పాము మన శత్రువు కాదా? ఈ స్టూడెంట్స్‌ ఏం చెబుతున్నారంటే! | Snake In Students Hands Why Are They Studying Lyre Snake | Sakshi
Sakshi News home page

పాము మన శత్రువు కాదా? ఈ స్టూడెంట్స్‌ ఏం చెబుతున్నారంటే!

Sep 5 2026 10:13 AM | Updated on Sep 5 2026 10:24 AM

Snake In Students Hands Why Are They Studying Lyre Snake

కిడ్స్‌ స్పెషల్‌

సైన్స్‌

ఫోటో చూడండి ఫ్రెండ్స్‌! మెక్సికోలోని కుయెర్నవాకా నగరంలో UNAM యూనివర్సిటీ ల్యాబ్‌లో ఇద్దరు స్టూడెంట్స్‌ ఒక పామును చేతిలో పట్టుకుని పరిశీలిస్తున్నారు. దీని పేరు వెస్ట్రన్‌ లైర్‌ స్నేక్‌. పాము అనగానే మనకు భయం వేస్తుంది కదా? కానీ ఈ స్టూడెంట్స్‌కు పాము అంటే భయం కాదు, ఆసక్తి! వీళ్ళు జీవశాస్త్రం చదివే విద్యార్థులు.

వీరి చేతిలో ఉన్న పామును లైర్‌ స్నేక్‌ అంటారు. ఇది రాత్రిపూట తిరిగే పాము. కొండల్లో, రాళ్ల సందుల్లో ఉంటుంది. మనిషికి అంత ప్రమాదం కాదు. దాని విషం చిన్న బల్లులు, ఎలుకలను చంపడానికి మాత్రమే. మనల్ని కరిసినా జ్వరంలా వచ్చి తగ్గిపోతుంది. మెక్సికోలో ఇలాంటి పాముల గురించి పిల్లలకు, రైతులకు భయం పోగొట్టడానికి ఈ ల్యాబ్‌లో పరిశోధనలు చేస్తారు. పాము మన శత్రువు కాదు పిల్లలూ, పొలంలో ఎలుకలను తిని రైతుకు సాయం చేస్తుంది.చూశారా, పామును కూడా ప్రేమించవచ్చు!

ఇవి కూడా చదవండి: రోడ్డుపై ఈము.. పోలీస్‌ పరుగులు! చివరికి ఏం జరిగిందంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement