7వ తేదీ లోగా వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

7వ తేదీ లోగా వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోండి

Sep 5 2026 5:49 AM | Updated on Sep 5 2026 5:49 AM

7వ తేదీ లోగా వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోండి తెనాలిఅర్బన్‌: జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి 5వ విడత నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు జిల్లా కన్వీనర్‌, తెనాలి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌ రావి చిన్న వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ చేరదలచిన విద్యార్థులు ఈ నెల 7వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట లోగా తమ పేర్లను ఐటీఐ. ఏపీ. జీవోవీ.ఇన్‌ వెబ్‌ సైట్‌లో నమోదు చేయించుకోవాలన్నారు. అలాగే అదే రోజు తెనాలి, గుంటూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సర్టిఫికెట్లు వెరిఫికేషన్‌ చేయించుకోవాలని సూచించారు. వివరాలకు 63045 72793 లో సంప్రదించాలని కోరారు. శ్రీమేధలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు క్రీడా పోటీల్లో జిల్లా పోలీస్‌ శాఖకు పతకాలు 8 నుంచి కాంట్రాక్టు ఉద్యోగులు విధుల బహిష్కరణ

గుంటూరు ఎడ్యుకేషన్‌: బ్రాడీపేటలోని శ్రీమేధ విద్యాసంస్థల్లో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకున్నారు. ఈసందర్భంగా సంస్థ డైరెక్టర్‌ నందకిషోర్‌, కరస్పాండెంట్‌ అన్నా శ్రీలక్ష్మి శ్రీకృష్ణునికి పూజ నిర్వహించారు. క్యాంపస్‌ ఎదుట ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నందకిషోర్‌ మాట్లాడుతూ అధర్మం వృద్ధి చెందినప్పుడు ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు శ్రీకృష్ణావతారాన్ని దాల్చారని అన్నారు. భగవద్గీత ద్వారా సామాన్య జీవితాన్ని ఏ విధంగా జీవించాలో, ధర్మాన్ని పాటించే విధానం, సంక్లిష్ట పరిస్థితుల్లో సరైన నిర్ణయాలను తీసుకునేందుకు కావాల్సిన ధైర్యాన్ని బోధించారని అన్నారు. ఈసందర్భంగా విద్యార్థులు ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా తదితరులు పాల్గొన్నారు.

నగరంపాలెం: ఏపీ స్టేట్‌ పోలీస్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ (2026)లో జిల్లా పోలీస్‌ అధికారులు, సిబ్బంది అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, పతకాలు సాధించారు. ఈనెల 1–4 వరకు రాష్ట్రస్థాయి పోలీస్‌ క్రీడా పోటీలు మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్‌ ప్రాంగణంలో నిర్వహించారు. ఫైరింగ్‌ విభాగంలో ఎస్‌బీ సీఐ ఏ.మల్లికార్జునరావు స్టెన్‌ గన్‌ ఈవెంట్‌లో ద్వితీయ, కార్బైన్‌ ఈవెంట్‌లో తృతీయ స్థానంలో, వెయిట్‌ లిఫ్టింగ్‌్‌ 85 కిలోల విభాగంలో ఎస్‌బీ హెడ్‌ కానిస్టేబుల్‌ మల్లికార్జునరావు గోల్డ్‌ మెడల్‌, కబడ్డీలో ఎస్‌బీ మహిళా కానిస్టేబుల్‌ క్రాంతికుమారి, పట్టాభిపురం పీఎస్‌ మహిళా కానిస్టేబుల్‌ తిరుపతమ్మ గుంటూరు రేంజ్‌ నుంచి రెండో స్థానం సాధించారు. హ్యాండ్‌ రైజింగ్‌లో ఎస్‌బీ మహిళా కానిస్టేబుల్‌ క్రాంతికుమారి సిల్వర్‌ మెడల్‌, కె.వేణుబాబు ఆధ్వర్యంలో గుంటూరు డాగ్‌ స్క్వాడ్‌కు చెందిన ‘సింబా’ నార్కోటిక్‌ టెస్ట్‌ విభాగంలో రెండో స్థానం సాధించారు. ఆయా పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అభినందించారు.

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ అండ్‌ కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో పలువురు వైద్య సిబ్బంది సూపరింటెండెంట్‌ కార్యాలయం ఎదుట నిలబడి ప్లకార్డులు చేతపట్టుకుని, నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ న్యాయబద్ధమైన డిమాండ్‌లను పరిష్కరించని పక్షంలో ఈనెల 8 నుంచి విధులు బహిష్కరిస్తామని యూనియన్‌ నేతలు తెలిపారు. 30 రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ విధులు బహిష్కరించి నిరసన కొనసాగిస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, ఉద్యోగాలు రెగ్యులర్‌ అయ్యే వరకు నూరు శాతం గ్రాస్‌ శాలరీ చెల్లించాలని కాంట్రాక్టు ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పించాలని యూనియన్‌ నేతలు డిమాండ్‌ చేశారు. నిరసన కార్యక్రమంలో పలువురు స్టాఫ్‌నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మాశిస్టులు, ఇతర పారామెడికల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement