భుజాల నొప్పికి యోగా.. కానీ ఈ తప్పు మాత్రం చేయకండి! | Yoga Pose Neck Shoulder Back Relief Benefits | Sakshi
Sakshi News home page

భుజాల నొప్పికి యోగా.. కానీ ఈ తప్పు మాత్రం చేయకండి!

Sep 5 2026 9:59 AM | Updated on Sep 5 2026 10:03 AM

Yoga Pose Neck Shoulder Back Relief Benefits

లైఫ్‌

హెల్త్‌

హస్త ఉత్థానాసనం

రోజంతా కూర్చుని పనిచేయడం, మొబైల్‌ చూడటం వల్ల మెడ, భుజాలు, వెన్నుపై ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి సమయంలో శరీరాన్ని సున్నితంగా వెనుకకు సాగదీసే కొన్ని యోగా భంగిమలు ఉపశమనానికి తోడ్పడవచ్చు. అయితే ఈ భంగిమను ఎలా చేయాలి? ఎవరెవరు చేయకూడదు? ప్రయోజనాలు ఏమిటి? ఇప్పుడు చూద్దామా?

ఇలా చేయాలి..

  • నిటారుగా నిలబడి, చేతులను నెమ్మదిగా పైకి ఎత్తాలి.

  • చేతులను నడుముపై ఉంచుకోవాలి.

  • మెడను వెనుకకు ఎక్కువగా వేలాడదీయకూడదు.

  • నడుమును ఎక్కువగా వెనుకకు వంచకూడదు.

  • అవసరమైతే ఊర్ధ్వ తాడాసనం రూపంలో చేయవచ్చు.

  • సుమారు 30 సెకన్ల పాటు భంగిమను నిలుపుకోవడం

జాగ్రత్తలు...
భుజాల నొప్పి, స్పాండిలైటిస్, వెన్నునొప్పి, వెన్నెముక లేదా వెన్నుకు గాయం ఉన్నప్పుడు చెయ్యకూడదు.

ప్రయోజనాలు...

  • మెడ, భుజాలు, పై వెన్నుభాగంలో ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుంది.

  • వెన్నెముకపై ఉన్న కంప్రెషన్‌ ను తగ్గించడంలో సహాయపడుతుంది.

  • పొత్తికడుపు కండరాలను స్ట్రెచ్‌ చేస్తుంది.

  • ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరచి, లోతైన శ్వాసకు సహాయపడుతుంది.

  • చేతులు, భుజాలు, పై వెన్నుభాగంలోని కండరాలను బలోపేతం/స్ట్రెచ్‌ చేయడంలో సహాయపడుతుంది.

– అనిత పాతర్ల, యోగా ట్రైనర్‌

ఇవీ చదవండి: మన కుల్ఫీకి ప్రపంచమే ఫిదా.. టాప్‌-10లో చోటు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement