నెల జీతంతో ఇంత కుటుంబాన్ని నడిపించేది ఎవరో తెలుసా? | Women Financial Freedom Money Management Tips | Sakshi
Sakshi News home page

నెల జీతంతో ఇంత కుటుంబాన్ని నడిపించేది ఎవరో తెలుసా?

Sep 5 2026 8:55 AM | Updated on Sep 5 2026 9:06 AM

Women Financial Freedom Money Management Tips

లైఫ్‌

నందరికి బాగా గుర్తుండే ఉంటుంది... చిన్నప్పుడు స్కూల్‌ నుంచి ఇంటికొచ్చినప్పుడు వంటింట్లో నుంచి కమ్మటి వాసన..ఈవెనింగ్‌ స్నాక్స్‌ కింద అమ్మ గారెలో, బజ్జీలో వేస్తోంది అని ఇట్టే పసిగట్టేస్తాం. అమ్మ చాలా పనులు చేసేది. నాన్నమ్మకి మందులు ఇవ్వాలి. మనకి ట్యూషన్‌కి వెళ్లే ముందు చాక్లెట్లకి డబ్బులివ్వాలి. దీపావళి, సంక్రాంతి లాంటి పండగలొస్తే  కొత్త బట్టలు ఒంటిమీదకొస్తాయని చెప్పక్కర్లేదు. ఇక బంధువులు వచ్చినప్పుడు హడావిడిగా తిరుగుతూ అందరికీ అన్నీ చేస్తూ ఇంటి భారాన్ని మోస్తూ నవ్వుతూ కనిపించే అమ్మ నిజంగా మనీ మేనేజ్‌మెంట్‌ అంటే ఏంటో చెప్పకనే చెప్పేది. నెలకోసారి వచ్చే నాన్న జీతంతోనే ఇన్ని చేయగలగడమే నిజమైన ఫైనాన్షియల్‌ డిసిప్లిన్‌.

ఒకప్పుడు వంటింటి బడ్జెట్‌కే పరిమితమైన మహిళలు.. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి ఎదుగుతున్నారు. కేవలం సంపాదించడమే కాకుండా, సరైన ΄÷దుపు ప్రణాళికలు, పెట్టుబడుల ద్వారా మహిళలు నిజమైన ఆర్థిక స్వాతంత్య్రం వైపు అడుగులు వేస్తున్నారు. తమ కుటుంబాలకు ఆర్థిక రక్షణ కవచంగా మారుతున్నారు.

ఆర్థిక స్థిరత్వం దిశగా..
ఆర్థికంగా నిలదొక్కుకున్న మహిళ.. ఒక కుటుంబానికే కాదు, యావత్‌ సమాజానికే ఆత్మవిశ్వాసం. కష్ట కాలంలో ఇతరులపై ఆధారపడకుండా, తమ కష్టార్జితాన్ని సరైన ΄÷దుపు మార్గాల్లో మళ్లించడం ద్వారా తమకు తాము సాధికారతౖవైపు నడవవచ్చు. గృహిణి అయినా, ఐటీ ఉద్యోగిణి అయినా.. నేడు ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన అసలైన మంత్రం ‘డబ్బు సంపాదించడం ఒక ఎతై ్తతే, ఆ డబ్బును మన కోసం పని చేయించడం మరొక ఎత్తు’. అలా ఉండాలంటే కొన్ని ఆర్థిక వ్యూహాలు, జాగ్రత్తలు తప్పనిసరి.

స్వయంగా తెలుసుకోవాలి..
మీ డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్‌ అవుతోంది, దానిపై ఎంత రిటర్న్స్‌ వస్తున్నాయి అనే విషయాలను మీరే స్వయంగా పర్యవేక్షించాలి. మీరు తీసుకునే ప్రతి ఆర్థిక నిర్ణయానికి మీరే పూర్తి బాధ్యత వహించాలి. పర్సనల్‌ ఫైనాన్స్‌ పుస్తకాలు చదవడం, మంచి ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోవడం ద్వారా మీలో ఆర్థిక అవగాహన, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కీలకమైన ఆర్థిక నిర్ణయాల కోసం ఇతరులపై ఆధారపడటం తగ్గుతుంది.

క్లిష్ట పరిస్థితుల్లోనూ..
జీవితంలో ఎప్పుడు ఎలాంటి అత్యవసర పరిస్థితి వస్తుందో చెప్పలేం. అందుకే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటం మంచిది. అందుకోసం మన సంపాదనలో ప్రతినెలా కొంత మొత్తాన్ని ఎమర్జెన్సీ ఫండ్‌ రూపంలో భద్రపరచాలి. ఇలా చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో పర్సనల్‌ లోన్లు లేదా క్రెడిట్‌ కార్డ్‌ల ఊబిలో పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఆర్థిక నిర్వహణ అంటే.. కేవలం డబ్బు దాచడం మాత్రమే కాదు. అది మీ భవిష్యత్తును మీరే నిర్దేశించుకునే ఒక ఆత్మవిశ్వాసమని గుర్తించాలి.

ఇవి చదవండి: యూరప్‌ పరిస్థితి చూస్తే భయమేస్తోంది.. ప్రకృతి హెచ్చరిక ఇదేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement