రాజమౌళికే జలాక్‌.. భార్య రమా రాజమౌళి వీడియో వైరల్‌ | Rama Rajamouli Was Pushing SS Rajamouli At Dont Trouble The Trouble Event | Sakshi
Sakshi News home page

రాజమౌళికే జలాక్‌.. భార్య రమా రాజమౌళి వీడియో వైరల్‌

Oct 1 2026 9:20 AM | Updated on Oct 1 2026 9:58 AM

Rama Rajamouli Was Pushing  SS Rajamouli At Dont Trouble The Trouble Event

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళికి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి చిత్రాలతో తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ఆయన.. అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సెట్స్‌లో ఎంతో గంభీరంగా కనిపించే రాజమౌళి.. ఇంట్లో మాత్రం అందరిలాగే సాధారణ భర్తేనని చెప్పే ఓ సరదా సన్నివేశం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

 సినిమా ప్రీ-రిలీజ్‌ వేడుకలో..
రాజమౌళి కుమారుడు ఎస్‌.ఎస్‌. కార్తికేయ నిర్మించిన చిత్రం ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’. ఈ సినిమా ప్రీ-రిలీజ్‌ వేడుకను ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి, కీరవాణి కుటుంబసభ్యులతో పాటు జూనియర్‌ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ వేడుకలో రాజమౌళిని వేదికపైకి ఆహ్వానించిన సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రాజమౌళి వెనుకే నిల్చున్న ఆయన భార్య రమా రాజమౌళి.. చేతితో ‘త్వరగా నడవండి’ అన్నట్లుగా సరదాగా ముందుకు నెట్టారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఈ వీడియో చూసిన అభిమానులు, నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. బయట ప్రపంచానికి ఎంత పెద్ద దర్శకుడైనా.. ఇంట్లో మాత్రం భార్య మాట వినాల్సిందే అంటూ సరదాగా స్పందిస్తున్నారు. ‘సినిమా సెట్స్‌లో రాజమౌళి బాస్‌ కావచ్చు.. కానీ ఇంట్లో రమా గారే రియల్‌ బాస్‌’ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ విషయానికొస్తే..
ఇక ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ విషయానికొస్తే.. శశాంక్‌ యేలేటి దర్శకత్వంలో ఫాహద్‌ ఫాజిల్‌ హీరోగా, బేబి సారా, సౌరభ్‌ సచ్‌దేవ్‌ ఇతర పాత్రలుపోషించిన చిత్రం ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’. ఎస్‌ఎస్‌ రాజమౌళి సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్‌ బిజినెస్‌ బ్యానర్స్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని, ఎస్‌.ఎస్‌.కార్తికేయ నిర్మించిన ఈ  సినిమాని అక్టోబరు 2న రిలీజ్‌ అవుతోంది. 
ఇదీ చదవండి: ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’పై ఎన్టీఆర్‌, మహేశ్‌ల మూవీ రివ్యూ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement