12 కోట్ల విలువైన బంగారం.. నటికి రూ.89 కోట్ల జరిమానా | Ranya Rao Gold Smuggling Case, Actress Hit With ₹89 Crore Fine, Four Accused Face ₹244 Crore Penalty | Sakshi
Sakshi News home page

బంగారం ఖరీదు రూ.12 కోట్లు.. నటికి జరిమానా రూ.89 కోట్లు..!

Oct 1 2026 2:10 PM | Updated on Oct 1 2026 2:34 PM

Kannada Actor Ranya Rao Fined 89 crore In Gold Smuggling Case

కన్నడ నటి రన్యా రావుకు భారీ షాక్‌ తగిలింది. బంగారం అక్రమ రవాణా కేసులో ఆమెకు కస్టమ్స్‌ శాఖ రూ.89 కోట్ల జరిమానా విధించింది. ఈ కేసులో రన్యాతో పాటు మరో ముగ్గురికి కలిపి రూ.244 కోట్లకు పైగా జరిమానా పడింది. 399 పేజీల తీర్పు ఉత్తర్వుల్లో కస్టమ్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సందీప్‌ ఈ జరిమానాలను విధించారు.

ఈ కేసులో తరుణ్‌ కొండూరు రాజుకు రూ.49.51 కోట్లు, సాహిల్‌ జైన్‌, భరత్‌ కుమార్‌ జైన్‌లకు చెరో రూ.53.06 కోట్ల చొప్పున జరిమానా విధించారు. దుబాయ్‌ నుంచి భారత్‌కు బంగారం అక్రమంగా తరలించిన వ్యవహారంలో వీరి పాత్రపై దర్యాప్తు అనంతరం కస్టమ్స్‌ శాఖ ఈ చర్యలు తీసుకుంది.

అసలు ఏం జరిగిందంటే..
2025 మార్చి 3న దుబాయ్‌ నుంచి బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన రన్యా రావును డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 14.213 కిలోల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.12.56 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత రన్యా రావు నివాసంలోనూ తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో లెక్కల్లో చూపని రూ.2.67 కోట్ల నగదు, రూ.2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తెలిపింది.
ఇదీ చదవండి: రాజమౌళికే ఝల‌క్‌.. భార్య రమా రాజమౌళి వీడియో వైరల్‌

2024 మార్చి 7 నుంచి 2025 ఫిబ్రవరి 18 మధ్య జరిగినట్లు ఆరోపిస్తున్న బంగారం అక్రమ రవాణాపై దర్యాప్తు కొనసాగింది. ఈ కాలంలో రన్యా రావు, ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తులు కలిసి దుబాయ్‌ నుంచి భారత్‌కు సుమారు 113 కిలోల బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ఈ వ్యవహారంలో రన్యా రావుతో పాటు తరుణ్‌ కొండూరు రాజు, సాహిల్‌ జైన్‌, భరత్‌ కుమార్‌ జైన్‌ల పాత్రపై కస్టమ్స్‌ శాఖ విచారణ జరిపింది. గతంలోనూ ఈ కేసుకు సంబంధించి డీఆర్‌ఐ చర్యలు చేపట్టింది. 2025 సెప్టెంబరులో రన్యా రావుతో పాటు ఇతరులకు డీఆర్‌ఐ నోటీసులు జారీ చేసి.. రన్యా నుంచి రూ.102 కోట్ల జరిమానా కోరింది.

2025 మార్చి 3న అరెస్టు
ఇక రన్యా రావును 2025 మార్చి 3న అరెస్టు చేశారు. కస్టమ్స్‌ కేసులో ఆమెకు అనంతరం చట్టబద్ధమైన బెయిల్‌ లభించింది. అయితే అక్రమ రవాణా నిరోధక చట్టం (కోఫెపోసా) కింద కేంద్ర ప్రభుత్వం ఆమెను ముందస్తు నిర్బంధంలో ఉంచింది. ఈ నిర్బంధ ఉత్తర్వులను 2026 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు సమర్థించింది. ఏడాది నిర్బంధ కాలం పూర్తవడంతో ఏప్రిల్‌ 22న బెంగళూరు సెంట్రల్‌ జైలు నుంచి రన్యా రావు బయటకు వచ్చారు.
 ఇదీ చదవండి: థియేటర్లలో సినిమాల సందడి.. అక్టోబర్‌లో వస్తున్న చిత్రాలివే..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement