ్లడానికి విమానం టికెట్లు బుక్ చేసింది ఎవరు, ఈ టూర్లకు సాయం చేసిందెవరు, ఆమె వ్యవహారాల్లో ఎవరెవరి పాత్ర ఎంత? అనే విషయాలను తేల్చడానికి ఈ సోదాలు జరిపిన అధికారులు కొన్ని ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. బంగారం దందా చాలా పెద్దస్థాయిలో, దేశవ్యాప్తంగా ఉండి ఉండొచ్చని ఈడీ అనుమానిస్తోంది. రన్యా రావును కస్టడీలో విచారించిన డీఆర్ఐ అధికారులు ఆమె ఆప్తుడు, పారిశ్రామికవేత్త తరుణ్ రాజ్‌ను ప్రశ్నిస్తున్నారు. ఆమెపై డీఆర్ఐ కేసు నమోదుచేసి విచారిస్తుండగా, సీబీఐ రంగంలోకి దిగడం తెలిసిందే. ఈ రెండింటి ఆధారంగా తాజాగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ నెల 3న దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి వచి్చన రన్యా రావు వద్ద డీఆర్ఐ అధికారులు రూ.12.56 కోట్ల విలువైన బంగారం కడ్డీలను స్వాధీనం చేసుకోవడం తెల్సిందే. -
బెంగళూరు, కోరమంగళలోని రన్యా రావ్ నివాసాలపై ఈడీ దాడులు
-
యూట్యూబ్ చూసి నేర్చుకున్నా: రన్యా రావు
బెంగళూరు: దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన కన్నడ నటి రన్యా రావు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే రావు బెయిల్ అర్జీపై తీర్పును బెంగళూరులోని ఆర్థిక నేరాల విభాగం ప్రత్యేక కోర్టు 14వ తేదీకి రిజర్వు చేసింది. ఇక రన్యా బంగారం దందాలో కొత్త కొత్త సంగతులు వెలుగులోకి వస్తున్నాయి.తాజాగా ఈ కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఆమెను కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విచారణ సందర్భంగా ఆమె పలు విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. విచారణలో రన్యా రావు..‘దుబాయ్ నుంచి ఇంతకుముందు ఎప్పుడూ బంగారాన్ని అక్రమంగా తీసుకురాలేదు. స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారి. ఎవరికీ కనబడకుండా బంగారాన్ని ఎలా దాచాలన్నది యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నా’ అంటూ అధికారులకు చెప్పినట్లు సమాచారం.ఇదిలా ఉండగా.. రన్యా రావు బంగారు స్మగ్లింగ్ కేసులో రాష్ట్ర పోలీసులు అధికారాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై సీఐడీ దర్యాప్తునకు అనుమతిస్తూ జారీ చేసిన ఉత్తర్వును కర్ణాటక ప్రభుత్వం బుధవారం ఉపసంహరించుకుంది. అయితే, కర్ణాటక ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తా నేతృత్వంలో రన్యా రావు తండ్రి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) కె రామచంద్రరావు పాత్రపై దర్యాప్తు కొనసాగుతుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.తరుణ్ మాస్టర్ మైండ్ దుబాయ్‌లో బంగారం కొనుగోలు చేయడం, తిరిగి రావడం ఎలా అనే అన్ని వివరాలను నటి రన్య స్నేహితుడు, పారిశ్రామికవేత్త కుమారుడు తరుణ్‌రాజు మార్గదర్శకం చేసినట్లు డీఆర్ఐ అధికారుల విచారణలో వెలుగుచూసింది. పట్టుబడిన తరుణ్‌రాజును విచారిస్తున్నారు. దుబాయ్‌కు వెళ్లే రన్యాతో నిరంతరం సంప్రదించేవాడు. అతడు చెప్పినట్లు ఆమె నడుచుకునేది. విదేశాల నుంచి బంగారం తీసుకొచ్చే కొరియర్‌గా ఆమెను వాడుకున్నాడని డీఆర్ఐ భావిస్తోంది. ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారణ జరిపారు. కొన్నేళ్లుగా రన్యారావుతో తరుణ్‌రాజు ఆత్మీయంగా ఉంటున్నాడు. అతనికి దుబాయ్‌లో కొందరు పారిశ్రామికవేత్తలు బాగా తెలుసు. భారీగా ధన సంపాదన ఆశతో బంగారం స్మగ్లింగ్‌లో నిమగ్నమయ్యాడు. అతనిని ఐదురోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇందులో రన్యా స్నేహితుల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది.సమగ్ర విచారణ జరగాలి: మంత్రి లక్ష్మి నటి రన్యా రావు బంగారం కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తేనే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని మహిళా శిశు సంక్షేమ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ తెలిపారు. ఈ కేసులో ఓ ప్రముఖ మంత్రి హస్తం ఉందనే ఆరోపణలపై బుధవారం విధానసౌధలో విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. కేసు పూర్తి స్థాయిలో విచారణ జరగాలన్నారు. గ్యారంటీ పథకాలను కమిటీల గొడవపై స్పందిస్తూ ఆ కమిటీలను రద్దుచేయాలని ప్రతిపక్షాలు చేపట్టిన ధర్నాకు అర్థం లేదన్నారు. తమ పథకాలను పోలిన స్కీములను అమలు చేసిన కొన్ని బీజేపీ ప్రభుత్వాలు రెండు నెలల తరువాత రద్దు చేశాయని ఆరోపించారు. -
రన్యారావును నిద్రపోనివ్వడం లేదు!
బెంగళూరు: అక్రమ బంగారం రవాణా కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావు.. బెయిల్ కోసం ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. అయితే విచారణ పేరుతో అధికారులు ఆమెను నిద్రపోవడం లేదని ఆమె తరఫు న్యాయవాది బుధవారం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణ పేరుతో నా క్లయింట్ రన్యారావును డీఆర్ఐ అధికారులు నిద్రపోనివ్వడం లేదు. అరెస్టైన సమయంలో తనకున్న హక్కుల గురించి ఆమెకు పూర్తిగా తెలియదని. హత్యా అభియోగాలు దాఖలైన కేసుల్లోనూ నిందితులు మహిళలైతే బెయిల్ లభించిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. అలాంటప్పుడు నా క్లయింట్ కూడా బెయిల్ పొందడానికి అర్హురాలే. కాబట్టి ఆమెకు ఊరట ఇవ్వాలని వాదనలు వినిపించారాయన.మార్చి 3వ తేదీన.. దుబాయ్ నుంచి విమానంలో అక్రమంగా బెంగళూరుకు బంగారాన్ని తెస్తూ కెంపగౌడ ఎయిర్‌పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సీ(DRI) అధికారులకు రన్యారావు దొరికిపోయారు. నడుము చుట్టూ, కాళ్ల కిందిభాగం, షూలో 14 కేజీల బంగారాన్ని దాచారు. అయితే.. ఈ కేసు దర్యాప్తులో లోతుకు వెళ్లే కొద్దీ.. కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ఏడాది చివర్లో రెండుసార్లు దుబాయ్‌లో బంగారం కొనుగోలు చేసిన ఆమె.. దానిని తీసుకొని తాను స్విట్జర్లాండ్ వెళ్తున్నానని అక్కడి కస్టమ్స్ అధికారులకు వెల్లడించినట్లు తేలింది. ఆమె ప్రయాణ వివరాలను పరిశీలిస్తే, ఆమె భారత్‌కు వచ్చినట్లు వెల్లడైందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తన అరెస్ట్ మెమోలో పేర్కొంది. అలాగే.. స్మగ్లింగ్ చేసే సమయంలో ఎయిర్‌పోర్టులో వీఐపీ ప్రొటోకాల్‌ను దుర్వినియోగం చేసినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై విచారణ జరపాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. భద్రతా తనిఖీలను తప్పించుకునేందుకు ఆమె సవతి తండ్రి, సీనియర్ ఐపీఎస్ అధికారి కె.రామచంద్రరావు పేరును ఉపయోగించుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
నటి రన్యా రావు కేసులో భారీ ట్విస్ట్.. తరుణ్ రాజు అరెస్ట్
బెంగళూరు: కన్నడ సినీ నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఆమె సవతి తండ్రి, డీజీపీ స్థాయి అధికారి కె.రామచంద్రరావు ప్రమేయంపై నిగ్గు తేల్చాలని కర్ణాటక ప్రభుత్వం అదనపు చీఫ్ సెక్రటరీ గౌరవ్ గుప్తాను ఆదేశించింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయినట్లు సీఎం కార్యాలయం మంగళవారం తెలిపింది.ఇక, అదే సమయంలో, కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విధి నిర్వహణలో పోలీసు అధికారుల నిర్లక్ష్యం, లోటుపాట్లపైనా విచారణ చేపట్టాలని సీఐడీ విభాగాన్ని ఆదేశించింది. తక్షణమే దర్యాప్తు చేపట్టి, వారం లోగా నివేదిక అందించాలని స్పష్టం చేసింది. విచారణకు సహకరించాల్సిందిగా సంబంధిత పోలీసు విభాగాలను సీఎంవో కోరింది.రామచంద్రరావు ప్రస్తుతం కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ నెల 3వ తేదీన దుబాయ్ నుంచి బెంగళూరుకు చేరుకున్న రన్యా రావు వద్ద డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)అధికారులు రూ.12.56 కోట్ల విలువైన బంగారు కడ్డీలను స్వా«దీనం చేసుకున్నారు. మరునాడు ఆమె ఇంట్లో మరికొంత బంగారం, డబ్బు స్వా«దీనం చేసుకోవడం తెలిసిందే. తరచూ దుబాయి వెళ్లి వస్తూ ఆమె బంగారాన్ని దొంగచాటుగా తీసుకువస్తోందని, విమానాశ్రయంలోని పోలీసు సిబ్బంది సోదాలు జరపకుండా ఆమెను పంపించి వేస్తున్నట్లు తేలింది. ఈ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించడంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కాగా, రన్యా రావు బంగారం స్మగ్లింగ్ వ్యవహారంతో మంత్రులకు సంబంధాలున్నట్లు వస్తున్న వార్తలన్నీ రాజకీయ పుకార్లేనని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కొట్టిపారేశారు. కేంద్ర విభాగాలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. DRI Busts Smuggling Nexus: Ranya Rao’s associate, Tarun Raju, has been taken into custody as part of the ongoing smuggling investigation.#RanyaRao #TarunRaju #DRIProbe #SmugglingCase #BreakingNews #NewsX pic.twitter.com/7zE4CBQA3i— NewsX World (@NewsX) March 11, 2025హోటల్ యజమాని మనవడు అరెస్ట్ ఇదే కేసులో డీఆర్ఐ అధికారులు మంగళవారం బెంగళూరులోని అట్రియా హోటల్ యజమాని మనవడు తరుణ్ రాజును అరెస్ట్ చేశారు. అతడిని బెంగళూరులోని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో హాజరు పరచగా ఐదు రోజుల కస్టడీకి అనుమతించిందని డీఆర్ఐ తెలిపింది. రన్యా రావు, తరుణ్ రాజులకు సన్నిహిత సంబంధాలున్నాయని, విదేశాల నుంచి బంగారాన్ని దొంగచాటుగా తేవడం వీరు కూడబలుక్కుని చేసిందేనని అంటోంది. రన్యా రావు వేరొకరిని పెళ్లి చేసుకోవడంతో వీరి మధ్య సంబంధాలు బెడిసి కొట్టినా చట్ట విరుద్ధ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారంది. దుబాయి నుంచి బంగారాన్ని తీసుకువచ్చేటప్పుడు రన్యా రావు తరుణ్ రాజుతో ఫోన్లో మాట్లాడినట్లు డీఆర్ఐ తెలిపింది. వీరిద్దరినీ వేర్వేరుగా, కలిపి సైతం విచారించినట్లు వివరించింది. అయితే, విచారణ సమయంలో అధికారులు తనను బెదిరించారని, మానసికంగా వేధించారని సోమవారం కోర్టు విచారణ సమయంలో రన్యా రావు ఆరోపించింది. తనను కొట్ట లేదు కానీ, పరుషంగా దూషించారని తెలిపింది. ఇష్టం లేకున్నా తనతో కొన్ని పత్రాలపై సంతకాలు చేయించారని రోదిస్తూ జడ్జికి ఫిర్యాదు చేసింది. -
కూతురి స్మగ్లింగ్‌లో డీజీపీ పాత్ర ఉందా?
బనశంకరి: నటి రన్య రావు పెంపుడు తండ్రి, రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ డీజీపీ రామచంద్రరావు చిక్కుల్లో పడ్డారు. రన్యకు బెంగళూరు విమానాశ్రయంలో ప్రోటోకాల్ ఇవ్వడం గురించి విచారణ చేపట్టి వారంలోగా నివేదిక అందించాలని హోంశాఖను సర్కారు ఆదేశించింది. బంగారం స్మగ్లింగ్ లో ఆయన కుమ్మక్కయ్యారా, ప్రోటోకాల్ దుర్వినియోగానికి పాల్పడడం వెనుక ఆయన హస్తం ఉందా అనే దానిపై వారంలోగా విచారణ చేపట్టి నివేదిక అందించాలని ఆదేశించింది. నటి రన్య తన ప్రయాణాల్లో రామచంద్రరావు పేరును విరివిగా వాడుకున్నారు. రన్య కేసు శాసనసభ సమావేశాల్లో తీవ్ర చర్చకు రావడం తెలిసిందే. ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ప్రతిపక్ష బీజేపీ మండిపడడంతో ప్రభుత్వం ఇరుకునపడింది. రన్య ప్రోటోకాల్‌పై నివేదిక మరోపక్క రన్య రావు ప్రోటోకాల్ దుర్వినియోగం పట్ల పోలీస్ కమిషనర్ దయానంద్‌కు డీసీపీ నివేదిక అందజేశారు. రన్య రావ్ అరెస్టైనరోజు ప్రోటోకాల్‌లో ఉన్న కానిస్టేబుల్ బసవరాజుకు ఆమె కాల్ చేసి విమానాశ్రయంలో టెరి్మనల్ వన్ వద్దకు రావాలని తెలిపింది. ఇప్పుడు రాలేను మేడం, వేరే ఆఫీసర్ వస్తున్నారు, రిసీవ్ చేసుకోవాలి అని బసవరాజు చెప్పాడు. నువ్వే రావాలి లేకపోతే, అప్పాజీ కి చెబుతానని రన్య హెచ్చరించినట్లు నివేదికలో ప్రస్తావించారు. పోలీస్ స్టిక్కర్ వాడొద్దు: హోంమంత్రి దొడ్డబళ్లాపురం: పోలీసులు, వారి కుటుంబ సభ్యులు సొంత వాహనాలపై పోలీస్ అనే స్టిక్కర్లు వేసుకోవడం మామూలే. ఇది ఏ మాత్రం మంచిది కాదని, ఇది కచ్చితంగా చట్టాన్ని , నిబంధనలను ఉల్లంఘించడమేనని హోంమంత్రి పరమేశ్వర్ చెప్పారు. 2022 ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇలా స్టిక్కర్లు వేసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని మంగళవారం అసెంబ్లీలో చెప్పారు. శ్రవణబెళగోళ ఎమెల్యే సీఎస్ బాలక్రిష్ణ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు తెలిపారు. రన్య అరెస్టు వెనుక...బనశంకరి: బంగారం దొంగరవాణా కేసులో నటి రన్య రావు పట్టుబడటం వెనుక ఆమె భర్త, ఢిల్లీలో అరెస్టైన ఇద్దరు స్మగ్లర్లు, పలువురు పెద్దలు ఉన్నట్లు తెలిసింది. ఇటీవల జతిన్ హుక్కేరి అనే వ్యక్తితో రన్యకు బెంగళూరులో ఆర్భాటంగా వివాహం జరిగింది. కానీ వారి మధ్య గొడవలు వచ్చాయి. రన్య పదేపదే విదేశాలకు వెళ్లడం గురించి భర్త ప్రశ్నించేవాడు. ఆయనే డీఆర్ఐకి సమాచారం ఇచ్చాడని తెలుస్తోంది. కొన్నిరోజుల కిందట ఢిల్లీలో డీఆర్ఐ అధికారులకు ఇద్దరు స్మగ్లర్లు దొరికారు. రన్య అనే యువతి కూడా బంగారం దొంగ రవాణా చేస్తోందని ఉప్పందించారు. దీంతో ఢిల్లీ నుంచి బెంగళూరు డీఆర్ఐ విభాగానికి అలర్ట్ వచ్చింది. 3వ తేదీ రాత్రి రన్య బెంగళూరు విమానాశ్రయంలో దిగగానే అదుపులో తీసుకున్నారు. రన్య అంటే పడని బంగారు వ్యాపారులు, ఓ మంత్రి కూడా సమాచారం ఇచ్చారని ప్రచారం సాగుతోంది. 28 సార్లు విదేశీ ప్రయాణం నటి రన్య కేసులో తరుణ్‌రాజు అనే వ్యక్తి అరెస్టు కావడం బెంగళూరులో చర్చనీయాంశమైంది. రన్య వెనుక తరుణ్‌రాజు ఉన్నాడని తెలుస్తోంది. బెంగళూరు కు బంగారం తెప్పించి హవాలా ద్వారా దుబాయికి డబ్బు పంపించేవారు. రన్య ఖర్చులన్నింటినీ తరుణ్‌రాజు చూసుకునేవాడు. ఐపీఎస్ అధికారి కూతురు కావడంతో రన్య ద్వారా సులభంగా బంగరాన్ని తెప్పించవచ్చని గుర్తించాడు. రన్య ఒక ఏడాదిలో 28 సార్లు విదేశీ పర్యటనలు చేసింది. గత 15 రోజుల్లో నాలుగుసార్లు దుబాయ్‌కి వెళ్లి వచ్చింది. ఐదోసారి దుబాయ్‌కి వెళ్లి వస్తుండగా జాతకం మారిపోయింది. -
Ranya Rao : రన్యారావు కేసులో భారీ ట్విస్ట్
బెంగళూరు : కన్నడ నటి రన్యారావు కేసులో భారీ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆమెపై డీఆర్ఐ అధికారులకు ఆమె భర్తే జతిన్ హుక్కేరి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పెళ్లైన రెండు నెలల నుంచి తరచు విదేశాలకు వెళ్తోంది. ఆమె విదేశీ టూర్లతో నిత్యం గొడవలు జరిగేవి.ఈ క్రమంలో తన భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో తన భర్త రన్యారావు డీఆర్ఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రన్యారావు కదలికలపై నిఘా పెట్టిన డీఆర్ఐ అధికారులు.. ఆమె బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. 15 రోజుల్లో నాలుగుసార్లు దుబాయ్‌కు వెళ్లడంకన్నడ హీరోయిన్ రన్యారావు (Ranya Rao) బంగారం అక్రమరవాణా కేసులో కటకటాలపాలైంది. 15 రోజుల్లో నాలుగుసార్లు దుబాయ్‌కు వెళ్లడం, అదికూడా ప్రతిసారి సేమ్ డ్రెస్ ధరించడంతో అధికారులకు అనుమానమొచ్చింది. సోమవారం (మార్చి 3న) ఆమెను బెంగళూరు ఎయిర్‌పోర్టులో తనిఖీ చేయగా 14 కిలోలకు పైగా బంగారంతో అడ్డంగా దొరికిపోయింది. దీంతో ఆమెను అరెస్టు చేసిన అధికారులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఇకపోతే రన్యా రావు తండ్రి కర్ణాటక డీజీపీ డాక్టర్ కే.రామచంద్రారావు పెళ్లయ్యాక మళ్లీ కలిసిందే లేదన్న డీజీపీఇప్పటికే ఈ విషయంపై డీజీపీ స్పందిస్తూ రన్యాకు నాలుగు నెలలకిందటే పెళ్లి జరిగిందని, అప్పటినుంచి తనను కలవలేదని పేర్కొన్నారు. కూతురు, అల్లుడు చేసే పనుల గురించి తనకెటువంటి విషయాలు తెలియదన్నాడు. ఈ క్రమంలో రన్యా భర్త ఎవరన్న వివరాలు బయటకు వచ్చాయి. రన్యా భర్త పేరు జతిన్ హుక్కేరి. ఈయన ఆర్కిటెక్ట్. బెంగళూరులో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పట్టా పొందాడు. తర్వాత లండన్‌లో డిస్రప్టివ్ మార్కెట్ ఇన్నొవేషన్ కోర్సు చదివాడు. తండ్రి డీజీపీ, భర్త ఆర్కిటెక్ట్మొదట్లో బెంగళూరులోని పలు రెస్టారెంట్లకు డిజైనర్‌గా పని చేశాడు. లండన్‌లోనూ ఆర్కిటెక్ట్‌గా సేవలందించాడు. WDA & DECODE LLC సంస్థను స్థాపించడంతోపాటు దానికి క్రియేటివ్ డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నాడు. క్రాఫ్ట్ కోడ్ కంపెనీకి ఫౌండర్ కూడా ఇతడే! రన్యారావును పెళ్లి చేసుకున్నాక తనతో కలిసి పలుమార్లు దుబాయ్ ట్రిప్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఎయిర్‌పోర్టులో బంగారం స్మగ్లింగ్ చేస్తూ రన్యా దొరికిపోగా.. ఆమె ఇంటిని సైతం తనిఖీ చేశారు. ఈ సోదాలో రూ.2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67 కోట్ల నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.సినిమారన్యా రావు.. కిశోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో నటనపై శిక్షణ తీసుకుంది. మాణిక్య అనే కన్నడ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఇది ప్రభాస్ మిర్చి మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. పటాస్ కన్నడ రీమేక్ పటాకిలో హీరోయిన్గా నటించింది. తమిళంలో వాఘా మూవీ చేసింది. ఎనిమిదేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది. -
కన్నడ నటి రన్యా రావ్ చుట్టు బిగుస్తున్న ఉచ్చు
-
నటి రన్యారావు కేసులో కీలక మలుపు
సినీ నటి రన్యారావు కీలక నిందితురాలిగా ఉన్న బంగారం అక్రమ రవాణా కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంతో పాటు వీఐపీ ప్రొటోకాల్ దుర్వినియోగం.. అందులో ఆమె సవతి తండ్రి ప్రమేయం తేల్చేందుకు సీఎం సిద్ధరామయ్య ప్రత్యేక విచారణకు ఆదేశించారు.ఈ కేసులో పోలీసుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు.. అలాగే తన విదేశీ పర్యటనల టైంలో వాళ్ల చేతుల్లో వేధింపులకు గురయ్యానన్న రన్యారావు ఆరోపణలపై సీఐడీ దర్యాప్తు జరపనుంది. వీలైనంత త్వరగా నిజనిర్ధారణలతో నివేదిక సమర్పించాలని దర్యాప్తు ఏజెన్సీని ప్రభుత్వం ఆదేశించింది.ఇక మరోవైపు.. నటి రన్యారావు వీఐపీ ప్రోటోకాల్‌ను దుర్వినియోగం చేస్తూ బంగారం అక్రమ రవాణా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెంపగౌడ ఎయిర్‌పోర్టులో ప్రోటోకాల్ దుర్వినియోగం అంశంపైనా ప్రభుత్వం విడిగా మరో దర్యాప్తునకు ఆదేశించింది. ఈ బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ అధికారి, అదనపు సీఎస్ గౌరవ్ గుప్తా అప్పగించింది. అలాగే.. ఈ అంశంలో ఆమె సవతి తండ్రి, డీజీపీ కె. రామచంద్రరావు పాత్రపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, అవసరమైతే ఆయన్ని విచారించాలని కోరింది. ఈ వ్యవహారంలో రామచంద్ర పాత్ర ఉందా? లేదా? అనేది తేల్చాలని గుప్తాకు వారం గడువు ఇచ్చింది ప్రభుత్వం. మార్చి 3వ తేదీన 14.8 కేజీల అక్రమ బంగారాన్ని దుబాయ్ నుంచి తీసుకొస్తూ.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సీ(DRI) అధికారులకు చిక్కిన కన్నడ నటి రన్యారావు చిక్కారు. ఈ కేసు దర్యాప్తులో లోతుకు వెళ్లే కొద్దీ.. కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. -
మాటలతో హింసిస్తున్నారు.. బెదిరిస్తున్నారు: కోర్టులో రన్యారావు
బెంగళూరు: గోల్డ్ స్మగ్మింగ్ కేసులో భాగంగా ప్రస్తుతం డీఆర్ఐ కస్టడీలో ఉన్న కన్నడ నటి రన్యారావును ఈరోజు(సోమవారం) బెంగళూరు స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. తన మొహంపై గాయాలు కనిపిస్తున్న క్రమంలో ఆమెను కోర్టుకు తీసుకెళ్లారు డీఆర్ఐ అధికారులు. అయితే కస్టడీలో ఏమైనా భౌతిక దాడులు జరిగాయా అని కోర్టు ప్రశ్నించగా.. తనను శారీరకంగా ఏమీ ఇబ్బందులు గురి చేయడం లేదని, కానీ మాటలతో మానసికంగా హింసిస్తున్నారని కోర్టులో కన్నీటి పర్యంతమైంది. అయితే మానసికంగా మాటలతో హింసిస్తున్నారని ఆమె చెబుతున్న వాదనను డీఆర్ఐ ఖండించింది. అందులో ఎటువంటి వాస్తవం లేదని, తమ నిబంధనల మేరjo దర్యాప్తు చేస్తున్నామన్నారు. తమ దర్యాప్తును మొత్తం రికార్డు చేస్తున్నామని డీఆర్ఐ పేర్కొంది.వైరల్‌గా మారిన ఫోటోరన్యారావుకు చెందిన ఓ ఫోటో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.. ఆమె కంటి కింద గాయాలు, ఉబికిన మొహంతో ఆమె ఫోటోలో ఉంది. ఆమెను కస్టడీలో తీసుకుని విచారణ పేరుతో చిత్ర హింసలు పెట్టారా? అనే అనుమానం కలుగుతోంది. దీనిపై కర్ణాకట మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రధానంగా వైరల్ గా మారిన ఫోటోను ఉటంకిస్తూ మహిళా కమిషన్ చైర్మన్ నాగలక్ష్మీ చౌదరి అనుమానం వ్యక్తం చేశారు. ఆమెపై అధికారులు దాడికి పాల్పడ్డారా? అనే ప్రశ్న లేవనెత్తారు. అయితే దీనిపై తాము నేరుగా దర్యాప్తు చేసే అవకాశం లేదన్నారు. రన్యారావు తముకు ఏమైనా ఫిర్యాదు చేస్తే ఆమెకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు నాగలక్ష్మి,‘మాకు ఆమె లేఖ రూపంలో ఫిర్యాదు చేస్తే మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆమె నుంచి ఫిర్యాదు అందిన పక్షంలో తమ పరిధిలో ఉన్న ఆయా విభాగాలను అప్రమత్తం చేస్తాం. సరైన రీతిలో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆమె ఏమైనా దాడికి గురయ్యిందా అనేది ఆమె ఫిర్యాదు రూపంలో ఇస్తేనే మేము ఏమైనా చేయగలం. ఒకవేళ ఆమె మమ్మల్ని సంప్రదించకపోతే దీనిపై కనీసం కామెంట్ కూడా చేయలేం’ అని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నాగలక్ష్మి పేర్కొన్నారు. ఈ నేపధ్యంలోనే ఆమెను స్పెషల్ కోర్టులో హాజరుపరిచినట్లు తెలుస్తోంది. గత సోమవారం 12 కేజీలకు పైగా బంగారం కడ్డీలను తన బెల్ట్ లో పెట్టుకుని దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తూ రన్యారావు పట్టుబడింది. బెంగూళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె అధికారులకు చిక్కింది. ప్రస్తుతం ఆమె మూడు రోజుల డీఆర్ఐ అధికారుల కస్టడీలో ఉంది. దీనిలో భాగంగా ఆమెను విచారిస్తున్న అధికారులు ఇందులో ‘కింగ్ పిన్’ ఎవరు అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. -
Ranya Rao : రన్యారావు వ్యవహారంలో మరో బిగ్ ట్విస్ట్
బెంగళూరు: గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ దొరికి పోయిన కన్ననటి రన్యారావు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రన్యారావు సంస్థకు గత బీజేపీ ప్రభుత్వం 12 ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలుస్తోంది.2023 జనవరిలో ఈ కేటాయింపులు జరిగినట్లు కర్ణాటక పారిశ్రామిక బోర్డ్ బయటపెట్టింది. తుముకూరు జిల్లాలో సిరా ఇండస్ట్రియల్ ఏరియాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఈ భూమి కేటాయించింది అప్పటి బసవరాజు బొమ్మై సర్కార్. రూ.138కోట్ల పెట్టుబడితో స్టీల్ టీఎంటీ బార్స్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తాను అని రన్యారావు సంస్థ ధరఖాస్తు చేసుకోగా సింగిల్ విండో కమిటీ ఆమోదం తెలిపింది. -
కస్టడీలో రన్యా రావు.. కన్నీళ్ల పర్యంతమైన నటి!
ప్రముఖ కన్నడ నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడింది. దుబాయ్ నుంచి బెంగళూరు చేరుకున్న ఆమెను డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి దాదాపు 14 కేజీలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే రన్యారావును అరెస్ట్ చేసిన అధికారులు రిమాండ్‌కు పంపించారు. ప్రస్తుతం రన్యా రావును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల కస్టడీలో ఉన్నారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.అయితే ఇవాళ డీఆర్ఐ అధికారుల ముందు విచారణకు హాజరైన రన్యారావు కన్నీళ్ల పర్యంతమైంది. అసలు ఇందులోకి ఎందుకు వచ్చానో అంటూ తన న్యాయవాదులతో అన్నారు. నిద్రలో కూడా ఎయిర్పోర్ట్ గుర్తొస్తోందని.. అస్సలు నిద్రపట్టడం లేదని తెలిపింది. మానసికంగా కృంగిపోయానని తన లాయర్లతో రన్యా రావు చెప్పింది. విచారణ సందర్భంగా ఫుల్ ఎమోషనలైంది రన్యా రావు. మరోవైపు ఆమెపై ఇప్పటికే సీబీఐ అధికారులు కూడా కేసు నమోదు చేశారు.కాగా.. మాణిక్య సినిమాతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన రన్యా రావు కేవలం మూడు చిత్రాల్లో మాత్రమే కనిపించింది. ఈ మూవీ తెలుగు సినిమా మిర్చి రీమేక్‌గా తెరకెక్కించారు. ఆ తర్వాత పటాస్ కన్నడ రీమేక్ పటాకిలో హీరోయిన్గా నటించింది. తమిళంలో వాఘా మూవీ చేసింది. ఎనిమిదేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది. బంగారు అక్రమ రవాణా చేస్తుండగా మార్చి 3న దుబాయ్ నుంచి వస్తుండగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
రన్యారావు శరీరంపై గాయాలు
-
రన్యారావు కేసు కీలక మలుపు.. ఆమె శరీరంపై గాయాలు
బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యారావు(34) కేసు కీలక మలుపు తిరిగింది. తాజాగా ఆమెపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఇక నుంచి ఆమె సీబీఐ బోనులోకి వెళ్లాల్సిందే. వారు అడిగే ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. మరో రెండు రోజుల్లో ఆమెను సీబీఐ అధికారులు విచారించనున్నారు. రన్యారావును పోలీసులు విచారిస్తున్న క్రమంలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం బంగారం అక్రమ రవాణా మాత్రమే కాకుండా సంఘవిద్రోహ శక్తులతో కూడా ఆమెకు సంబంధాలు ఉన్నట్లు వారు కనుగొన్నారు. సౌదీ అరేబియాతో పాటు అమెరికా, పశ్చిమాసియా, ఐరోపా దేశాలలో కూడా రన్యారావు ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. ఈ కారణంతోనే సీబీఐ రంగంలోకి దిగింది.రన్యారావు నుంచి ఇప్పటికే 14 కిలోల బంగారు బిస్కెట్లు, రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు, సుమారు రూ.3 కోట్ల నగదును డీఆర్ఐ అధికారులు జప్తు చేశారు. ఆమె వద్ద మొత్తం రూ. 18 కోట్ల ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. ఆమెకు సంబంధించిన ఫోన్స్‌తో పాటు ల్యాప్‌టాప్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ప్రస్తుతం ఆమె డీఆర్ఐ అధికారుల విచారణలో ఉంది. త్వరలో సీబీఐ అధికారులు కూడా ఆమెను ప్రశ్నించనున్నారు. వారు ఇప్పటికే పలు ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు.రన్యారావును విచారించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంచలన విషయాలను తెలిపింది. ఆమె శరీరంపై పలుచోట్ల గాయాలున్నాయని తెలిపింది. అయితే, దుబాయ్‌కి వెళ్లక ముందే తనకు ఈ గాయాలు అయినట్లు ఆమె తెలియజేసిందని అధికారులు చెప్పారు. దీంతో ఆమెకు అవసరం అయితే వైద్య సాయం అందించాలని జైలు అధికారులను కోర్టు సూచించింది. రన్యారావు విచారణలో భాగంగా తమకు సహకరించడం లేదని డీఆర్ఐ అధికారులు కోర్టుకు తెలిపారు. -
నటి రన్యా రావ్ స్మగ్లింగ్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
-
రన్యారావు వద్ద కోట్లలో డబ్బు.. ఆశ్చర్యపోయిన అధికారులు
బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యారావ్ కేసులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దుబాయ్ నుంచి బంగారు బిస్కెట్లను అక్రమంగా తీసుకువస్తూ బెంగళూరులో ఆమె దొరికిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఆమెను మూడురోజుల పాటు విచారించాలని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)కు కోర్టు అనుమతి ఇచ్చింది.కిలో బంగారం రవాణాకు రన్యారావ్‌కు రూ.5 లక్షల కమీషన్ అందిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆమె నుంచి ఇప్పటికే 14 కిలోల బంగారు బిస్కెట్లు, రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు, సుమారు రూ.3 కోట్ల నగదును డీఆర్ఐ అధికారులు జప్తు చేశారు. ఆమె వద్ద మొత్తం రూ. 18 కోట్ల ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. సినిమా అవకాశాలు లేని ఒక నటి వద్ద ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఉండటం చూసి అధికారులే ఆశ్చర్యపోతున్నారు. తన వద్ద ఉన్న డబ్బుకు సరైన ఆధారాలను ఆమె చూపించలేకపోయింది.ఆమె గత ఆరు నెలల్లో 27 సార్లు దుబాయ్‌కు వెళ్లి వచ్చినట్లు అధికారులు తెలిపారు. సౌదీ అరేబియాతో పాటు అమెరికా, పశ్చిమాసియా, ఐరోపా దేశాలలో కూడా రన్యారావు ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. కేవలం బంగారం అక్రమ రవాణా మాత్రమే కాకుండా సంఘవిద్రోహ శక్తులతో కూడా ఆమెకు సంబంధాలు ఉన్నట్లు వారు కనుగొన్నారు. ఈ క్రమంలో రన్యారావు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. విచారణ క్రమంలోనే దానిని కోర్టు తోసిపుచ్చింది. -
రన్యారావుకు ఏమైంది.. వైరల్ గా మారిన ఫోటో..!
న్యూఢిల్లీ: బంగారం స్మగ్మింగ్ కేసులో భాగంగా ప్రస్తుతం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) కస్టడీలో ఉన్న కన్నడ నటి రన్యారావుకు చెందిన తాజా ఫోటో వైరల్ గా మారింది. ఆమె కంటి కింద గాయాలు, ఉబికిన మొహంతో ఆమె ఫోటోలో ఉంది. ఆమెను కస్టడీలో తీసుకుని విచారణ పేరుతో చిత్ర హింసలు పెట్టారా? అనే అనుమానం కలుగుతోంది. దీనిపై కర్ణాకట మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానంగా వైరల్ గా మారిన ఫోటోను ఉటంకిస్తూ మహిళా కమిషన్ చైర్మన్ నాగలక్ష్మీ చౌదరి అనుమానం వ్యక్తం చేశారు. ఆమెపై అధికారులు దాడికి పాల్పడ్డారా? అనే ప్రశ్న లేవనెత్తారు. అయితే దీనిపై తాము నేరుగా దర్యాప్తు చేసే అవకాశం లేదన్నారు. రన్యారావు తముకు ఏమైనా ఫిర్యాదు చేస్తే ఆమెకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు నాగలక్ష్మి,‘ మాకు ఆమె లేఖ రూపంలో ఫిర్యాదు చేస్తే మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆమె నుంచి ఫిర్యాదు అందిన పక్షంలో తమ పరిధిలో ఉన్న ఆయా విభాగాలను అప్రమత్తం చేస్తాం. సరైన రీతిలో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆమె ఏమైనా దాడికి గురయ్యిందా అనేది ఆమె ఫిర్యాదు రూపంలో ఇస్తేనే మేము ఏమైనా చేయగలం. ఒకవేళ ఆమె మమ్మల్ని సంప్రదించకపోతే దీనిపై కనీసం కామెంట్ కూడా చేయలేం’ అని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నాగలక్ష్మి పేర్కొన్నారు.కాగా, విదేశాల నుంచి బంగారు కడ్డీలను తరలిస్తూ పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావు.. తాను అమాయకరాలునని అంటోంది. తాను ట్రాప్ లో పడ్డానని, కావాలని ఇలా అక్రమంగా బంగారు కడ్డీలను తరలించలేదని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్((DRI)అధికారుల ముందు బోరుమంది.తాను నేరం చేసినట్లు ఒప్పుకుంటూనే, ఇది తాను కావాల్సి చేసిన పని కాదని అధికారుల ముందు చెప్పినట్లు తెలుస్తోంది. డీఆర్ఐ అధికారుల తాజా విచారణలో తాను దుబాయ్ తో పాటు, యూరప్, అమెరికా, మిగతా మిడిల్ ఈస్ట్ దేశాలను తిరిగి వచ్చినట్లు పేర్కొంది.ప్రస్తుతం డీఆర్ఐ విచారణ ఎదుర్కొంటున్న క్రమంలో రన్యారావుకు చెందిన ఎలక్ట్రానిక్స్ పరికరాలను అధికారాలు ముందుగా సీజ్ చేశారు. మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ తదితర వస్తువుల్ని డీఆర్ఐ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆమెకు ఎవరితో లింకులు ఉన్నాయనే కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారు. 2024 నుంచి ఆమె జరిపిన ఫైనాన్షియల్ వ్యవహారాలపై కూడా ఆరా తీస్తున్నారు. అసలు ఈ రాకెట్ వెనుక మాస్టర్ మైండ్స్ ఎవరు అనే కోణంలో ప్రధానంగా దర్యాప్తు సాగుతోంది.కాగా, గత సోమవారం 12 కేజీలకు పైగా బంగారం కడ్డీలను తన బెల్ట్ లో పెట్టుకుని దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తూ రన్యారావు పట్టుబడిన సంగతి తెలిసిందే. బెంగూళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె అధికారులకు చిక్కింది. ప్రస్తుతం ఆమె మూడు రోజుల డీఆర్ఐ అధికారుల కస్టడీలో ఉంది. దీనిలో భాగంగా ఆమెను విచారిస్తున్న అధికారులు ఇందులో ‘కింగ్ పిన్’ ఎవరు అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.రన్యారావు కేసు.. వెలుగులోకి కొత్త విషయాలు -
నాకేమీ తెలీదు.. ట్రాప్‌లో పడ్డాను: బోరుమన్న రన్యారావు
బెంగళూరు: విదేశాల నుంచి బంగారు కడ్డీలను తరలిస్తూ పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావు.. తాను అమాయకరాలునని అంటోంది. తాను ట్రాప్ లో పడ్డానని, కావాలని ఇలా అక్రమంగా బంగారు కడ్డీలను తరలించలేదని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్((DRI)అధికారుల ముందు బోరుమంది.తాను నేరం చేసినట్లు ఒప్పుకుంటూనే, ఇది తాను కావాల్సి చేసిన పని కాదని అధికారుల ముందు చెప్పినట్లు తెలుస్తోంది. డీఆర్ఐ అధికారుల తాజా విచారణలో తాను దుబాయ్ తో పాటు, యూరప్, అమెరికా, మిగతా మిడిల్ ఈస్ట్ దేశాలను తిరిగి వచ్చినట్లు పేర్కొంది.గతేడాది కూడా ఇదే తరహాలో,..ప్రస్తుత రన్యారావు కేసుకు, గతేడాది చెన్నైలో జరిగిన బంగారం స్మగ్మింగ్ కేసుకు పోలికలు ఉండటంతో ఆ కోణంలో విచారణ ఆరంభించారు అధికారులు. గత సంవత్సరం సాఫ్ట్ వేర్ ఉద్యోగి భార్య 12 కేజీల బంగారాన్ని దుబాయ్ నుంచి తరలిస్తూ అధికారులకు పట్టుబడింది. అయితే తాను ఒక ఫ్రెండ్ వలలో చిక్కుకునే బంగారం స్మగ్మింగ్ చేసినట్లు ఆమె వెల్లడించింది. ఇప్పుడు ఈ కేసును కూడా అదే కోణంలో పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇందులో ఎవరు పాత్ర ఉందనే దానిపై ఆరా తీస్తున్నారు. తాను ట్రాప్ లో చిక్కుకునే ఈ కథ నడిపినట్లు ఆమె పేర్కొనడంతో దీని వెనుక ఎవరున్నారు అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.ఆమె ఎలక్ట్రానిక్ పరికరాలు సీజ్..ప్రస్తుతం డీఆర్ఐ విచారణ ఎదుర్కొంటున్న క్రమంలో రన్యారావుకు చెందిన ఎలక్ట్రానిక్స్ పరికరాలను అధికారాలు ముందుగా సీజ్ చేశారు. మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ తదితర వస్తువుల్ని డీఆర్ఐ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆమెకు ఎవరితో లింకులు ఉన్నాయనే కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారు. 2024 నుంచి ఆమె జరిపిన ఫైనాన్షియల్ వ్యవహారాలపై కూడా ఆరా తీస్తున్నారు. అసలు ఈ రాకెట్ వెనుక మాస్టర్ మైండ్స్ ఎవరు అనే కోణంలో ప్రధానంగా దర్యాప్తు సాగుతోంది.కాగా, గత సోమవారం 12 కేజీలకు పైగా బంగారం కడ్డీలను తన బెల్ట్ లో పెట్టుకుని దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తూ రన్యారావు పట్టుబడిన సంగతి తెలిసిందే. బెంగూళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె అధికారులకు చిక్కింది. ప్రస్తుతం ఆమె మూడు రోజుల డీఆర్ఐ అధికారుల కస్టడీలో ఉంది. దీనిలో భాగంగా ఆమెను విచారిస్తున్న అధికారులు ఇందులో ‘కింగ్ పిన్’ ఎవరు అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. -
నటి రన్యా రావు కేసు.. తండ్రి కూడా 'తేడా'నే!
విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డిన కన్నడ నటి రన్యా రావు (Kannada Actor Ranya Rao) కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చాన్నాళ్లుగా ఆమె ఈ దందా సాగిస్తున్నట్టుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బంగారం అక్రమ రవాణాలో ఆమె కేవలం పాత్రధారి మాత్రమేనని సూత్రధారులు వేరే ఉన్నారని అనుమానిస్తున్నారు. రాజకీయ నేతల హస్తం కూడా ఉండొచ్చన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో ఎవరు ఉన్నా వదిలిపెట్టబోమని కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది. పోలీసుల దర్యాప్తులో ఎవరి పేర్లు వెలుగులోకి వస్తాయోనని అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.సవతి తండ్రిపైనా ఆరోపణలు రన్యా రావు అరెస్ట్ ఘటనలో తనకేం సంబంధం లేదని స్పష్టంచేసిన ఆమె సవతి తండ్రి కె.రామచంద్రరావు పైనా గతంలో ఆరోపణలున్నట్లు తాజాగా మీడియాలో వార్తలొచ్చాయి. ఐపీఎస్ అధికారి (IPS Officer) అయిన రామచంద్రరావు ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్)గా సేవలందిస్తున్నారు. 2014లో మైసూరు సదరన్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పదవిలో ఉన్నప్పుడు హవాలా కేసులో ఈయన పాత్ర ఉందని ఆనాడు ఆరోపణలు వచ్చాయి.మైసూరులోని యెల్వాల్ నుంచి కేరళకు వెళ్తున్న బస్సును అడ్డగించిన పోలీసులు అందులోంచి రూ.20 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. అయితే వాస్తవానికి ఆ బస్సు నుంచి రూ.2.07 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని రూ.20లక్షలు మినహా మిగతా కరెన్సీ పంచుకున్నారని ఒక వ్యాపారి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఉదంతంపై కేసు నమోదైంది. బస్సు వెళ్తున్న మార్గం వివరాలను వెల్లడించిన పోలీస్ ఇన్‌ఫార్మర్లతోపాటు రామచంద్రరావు వ్యక్తిగత గన్‌మెన్‌ను అరెస్ట్‌చేశారు. దీంతో రామచంద్రరావును ఈ పోస్ట్ నుంచి తప్పించి హెడ్‌క్వార్టర్స్‌కు ట్రాన్స్ఫర్చేశారు.తర్వాత రెండేళ్లకు మరో కేసులోనూ రామచంద్రరావు పేరు ప్రముఖంగా వినిపించింది. గ్యాంగ్స్టర్లు ధర్మరాజ్, గంగాధర్‌ల నకిలీ ఎన్కౌంటర్ కేసు (Fake Encounter Case)లో రామంచంద్రరావును సీఐడీ అధికారులు ప్రశ్నించారు.చదవండి: రన్యా రావు నాలుగు నెలలుగా ఇంటికి రాలేదు రన్యా రావుకు 3 రోజుల కస్టడీకర్ణాటకలోని బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం రాత్రి రూ.12.56 కోట్ల విలువైన బంగారు కడ్డీలు తెస్తూ రన్యా రావు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆమెను మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) చేసిన విజ్ఞప్తిని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు శుక్రవారం అనుమతించింది. -
రన్యారావ్ పాత్రధారి మాత్రమే
బనశంకరి: బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యారావ్ కేసు కీలక మలుపు తిరిగింది. కిలో బంగారం రవాణాకు రన్యారావ్‌కు రూ.5 లక్షల కమీషన్ అందిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నటి పాత్రధారి కాగా అసలైన సూత్రధారి వేరే వ్యక్తి అని తెలిసింది. నటి రన్యారావ్‌ను డీఆర్ఏ అధికారులు తీవ్ర విచారణ చేపట్టగా నేను పాత్రధారి మాత్రమే అని, అసలు వ్యక్తి వేరేవారని తెలిపింది. రూ.17 కోట్లు విలువ చేసే బంగారం కొనుగోలు చేసే శ్రీమంతురాలు కాదు. ఈమె సీనియర్ పోలీస్ అధికారి పెంపుడు కూతురు కావడంతో ఆమెను ఈ దందాకు వాడుకుంటే చాలా సులభంగా బంగారం రవాణా చేయవచ్చనే అంచనాతో నటి రన్యారావ్‌ను బంగారం రవాణాకు వాడుకున్నారు. అక్రమ బంగారం రవాణాలో విమానాశ్రయంలోని కొందరు అధికారులు కూడా కుమ్మక్కైనట్లు అనుమానం వ్యక్తమైంది.డీఆర్ఐ అధికారులు ఈ కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. బంగారం రవాణాలో రన్యారావ్‌కు రూ.4 లక్ష లనుంచి రూ.5 లక్షలు కమీషన్ ఇస్తున్నట్లు తెలిసింది. రన్యారావ్ బెంగళూరుకు తీసుకువచ్చిన బంగారం ఎవరికి ఇస్తుంది అనేదానిపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. గత రెండేళ్లుగా రన్యారావ్ వాడుతున్న బ్యాంక్ అకౌంట్ మొబైల్‌ను అదికారులు స్వా«దీనం చేసుకున్నారు. డీఆర్ఐ అధికారులు అసలు సూత్రధారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. వీడియో: కర్ణాటకలో దారుణం.. పెళ్లి పేరుతో మైనర్‌ను బలవంతంగా లాక్కెళ్లి.. -
ఎవరీ రన్యా రావు..? ఒక హీరోయిన్ స్మగ్లింగ్ ఎందుకు స్టార్ట్ చేసింది..?
-
బంగారంతో పట్టుబడ్డ కన్నడ హీరోయిన్
-
దుబాయ్ ట్రిప్.. 'రన్యా రావ్'కు ఎంత కమీషన్ ఇచ్చేవారంటే..
బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యా రావ్ కేసు కీలక మలుపు తిరిగింది. కిలో బంగారం రవాణాకు రన్యారావ్‌కు రూ.5 లక్షల కమీషన్ అందిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నటి పాత్రధారి కాగా అసలైన సూత్రధారి వేరే వ్యక్తి అని తెలిసింది. నటి రన్యారావ్‌ను డీఆర్ఏ అధికారులు తీవ్ర విచారణ చేపట్టగా నేను పాత్రధారి మాత్రమే అని, అసలు వ్యక్తి వేరేవారని తెలిపింది. రూ.17 కోట్లు విలువ చేసే బంగారం కొనుగోలు చేసే శ్రీమంతురాలు కాదు. ఈమె సీనియర్ పోలీస్ అధికారి పెంపుడు కూతురు కావడంతో ఆమెను ఈ దందాకు వాడుకుంటే చాలా సులభంగా బంగారం రవాణా చేయవచ్చనే అంచనాతో నటి రన్యారావ్‌ను బంగారం రవాణాకు వాడుకున్నారు. అక్రమ బంగారం రవాణాలో విమానాశ్రయంలోని కొందరు అధికారులు కూడా కుమ్మకైనట్లు అనుమానం వ్యక్తమైంది. డీఆర్ఐ అధికారులు ఈ కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. కిలో బంగారం రవాణా కోసం రన్యారావ్‌కు రూ.5 లక్షలు కమీషన్ ఇస్తున్నట్లు తెలిసింది. కమీషన్‌తో పాటు రాకపోకలు, బస, ఇతర ఖర్చులకు మొత్తంగా రూ.12 లక్షలు వసూలు చేసేదని విచారణలో తేలింది. ఒక్క ట్రిప్‌లో ఆమె సుమారు పది కేజీలకు పైగానే బంగారం అక్రమ రవాణా చేసేదని పోలీసులు గుర్తించారు. రన్యారావ్ బెంగళూరుకు తీసుకువచ్చిన బంగారం ఎవరికి ఇస్తుంది అనేదానిపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. గత రెండేళ్లుగా రన్యారావ్ వాడుతున్న బ్యాంక్ అకౌంట్ మొబైల్‌ను అదికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఆర్ఐ అధికారులు అసలు సూత్రధారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.అయితే, ఈ అక్రమ బంగారం రవాణా స్టోరీలో ఆమెకు ఓ రాజకీయ నాయకుడి సహకారమూ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రన్యా రావుకు పరిచయం ఉన్న నాయకులతో పాటు ఇతర అధికారుల పేర్లు విచారణలో తెలుస్తాయని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య న్యాయ సలహాదారు, ఎమ్మెల్యే ఏఎస్ పొన్నణ్ణ పేర్కొన్నారు. కొందరు స్మగ్లర్లతో ఆమెకు సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఆమె సుమారు 30 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లు సమాచారం.అధికారితో గొడవ వల్లే దొరికిపోయిందికొద్దిరోజుల క్రితం రన్యా రావు దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన సమయంలో విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారితో ఆమె గొడవకు దిగింది. తన బంధువు పేరును వాడుకున్న ఆమె తన దర్పాన్ని ఆ అధికారి వద్ద ప్రదర్శించింది. ఈ గొడవే ఆమెకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఆ ఘటన వల్ల రన్యా రావు రాకపోకల వివరాలను ఆ అధికారి పరిశీలించారు. ఈ క్రమంలో గతంలో ఆమె ఎక్కడెక్కడకు ప్రయాణం చేశారో చెక్ చేశారు. అయితే, ఆమె తరచూ దుబాయ్‌కు వెళ్లి వస్తుండటమే కాకుండా.. వెళ్లిన ప్రతిసారీ ఒకే రకమైన దుస్తులు ధరించి కనిపిస్తుండటంతో ఆయన అనుమానించారు.ఈసారి ఆమె దుబాయ్ నుంచి మళ్లీ వచ్చినప్పుడు సోదాలు చేయాలని పక్కా ప్రణాళికతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె బంగారం బిస్కెట్లతో దొరికిపోయింది. -
గోల్డ్ కేసులో ట్విస్ట్.. నటి రన్యారావు వెనక ఓ రాజకీయ నేత!?
కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రన్యారావు బంగారం స్మగ్లింగ్ వెనక ఓ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అందుకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య న్యాయసలహాదారు ఐఎస్ పొన్నన్ చేసిన వ్యాఖ్యలు అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన రన్యారావు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు (DRI) ఆమె ఇంట్లో జరిపిన సోదాల్లో భారీ ఎత్తున బంగారాన్ని గుర్తించారు. ఈ బంగారం ఎవరిది? అని ఆరా తీయగా.. ఆ గోల్డ్‌ను సదరు నేత కొనుగోలు చేసినట్లు పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. రన్యారావుతో ఆ రాజకీయ నాయకుడే స్మగ్లింగ్ చేయించినట్లు డీఆర్ఐ అధికారులు అనుమానిస్తున్నారు. రాజకీయ నాయకుడు,రన్యారావుల మధ్య ఒప్పందం జరిగింది. గోల్డ్‌ను దుబాయ్ నుంచి భారత్‌కు తీసుకు వస్తే కిలోలక్ష ఇస్తానని హామీ ఇచ్చారు. ఒప్పందం ప్రకారం.. స్మగ్లింగ్ కోసం నటి ఒక్క ఏడాదిలో దాబాయ్కు ౩౦ సార్లు వెళ్లింది. ట్రిప్‌కు 12 నుంచి 14 లక్షలు సంపాదించిన ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం డీఆర్ఐ అధికారులు బంగారం కొనుగోళ్ల సంబంధించిన రసీదులను సేకరించే పనిలో పడ్డారు.మరోవైపు రన్యారావు బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో రాజకీయనాయడి హస్తం ఉందనే ఆరోపణలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య న్యాయసలహాదారు ఐఎస్ పొన్నన్ స్పందించారు.నటికి ఉన్న రాజకీయ పరిచయాలతో సంబంధం లేకుండా చట్టం తన పని తాను చేస్తుందని అన్నారు. ఈ కేసులో ఎవరి జోక్యం ఉన్నా దర్యాప్తులో భయటపడుతుందని చెప్పారు. -
బంగారం అక్రమ రవాణా చేసిన హీరోయిన్.. తండ్రి డీజీపీ.. మరి భర్త?!
కన్నడ హీరోయిన్ రన్యారావు (Ranya Rao) బంగారం అక్రమరవాణా కేసులో కటకటాలపాలైంది. 15 రోజుల్లో నాలుగుసార్లు దుబాయ్‌కు వెళ్లడం, అదికూడా ప్రతిసారి సేమ్ డ్రెస్ ధరించడంతో అధికారులకు అనుమానమొచ్చింది. సోమవారం (మార్చి 3న) ఆమెను బెంగళూరు ఎయిర్‌పోర్టులో తనిఖీ చేయగా 14 కిలోలకు పైగా బంగారంతో అడ్డంగా దొరికిపోయింది. దీంతో ఆమెను అరెస్టు చేసిన అధికారులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఆమె భర్తను సైతం విచారిస్తున్నారు. ఇకపోతే రన్యా రావుకు కర్ణాటక డీజీపీ డాక్టర్ కె.రామచంద్రారావు సవతి తండ్రి అవుతాడు.పెళ్లయ్యాక మళ్లీ కలిసిందే లేదన్న డీజీపీఇప్పటికే ఈ విషయంపై డీజీపీ స్పందిస్తూ రన్యాకు నాలుగు నెలలకిందటే పెళ్లి జరిగిందని, అప్పటినుంచి తనను కలవలేదని పేర్కొన్నారు. కూతురు, అల్లుడు చేసే పనుల గురించి తనకెటువంటి విషయాలు తెలియదన్నాడు. ఈ క్రమంలో రన్యా భర్త ఎవరన్న వివరాలు బయటకు వచ్చాయి. రన్యా భర్త పేరు జతిన్ హుక్కేరి. ఈయన ఆర్కిటెక్ట్. బెంగళూరులో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పట్టా పొందాడు. తర్వాత లండన్‌లో డిస్రప్టివ్ మార్కెట్ ఇన్నొవేషన్ కోర్సు చదివాడు. తండ్రి డీజీపీ, భర్త ఆర్కిటెక్ట్మొదట్లో బెంగళూరులోని పలు రెస్టారెంట్లకు డిజైనర్‌గా పని చేశాడు. లండన్‌లోనూ ఆర్కిటెక్ట్‌గా సేవలందించాడు. WDA & DECODE LLC సంస్థను స్థాపించడంతోపాటు దానికి క్రియేటివ్ డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నాడు. క్రాఫ్ట్ కోడ్ కంపెనీకి ఫౌండర్ కూడా ఇతడే! రన్యారావును పెళ్లి చేసుకున్నాక తనతో కలిసి పలుమార్లు దుబాయ్ ట్రిప్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఎయిర్‌పోర్టులో బంగారం స్మగ్లింగ్ చేస్తూ రన్యా దొరికిపోగా.. ఆమె ఇంటిని సైతం తనిఖీ చేశారు. ఈ సోదాలో రూ.2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67 కోట్ల నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.సినిమారన్యా రావు.. కిశోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో నటనపై శిక్షణ తీసుకుంది. మాణిక్య అనే కన్నడ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఇది ప్రభాస్ మిర్చి మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. పటాస్ కన్నడ రీమేక్ పటాకిలో హీరోయిన్గా నటించింది. తమిళంలో వాఘా మూవీ చేసింది. ఎనిమిదేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది.చదవండి: ఓటీటీలో శర్వానంద్ 'మనమే'.. అఫీషియల్ ప్రకటన -
బంగారం అక్రమరవాణా.. నా కూతురిలా చేస్తుందనుకోలేదు: డీజీపీ
బంగారం అక్రమరవాణాతో అప్రతిష్ట మూటగట్టుకుంది కన్నడ హీరోయిన్ రన్యారావు (Ranya Rao). 14 కిలోలకు పైగా బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఆమెను బెంగళూరు విమానాశ్రయంలో సోమవారం అరెస్ట్ చేశారు. ఆమె డీజీపీ కూతురినని చెప్పడంతో పోలీసులు సైతం షాక్ అయ్యారు. అయితే రన్యా రావుకు కర్ణాటక డీజీపీ డాక్టర్ కె రామచంద్రారావు సొంత తండ్రి కాదు, సవతి తండ్రి అవుతాడు!మాకేదీ తెలియదుతాజాగా ఈ ఘటనపై డీజీపీ కె రామచంద్రరావు స్పందించారు. నాలుగు నెలల క్రితమే రన్యా పెళ్లి జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు తను మమ్మల్ని కలవనేలేదు. తన గురించి కానీ, తన భర్త చేసే బిజినెస్ గురించి మాకేమీ తెలీదు. జరిగిన విషయం తెలిసి మేమంతా షాకయ్యాం.. అలాగే నిరాశచెందాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నారు. ప్రస్తుతం రన్యాను మార్చి 18 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచనున్నారు.ఎవరీ రన్యా?రన్యా.. కర్ణాటకలోని చిక్కమంగళూరులో జన్మించింది. కిశోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో నటనలో మెళకువలు తెలుసుకుంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది. డ్యాన్స్‌లోనూ శిక్షణ తీసుకుంది. ఈమెను దర్శకుడు, హీరో సుదీప్ వెండితెరకు పరిచయం చేశాడు. ఆయన డైరెక్ట్ చేసిన మాణిక్య చిత్రంలో సహాయ నటిగా యాక్ట్ చేసింది. ఇది ప్రభాస్ మిర్చి మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో హీరో దర్శన్‌తో కలిసి పని చేయాలనుందని తెలిపింది. తాను మంచి భోజన ప్రియురాలు అని, షాపింగ్ చేయడం అంటే ఇష్టమని పేర్కొంది. పటాస్ కన్నడ రీమేక్ పటాకిలో హీరోయిన్గా నటించింది. తమిళంలో వాఘా మూవీ చేసింది. ఎనిమిదేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది.చదవండి: ఇంకా ఎందుకు బతికున్నావ్.. ఎలుకల మందు తిను అన్నారు: నటుడు