లైఫ్
కుల్ఫీకి ప్రపంచస్థాయిలో దక్కిన ఈ గుర్తింపు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అసలు మన కుల్ఫీకి ఈ స్థానం ఎలా దక్కింది? ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ప్రపంచాన్ని మెప్పించిన ఈ చల్లని భారతీయ డెసర్ట్ గురించి ఇప్పుడు చూద్దామా?
ప్రసిద్ధ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ ‘టేస్ట్‌అట్లాస్’ విడుదల చేసిన ప్రపంచంలోనే 50 అత్యుత్తమ ఫ్రోజెన్ డెసర్ట్‌ల జాబితాలో భారతదేశానికి చెందిన సాంప్రదాయ ఐస్‌క్రీమ్ ‘కుల్ఫీ’ 7వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా లభించే ఇటాలియన్ జెలాటో, టర్కిష్ దొందుర్మా వంటి ప్రసిద్ధ డజర్ట్‌లతో పోటీపడి ఈ ఘనత సాధించింది.
పాలను మరిగించి చిక్కబరిచిన తర్వాత కుంకుమపువ్వు, యాలకులు, పిస్తా, బాదం వంటి వాటిని కలిపి దీనిని తయారు చేస్తారు. అంతేకాకుండా, ఎందరికో ఇష్టమైన ‘కుల్ఫీ ఫలూదా’ 33వ స్థానంలో చోటు సంపాదించి అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ స్వీట్స్ ప్రత్యేకతను మరోసారి చాటిచెప్పింది.
ఇవి కూడా చదవండి: మీ షాపింగ్ బిల్లు పేపరు తెల్లగా మారుతోందా? అయితే ఇదే కారణం!


