అనకాపల్లి: భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయను.. వయసు రీత్యా రాజకీయాల నుంచి తప్పుకుని విశ్రాంతి తీసుకుంటానని స్పీకర్ సీహెచ్.అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఏరియా ఆస్పత్రిలో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
‘‘రాజకీయాల నుంచి తప్పుకుంటాను. తర్వాత ఏది చేద్దామన్నా అవకాశం ఉండదు. పదవీకాలం మూడేళ్లు మాత్రమే ఉన్నందున ఈలోపే ఏదో ఒక మంచి పని చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాను’’ అని చెప్పారు. అయ్యన్నపాత్రుడు పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
చదవండి: సాక్షి సోషల్ మీడియాపై చంద్రబాబు సర్కార్ అక్కసు


