‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’పై ఎన్టీఆర్‌, మహేశ్‌ల మూవీ రివ్యూ | Mahesh Babu NTR About Review For Dont Trouble Trouble Movie | Sakshi
Sakshi News home page

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’పై స్టార్‌ హీరోల రివ్యూ

Oct 1 2026 7:37 AM | Updated on Oct 1 2026 8:46 AM

Mahesh Babu NTR About Review For Dont Trouble Trouble Movie

ఫహాద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రంపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు వీక్షించి తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటున్నారు. తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌, మహేశ్‌బాబు సినిమాపై ప్రశంసలు కురిపించారు.

ఎన్టీఆర్ ఏమన్నారంటే..
‘‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా ప్రతి చిన్నారికి, ప్రతి తల్లిదండ్రికి.. తమలోని చిన్నారిని ఇంకా మోస్తున్న ప్రతి ఒక్కరికీ నచ్చే చిత్రం. ఫహాద్‌ ఫాజిల్‌ ‘సూరి’ పాత్రలో అద్భుతంగా నటించారు. ప్రతి సన్నివేశానికి ఆయన ప్రాణం పోశారు. దర్శకుడు శశాంక్‌ తెరకెక్కించిన తీరు అద్భుతం. పిల్లలు, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే స్వచ్ఛమైన భావోద్వేగాలను తెరపై చూపించడం అంత సులభం కాదు. తొలి చిత్రంతోనే శశాంక్‌ దాన్ని ఎంతో అందంగా ఆవిష్కరించారు. 

భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుతున్న ‘తమ్ముడు’’ అని ఎన్టీఆర్‌ అభినందించారు. చిన్నారి సారా నటన తన మనసును దోచుకుందని అన్నారు. ఎంతో సహజంగా నటించిందని, ప్రతి భావోద్వేగాన్ని అమాయకత్వంతో పలికించిందని పేర్కొన్నారు.  సినిమా పూర్తయిన తర్వాత కూడా ఆమె పాత్ర ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుందని చెప్పారు. సంగీత దర్శకుడు కాలభైరవ నేపథ్య సంగీతాన్ని కూడా ఎన్టీఆర్‌ ప్రత్యేకంగా ప్రశంసించారు.

మహేశ్‌బాబు ఏమన్నారంటే..
మరోవైపు మహేశ్‌బాబు కూడా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’పై ప్రశంసలు కురిపించారు. ‘ సినిమా ఎంతో అనుభూతిని అందించింది. చక్కగా రూపొందించిన, ఆనందాన్ని పంచే చిత్రమిది. లోతైన భావోద్వేగాలను కలిగించింది. ఫహాద్‌ ఫాజిల్‌ అద్భుతమైన నటుడు. ఆయన తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ, విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న తీరు స్ఫూర్తిదాయకం. ఫహాద్‌, చిన్నారి సారా కలిసి నటించిన సన్నివేశాలు ఎంతో ఆకట్టుకున్నాయి.

 దర్శకుడు కార్త్‌కు ఇది ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ సినిమా కోసం ఆయన పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. నిర్మాత శోభుతో కలిసి ఎంతో ప్రత్యేకమైన చిత్రాన్ని రూపొందించారని అభినందించారు.  చిత్రబృందం మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు.  కాగా ఇలా విడుదలకు ముందే ఎన్టీఆర్‌, మహేశ్‌బాబు వంటి అగ్ర కథానాయకులు ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ను ప్రశంసించడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

కాగా శశాంక్‌ యేలేటి దర్శకత్వంలో ఫాహద్‌ ఫాజిల్‌ హీరోగా, బేబి సారా, సౌరభ్‌ సచ్‌దేవ్‌ ఇతర పాత్రలుపోషించిన చిత్రం ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’. ఎస్‌ఎస్‌ రాజమౌళి సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్‌ బిజినెస్‌ బ్యానర్స్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని, ఎస్‌.ఎస్‌.కార్తికేయ నిర్మించిన ఈ  సినిమాని అక్టోబరు 2న రిలీజ్‌ అవుతోంది. 
ఇదీ చదవండి: ఓటీటీలో కాజల్ అగర్వాల్‌ కోర్ట్ థ్రిల్లర్‌.. తెలుగులోనూ స్ట్రీమింగ్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement