సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: ఏపీలో మరో విషాదం చోటుచేసుకుంది. యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. నంబూరి శ్రీనివాస్ కుటుంబంతో సహా వశిష్ట గోదావరి బ్రిడ్జిపై నుంచి దూకారు. తండ్రి, కుమార్తె నంబూరి నిత్య(15), కుమారుడు నంబూరు ఈశ్వర్(16) గల్లంతవ్వగా.. తల్లి పద్మినిని జాలర్లు కాపాడారు. తణుకు పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు.
తణుకు నుంచి రెండు బైకులపైకి వచ్చి చించినాడ వశిష్ట గోదావరి బ్రిడ్డిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పద్మినిని పాలకొల్లు ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక సమస్యలు కారణంగానే కుటుంబం ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


