సాక్షి, విజయవాడ: ఏపీలో రెడ్‌బుక్ అరాచకాలు కొనసాగుతున్నాయి. సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను కూటమి సర్కార్ బ్లాక్ చేయించింది. వాస్తవాలు ప్రసారం చేసిన సాక్షి సోషల్ మీడియాపై అక్కసు వెళ్లగక్కుతోంది. సాక్షి ఫేస్‌బుక్, ఇన్‌స్టా అకౌంట్లను బ్లాక్ చేయించిన చంద్రబాబు సర్కార్.. డీఎస్సీ అక్రమాలపై వరుస కథనాలు ప్రసారం చేయడంతో వణుకు పోతోంది.
సాక్షి సోషల్ మీడియా అకౌంట్లతో పాటు మరికొన్ని సోషల్ మీడియా అకౌంట్లపై కూటమి సర్కార్ కుట్రలకు తెరలేపింది. టీడీపీ ఫేక్ అకౌంట్లు, ఏపీ సైబర్ క్రైమ్‌తో కలిసి కుట్రలు చేస్తోంది. ఇప్పటికే సాక్షి సోషల్ మీడియాపై కూటమి సర్కార్ పదుల సంఖ్యలో కేసులు పెట్టింది. పత్రికా స్వేచ్ఛను, వాక్ స్వాతంత్ర హక్కును చంద్రబాబు సర్కార్ కాల రాస్తోంది. ఏపీ సర్కార్ కుట్రలపై సాక్షి మీడియా న్యాయ పోరాటం చేస్తోంది.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. సాక్షి ఎడిటర్, జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని అడుగడుగునా అక్రమ కేసులు పెట్టించిన సంగతి తెలిసిందే. అవసరం లేకపోయినా విచారణలు, తనిఖీల పేరుతో వేధింపులకు గురిచేస్తోంది. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా హరించేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెస్తున్న మీడియా సంస్థల గొంతు నొక్కేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది.
ఇదీ చదవండి: మెగా డీఎస్సీ కాదది.. నిరుద్యోగుల గొంతు కోసిన ‘దగా డీఎస్సీ’


