ఏడాది గడిచినా మెట్రో టేకోవర్‌ పూర్తి కాలేదు.. అసలు సమస్య ఏంటి? | Hyderabad Metro Takeover Delayed For A Year It Project Funding Issues | Sakshi
Sakshi News home page

ఏడాది గడిచినా మెట్రో టేకోవర్‌ పూర్తి కాలేదు.. అసలు సమస్య ఏంటి?

Sep 8 2026 5:48 AM | Updated on Sep 8 2026 5:48 AM

Hyderabad Metro Takeover Delayed For A Year It Project Funding Issues

ఏడాదైనా ఏదీ పురోగతి?

ముందుకు కదలని మెట్రో స్వా«దీనం

ఎక్కడ వేసిన గొంగడి అక్కడే..

గత సెప్టెంబర్‌లో ప్రక్రియ మొదలు

ఇప్పటికీ సర్కార్‌ చేతికందని ప్రాజెక్టు

ఎస్‌బీఐతో కొలిక్కిరాని చర్చలు

సాక్షి, హైదరాబద్‌: చర్చలు, సంప్రదింపులు, సమావేశాలతో మెట్రో మొదటి దశ స్వా«దీన ప్రక్రియ ఏడాది కాలన్ని పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రభుత్వం అధికారికంగా ఈ ప్రాజెక్టును స్వా«దీనం చేసుకున్నట్లు ప్రకటించినప్పటికీ ఎల్‌అండ్‌టీ సంస్థకు ఇంకా రుణాలు చెల్లించలేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఎల్‌అండ్‌టీ నిర్వహణలోనే ఉంది. రెండో దశ పైన కేంద్రం నుంచి సానుకూలమైన స్పందన లభించినప్పటికీ మొదటి దశ టేకోవర్‌ పూర్తయితే తప్ప రెండోదశపై ముందడుగు వేయలేని పరిస్థితి.

ఎల్‌అండ్‌టీకి చెల్లించాల్సిన రూ.1461.47 కోట్లతో పాటు రూ.13,538.53 కోట్ల బ్యాంకు రుణాల రీఫైనాన్సింగ్‌ కోసం ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి ఎస్‌బీఐ క్యాపిటల్‌ సంస్థను ఆశ్రయించడం మినహా ఈ ఏడాది కాలంలో ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం. రుణ సేకరణ కోసం మెట్రోరైల్‌ ఎండీ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఇటీవల ముంబయిలో ఎస్‌బీఐ క్యాపిటల్‌ సంస్థతో సమావేశమై రుణాల చెల్లింపు కోసం నిధులను త్వరగా అందజేయాలని కోరారు.

స్వాదీన ప్రక్రియ ప్రారంభం ఇలా...

  • రెండో దశకు అనుమతినివ్వాలని కోరుతూ ప్రభుత్వం 2024లో కేంద్రాన్ని కోరింది. డీపీఆర్‌లను అందజేసింది. కానీ సాంకేతిక సమస్యల దృష్ట్యా తొలిదశ నిర్వహణపై ఎల్‌అండ్‌టీతో స్పష్టమైన ఒప్పందం కుదుర్చుకుంటే మినహా అనుమతినివ్వలేమని కేంద్రం చెప్పింది.

  • ఈ క్రమంలో ఎల్‌అండ్‌టీ సంస్థతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. పైగా అప్పటికే రూ.5000 కోట్ల అప్పుల భారం పడడంతో ఇక మెట్రో రైళ్లను నడుపలేమంటే గతేడాది సెపె్టంబర్‌ మొదటి వారంలో ఎల్‌అండ్‌టీ చేతులెత్తేసింది. మెట్రో నుంచి వైదొలగనున్నట్లు స్పష్టంగా ప్రకటించింది.

  • ఎల్‌అండ్‌టీ నుంచి మొదటి దశను స్వా«దీనం చేసుకోనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. ఆ తరువాత స్వా«దీన ప్రక్రియలో అడుగులు పడ్డాయి.

ఒప్పందం కుదిరింది...

  • ఎల్‌అండ్‌టీ సంస్థ నుంచి పూర్తి ఈక్విటీ కొనుగోలు (షేర్‌ పర్చేస్‌ అగ్రిమెంట్‌) కోసం ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఎల్‌ అండ్‌ టీ (ఎల్‌అండ్‌టీ) సంస్థకు చెందిన 100 శాతం ఈక్విటీ వాటాను రూ.1,461.47 కోట్లు చెల్లించి కొనుగోలు చేయడానికి షేర్‌ పర్చేస్‌ అగ్రిమెంట్‌ (ఎస్‌పీఏ)కుదుర్చుకుంది.

  • ఎల్‌ అండ్‌ టీ పేరిట ఉన్న సుమారు రూ.13,538.53 కోట్ల రుణాన్ని రీఫైనాన్స్‌ చేయాలని నిర్ణయించారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌ బదిలీ విలువ సుమారు రూ.15,000 కోట్లుగా ఖరారైంది.

  • ఐఎఆర్‌ఎఫ్‌సీ నుంచి నిధులను సేకరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. కానీ తుది దశలో ఆ సంస్థ నిరాకరించడంతో ఈ ప్రక్రియ మొదటికొచ్చింది.

    ఇవీ చదవండి: నిమజ్జనానికి హైదరాబాద్‌ సిద్ధం.. 47 చెరువుల్లో ఏర్పాట్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement