కిడ్స్ స్పెషల్
మహనీయుల బాల్యం
తన పన్నెండేళ్ల వయసులో పిల్లల సైన్యాన్ని నడిపిన ఈ చిన్నారి.. దేశం కోసం ఐదేళ్ల వయసులోనే తనకు ఎంతో ఇష్టమైన బొమ్మను త్యాగం చేసింది. ఆ చిన్నారి మరెవరో కాదు.. భారత ప్రధానిగా చరిత్ర సృష్టించిన ఇందిరా గాంధీ!
మన దేశ ఏకైక మహిళా ప్రధాని ఇందిరా గాంధీకి ఐదేళ్ల వయసులో ఒక బొమ్మ అంటే చాలా ఇష్టం. అది ఇంగ్లాండ్ నుంచి తండ్రి నెహ్రూ తెచ్చి ఇచ్చింది. ఆ సమయంలో మహాత్మా గాంధీ ‘విదేశీ వస్తువులను బహిష్కరించండి’ అని పిలుపునిచ్చారు.
ఆ పిలుపుతో ఇందిర తన విదేశీ బట్టలన్నింటినీ మంటల్లో వేసింది. ఒక స్నేహితుడు ‘నీ బొమ్మ కూడా విదేశీదే’ అని చెప్పాడు. చిన్నారి ఇందిర చాలా రోజులు ఆలోచించి, బాధపడుతూనే ఆ బొమ్మను చితిలో వేసింది. బొమ్మ కంటే దేశం ముఖ్యం మరి.
ఇందిరకు 12 ఏళ్లు వచ్చేసరికి 1930లో ‘వానర సేన’ అనే పిల్లల సైన్యాన్ని స్థాపించింది. బ్రిటిష్ పోలీసులు పిల్లలను అనుమానించరు కదా, అందుకే ఈ పిల్లలు రహస్యంగా ఉత్తరాలు చేరవేసేవారు, జెండాలు కుట్టేవారు, ఉద్యమకారులకు సహాయం చేసేవారు. మహనీయులు అలా బాల్యం నుంచే గొప్ప పనులు చేస్తారు.
ఇవీ చదవండి: అంకెలే ఆమె మనోబలం


