కార్తీక్ (ఫైల్)
హైదరాబాద్: కారులో మంటలు చెలరేగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో భౌరంపేట్‌లోని రుద్ర సంస్థ సమీపంలో ఓ కారు మంటల్లో కాలిపోతోందని సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా అప్పటికే ఓ వ్యక్తి మంటల్లో కాలిపోయి ఉన్నాడు.
భౌరంపేట్‌లోని ప్రణీత్ ప్రణవ్ మిడోస్‌కు చెందిన కార్తీక్(40)గా పోలీసులు గుర్తించారు. లాండ్రీ బిజినెస్ చేసే అతను రెండున్నర సంవత్సరాలుగా భార్యకు దూరంగా ఉంటున్నాడని తెలిసింది. ఆరోగ్య సమస్యలకు తోడు ఆర్థిక సమస్యలు ఉండటంతో కారులో నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: పెళ్లైన ఆరు నెలలకే డాక్టర్ ఆత్మహత్య.. అసలేం జరిగింది?


