‘అల్లరి’ నరేశ్ హీరోగా నటించిన చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. సురభి, రాశీ సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నిన్న (శుక్రవారం) విడుదలైంది.
తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోందని యూనిట్ పేర్కొంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు.


