పెళ్లైన ఆరు నెలలకే డాక్టర్‌ ఆత్మహత్య.. అసలేం జరిగింది? | Hyderabad Ayurvedic Doctor Suicide Six Months After Marriage Police Probe | Sakshi
Sakshi News home page

పెళ్లైన ఆరు నెలలకే డాక్టర్‌ ఆత్మహత్య.. అసలేం జరిగింది?

Sep 8 2026 6:13 AM | Updated on Sep 8 2026 6:13 AM

Hyderabad Ayurvedic Doctor Suicide Six Months After Marriage Police Probe

డాక్టర్‌ కీర్తి (ఫైల్‌)

ఆయుర్వేదిక్‌ డాక్టర్‌ ఆత్మహత్య

ఆరు నెలల క్రితమే వివాహం.. అంతలోనే విషాదం

హైదరాబాద్‌: వివాహం జరిగిన ఆరు నెలల్లోనే ఓ ఆయుర్వేదిక్‌ డాక్టర్‌ ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుపతికి చెందిన కాక కీర్తి (28) క్యూర్‌ ఆర్థో ఆసుపత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తూ కుషాయిగూడ, వైష్ణవి ఎంక్లేవ్‌లో నివాసం ఉంటోంది. ఏడాది నుంచీ ఇక్కడే ఉంటున్న డాక్టర్‌ కీర్తి ఆరు నెలల క్రితం తిరుపతికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రాఘవను వివాహం చేసుకుంది.

పనిపై భర్త రాఘవ తిరుపతికి వెళ్లిన సమయంలో ఆమె ఇంట్లో వంటగదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆసుపత్రికి చెందిన మరో డాక్టర్‌ ఇంటి పైపోర్షన్‌లోనే కీర్తి అద్దెకు ఉంటోంది. సోమవారం విధులకు హాజరు కాకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది కీర్తి ఇంటి యజమానికి సమాచారమిచ్చారు. దీంతో వారు తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

కాగా కీర్తి మృతిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లైన 6 నెలలకే ఆమె ఇలా ఆత్మహత్యకు పాల్పడటంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వారం క్రితం తిరుపతికి వెళ్లిన భర్త ఎందుకు తిరిగిరాలేదు... భార్యతో గొడవపడి వెళ్లాడా లేక ఏదైనా పనిపై వెళ్లాడా అనేది తెలియాల్సి ఉంది. విషయం తెలిసిన తల్లిదండ్రులు తిరుపతి నుంచి బయలుదేరారని, వారిచ్చే ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌రెడ్డి తెలిపారు.

ఇవీ చదవండి: కువైట్‌లో భారీ డీజిల్‌ మోసం.. భారతీయులు సహా 41 మంది అరెస్ట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement