సాక్షి, అమరావతి: మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. వచ్చే మంగళవారం మరో రూ.3,800 కోట్ల బడ్జెట్ అప్పు చేయనుంది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలంలో విక్రయించడం ద్వారా ఈ మొత్తం అప్పును ఆర్‌బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్‌బీఐ శుక్రవారం నోటిఫై చేసింది.