డోరతీ చూసినప్పుడు భయం వేసింది | Rana Daggubati Speech at Dorothy Telugu Trailer Launch | Sakshi
Sakshi News home page

డోరతీ చూసినప్పుడు భయం వేసింది

Oct 1 2026 4:21 AM | Updated on Oct 1 2026 4:21 AM

Rana Daggubati Speech at Dorothy Telugu Trailer Launch

– రానా దగ్గుబాటి

‘‘డోరతీ’ చిత్రం చూస్తున్నప్పుడు ఇంటర్వెల్‌కి వచ్చేసరికి ఒక్కసారిగా కథ మొత్తం మారిపోయింది. అసలు కార్తీక్‌ ఎలాంటి కథ తీసుకున్నాడు? అనిపించింది. మొదట భయం వేసింది. ఆ తర్వాత గర్వంగా అనిపించింది. రజనీకాంత్‌లాంటి సూపర్‌స్టార్‌తో సినిమా చేసిన కార్తీక్‌ ‘డోరతీ’ లాంటి కథతో సినిమా చేయడం సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది’’ అని రానా దగ్గుబాటి తెలిపారు. 

కీర్తీ సురేష్, సనంత్, రిషికాంత్‌ ప్రధాన పాత్రల్లో కార్తీక్‌ సుబ్బరాజ్‌ రచన, దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డోరతీ’. తమిళంలో ఘన విజయం అందుకున్న ఈ చిత్రాన్ని స్పిరిట్‌ మీడియా ద్వారా రానా దగ్గుబాటి ఈ శుక్రవారం తెలుగులో విడుదల చేస్తున్నారు. బుధవారం నిర్వహించిన ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో కార్తీక్‌ సుబ్బరాజ్‌ మాట్లాడుతూ– ‘‘డోరతీ’ నాకు ప్రత్యేకమైన సినిమా. ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్స్‌లో, తమిళనాడులో ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ఆడియన్స్‌ రెస్పాన్స్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement