మేనకోడలు చిరుకోరికను తీర్చడం కోసం ఆ మామ ఏం చేశాడంటే..! | Uncle fulfils nieces wish as rare falcon fetches Rs 3.85 crore at Abu Dhabi | Sakshi
Sakshi News home page

మేనకోడలు చిరుకోరికను తీర్చడం కోసం ఆ మామ ఏం చేశాడంటే..!

Sep 7 2026 2:27 PM | Updated on Sep 7 2026 2:39 PM

Uncle fulfils nieces wish as rare falcon fetches Rs 3.85 crore at Abu Dhabi

మేనకోడలు అంటే ఏ మేనమామకు ఇష్టం ఉండదు. అందుకేనేమో అడిగి అడగంగానే కొనిస్తాడు కాబట్టే కవులు మామయ్యను చందమామతో పోల్చి మరి చెబుతుంటారు. అలానే ఇక్కడొక మామయ్య తన ముద్దులు మేనకోడలు చిరుకోరికను నెవరేందుకు ఎంత రిస్క్‌ చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. వేలు, లక్షలు కాదు ఏకంగా కోట్లు ఖర్చు పెట్టి మరి ఏం కొనిచ్చాడో తెలిస్తే విస్తుపోతారు. 

ఈ వింత ఘటన అబుదాబిలో చోటు చేసుకుంది. షేక్‌ అల్‌ మన్సూరి అనే చిన్నారి తన మేనమామతో కలిసి అబుదాబి ఇంటర్నేషనల్‌ హంటింగగ్‌ అండ్‌ ఈక్వెస్ట్రియన్ ఎగ్జిబిషన్ (ADIHEX) 2026కు హాజరైంది. ఆ కార్యక్రమంలో డేగల ఔత్సాహికులు, పెంపెకందారుల కోసం అత్యంత ఖరీదైన వేలం నిర్వహిస్తుంది. అయితే ఈ వేలంలో అత్యంత రికార్డు స్థాయిలో ఓ అరుదైన డేగను కొనుగోలు చేశాడు ఓ వ్యక్తి. నిజానికి బూడిదరంగు, నలుపు వంటి డేగలను చూస్తాం గానీ తెలుపు రంగు డేగలు అత్యంత అరుదు. 

అలాంటి అత్యంత అరుదైన తెల్లటి ఫాల్కన్‌ జాతి డేగ వేలంలో ఏకంగా రూ. 3.85 కోట్లకు అమ్ముడైపోయింది. దీన్ని తన మేనకోడలు కోసం వెచ్చించాడట. ఆమెకు డేగలంటే అమితమైన ఇష్టమని,  ఈ డేగ అంటే ఆమెకు చాలా ఇష్టమని ఆమె చిరకాల కోరికను తీర్చేందుకు ఇంత డబ్బు వెచ్చించినట్లు తెలిపాడు. 

ఈ అరుదైన డేగ అమెరికాలోని మార్క్‌ మెగ్లిచ్‌ ఫాల్కన్‌ ఫార్మ్‌కు చెందినది. దాని ఆకర్షణీయమైన స్వచ్ఛమైన తెల్లని ఈకలు, విలక్షణమైన శారీరక లక్షణాలు కారణంగా ఇది ఎల్లప్పుడు అందరి దృష్టిని ఆకర్షించే డేగగా చెప్పొచ్చు. ఇది సుమారు కిలోగ్రాము బరువు, పొడవు, వెడల్పుల్లో దాదాపు 16.5 అంగుళాల కొలతతో ఉంటుంది. ఇక ఆ చిన్నారి మన్సూరినిఈ డేగలపై ఆసక్తి ఎలా పెరిగిందని అడిగితే..అందుకు తన మామయ్యే కారణమని చెబుతుండటం విశేషం.

 

(చదవండి: మెహిందీ పెడుతూ.. లక్షదాక సంపాదిస్తున్న టెకీ!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement