breaking news
Ramba Oorvasi Menaka Movie
-
‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
లాజిక్‌లు వదిలేసి మ్యాజిక్‌ను ఎంజాయ్ చేయండి: ‘అల్లరి’ నరేశ్
‘అల్లరి’ నరేశ్ హీరోగా నటించిన చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. సురభి, రాశీ సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నిన్న (శుక్రవారం) విడుదలైంది. తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోందని యూనిట్ పేర్కొంది. శుక్రవారం సాయంత్రం యూనిట్ నిర్వహించిన సమావేశంలో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘చాలా రోజుల తర్వాత నేను చేసిన కామెడీ సినిమా ఇది. దీంతో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అన్న చిన్న భయం ఉండేది. ఫస్ట్ డేనే మా సినిమాకు మంచి టాక్ రావడం సంతోషాన్నిచ్చింది. లాజిక్‌లు వదిలేసి ఒక మ్యాజిక్‌ని ఎంజాయ్ చేయండి. చూడనివాళ్ళు, థియేటర్స్‌లో చూసి, ఇంకా పెద్ద విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘అందరూ ‘నరేష్ ఈజ్ బ్యాక్’ అంటున్నారు. కామెడీని ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు. అలాగే ఎమోషన్ గురించి కూడా గొప్పగా మాట్లాడుతున్నారు’’ అని తెలిపారు చంద్రమోహన్. ‘‘నరేష్‌గారి కామెడీ ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంటుంది. బీ, సీ సెంటర్స్‌లో మా సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది’’ అని చెప్పారు రాజేష్ దండా. -
రంభ ఊర్వశి మేనక.. ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..!
అల్లరి నరేశ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ రంభ ఊర్వశి మేనక. ఈ చిత్రానికి చింతాడ చంద్రమోహన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సురభి హీరోయిన్గా కనిపించింది. ఈ కామెడీ ఎంటర్టైనర్ ఇవాళే థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే మిక్స్డ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ సినిమా థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్–హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండ, నిమ్మకాయ ప్రసాద్ నిర్మించారు. -
ఎయిర్‌హోస్ట్ నుంచి హీరోయిన్గా.. ఇదే రాశీ సింగ్ సక్సెస్ జర్నీ
ఎయిర్‌హోస్టెస్‌గా ఉద్యోగం.. మంచి జీతం. తన తల్లి కల కోసం సినిమాలవైపు వచ్చింది. నటనపై ఉన్న మక్కువతో ఉద్యోగాన్ని వదిలి హైదరాబాద్‌కు వచ్చింది యువ హీరోయిన్ రాశీ సింగ్. ‘శశి’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ప్రస్తుతం ‘రంభ ఊర్వశి మేనక’ సినిమాతో మరోసారి వెండి తెరపై కనిపించింది. ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఈ భామ తన కెరీర్ విశేషాలను వెల్లడించింది. తన మాటల్లోనే..‘చిన్నప్పటి నుంచి నటిని కావాలని నిర్ణయించుకున్నా. నిజానికి మా అమ్మకు కూడా నటి కావాలనే కోరిక ఉండేది. కానీ కొన్ని కారణాల కాలేకపోయారు. ఆమె కల కోసం నన్ను ఇలా ప్రోత్సాహించారు. ఇప్పుడు నాలో ఆమెను చూసుకుంటున్నారు.గతంలో ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్హోస్ట్గా పనిచేశా. ఆ ఉద్యోగం బాగానే ఉన్నప్పటికీ నా మనసంతా సినిమాల పైనే ఉండేది. అందుకే ఉద్యోగాన్ని వదిలేశా. తర్వాత మోడలింగ్ చేయడంతో పాటు కొన్ని ప్రకటనల్లో నటించా. గాడ్‌ఫాదర్ లేకపోవడంతో చాలా విషయాల్లో కష్టపడాల్సి వచ్చేది. అయితే ఆ శ్రమకు ఇప్పుడు ప్రతిఫలం దక్కింది.ఇదీ చదవండి: ‘ఓటీటీలు సోమరిపోతుల కోసమే’నాకు కెమెరా అంటే భయం ఉండేది కాదు. షూటింగ్ టైమ్‌లో నటనకు సంబంధించిన కొన్ని విషయాలు నేర్చుకున్నా. యాడ్స్‌లో పనిచేయడం కూడా కలిసొచ్చింది. మోడలింగ్ ద్వారా చాలామందిని కలుసుకునే అవకాశం వచ్చింది. ఆ తర్వాత సినిమాలకు ఆడిషన్స్ ఇవ్వడం మొదలు పెట్టా.ఎక్కువ మంది చదివింది: రూ.100 కోట్లు ఇస్తా.. సినిమా నాతోనే చేయాలి : అల్లరి నరేష్సినిమాలో నేను పోషించిన పాత్రల ద్వారా ప్రేక్షకుల నన్ను గుర్తుపట్టుకోవాలి. అందుకే తొందరపడకుండా కథలను జాగ్రత్తగా ఎంచుకుంటున్నా. కథ విన్నాకే నిర్ణయం తీసుకుంటా. పరిశ్రమలో గుర్తుండుపోయే పాత్రలు చేయాలనేదే నా కోరిక’ అని రాశి సింగ్ ఓ ఇంటర్వ్యులో వెల్లడించారు. ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9 సీజన్లు..9మంది విజేతలు.. ఇప్పుడు ఏం చేస్తున్నారు? -
‘రూ.100 కోట్లు ఇస్తా.. సినిమా నాతోనే చేయాలి’
అల్లరి నరేశ్ హీరోగా చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. సురభి హీరోయిన్గా నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్–హాస్య మూవీస్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. ఈచిత్రం రేపు(సెప్టెంబర్4) రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈవెంట్లో పాల్గొన్న అల్లరి నరేష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఎక్కువ మంది చదివింది: అలాంటి సినిమాల విషయంలో తాప్సీ సంచలన నిర్ణయంయాంకర్ సుమ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘మీకు వందకోట్లు వరం వస్తే వాటిని ఎవరికి ఇస్తారు? అని అల్లరి నరేశ్‌కి అడిగారు. దీనికి బదులిస్తూ.. ‘ప్రస్తుతం ఇండస్ట్రీలో బాగా లీడ్‌లో ఉన్న మైత్రీ మేకర్స్‌కు రూ.50 కోట్లు, అన్నపూర్ణ స్డూడియోస్‌కు రూ.25 కోట్లు, హాస్య మూవీస్‌కి రూ.25 కోట్లు ఇస్తాను. కానీ వీరంతా నాతోనే సినిమా తీయాలి. అదే నా కండిషన్’ అని చెప్పి నవ్వులు పూయించారు. ఇదీ చదవండి: అబ్బాయిలా ఉండేనన్ను.. అమ్మాయిగా మార్చారు: విష్ణుప్రియకాగా ఫాంటసీకి వినోదాన్ని జోడిస్తూ తెరకెక్కిన ఈ సినిమా వినోదభరితమైన ఘటనలతో సరికొత్త థియేట్రికల్ అనుభూతిని అందించనుంది. నరేష్ వీకే, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. -
అబ్బాయిలా ఉండేనన్ను.. అమ్మాయిగా మార్చారు: విష్ణుప్రియ
చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో అల్లరి నరేశ్ హీరోగా నటించిన చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. సురభి హీరోయిన్గా నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్–హాస్య మూవీస్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్లో పాల్గొన్న యాకంర్, నటి విష్ణుప్రియ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.‘ సినిమాలో నన్ను అందంగా చూపించిన మేకప్ అండ్ స్టైలింగ్ టీమ్ రామరెడ్డికి స్పెషల్ థాంక్స్ . నేను కొంచెం అబ్బాయిలా ఉండేదాన్ని. అలాంటి నన్ను ఒక అందమైన అమ్మాయిలా కనిపించేలా చేశారు.. మీకు చాలా థాంక్స్’ అంటూ చెప్పి అక్కడున్నవాళ్లని నవ్వులు పూయించారు. అంతేకాకుండా యాంకర్ సుమ ‘నీ ముక్కు పొడుగు ఎంత’ అని అడిగిన ప్రశ్నకు బుదులు ఇస్తూ ఆకాశమంత అని నవ్వుతూ చెప్తూ అక్కడున్న వాళ్లని ఆకట్టుకున్నారు. కాగా ఈ సినిమాలో విష్ణుప్రియ ఊర్వశిగా కనువిందు చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ఈ చిత్రం రేపు(సెప్టెంబర్4) రిలీజ్ కానుంది. ఇదీ చదవండి: అలాంటి సినిమాల విషయంలో తాప్సీ సంచలన నిర్ణయం Anchor #Suma : మీ ముక్కు పొడుగు ఎంత ??#VishnuPriya : ఆకాశమంతా 🤯#RambaOorvasiMenaka pic.twitter.com/ZzmJIxzg9D— ANANTAPUR CINEMA (@AnantapurCinema) September 2, 2026 -
‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్స్క్రిప్షన్ పెట్టా..!
తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి విష్ణుప్రియ. సోషల్ మీడియాలోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. త్వరలో ‘రంభ ఊర్వశి మేనక’ సినిమాతో ప్రేక్షకులకు కనిపించనుంది విష్ణుప్రియ. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో పాల్గొన్న విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్, సోషల్ మీడియా ద్వారా వచ్చే ఆదాయం కోసం వెల్లడించారు. షోలో కంటే ఇక్కడే ఎక్కువ..‘షోల కంటే, మూవీస్ కంటే కూడా విష్ణుప్రియ సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ సంపాదిస్తోంది’ అనే ప్రచారంపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇది తన ఒక్కరి విషయంలోనే కాదని.. చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా డబ్బులు ఎక్కువ అర్జిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా బ్రాండ్ ప్రమోషన్స్, సోషల్ మీడియా ద్వారా వచ్చే ప్రాజెక్టుల నుంచి రెమ్యునరేషన్ గణనీయంగా ఉంటుందని చెప్పారు. ఇది అదృష్టంగా భావిస్తున్నా..‘టీవీలో రెండు ఎపిసోడ్లకు వచ్చే పారితోషికం కంటే సోషల్ మీడియాలో ఒక్క ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అక్కడ పడే కష్టానికి.. ఇలా ప్రతిఫలం ఉంటుంది. అయితే చాలామందిలో టాలెంట్ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రావడం లేదు. నా విషయంలో మాత్రం ఫోన్ ప్రతిరోజూ అవకాశాల కోసం మోగుతూనే ఉంటుంది. ఇది అదృష్టంగా భావిస్తున్నా’ అని విష్టప్రియ తెలిపింది.ఎక్కువ మంది చదివింది: చిన్నారులే.. కానీ రెమ్యునరేషన్లో తోపులు.. ఎవరికి ఎంతంటే?ఇన్‌స్టాగ్రామ్‌లో సంపాదన ఎంత? విష్టుప్రియ ఇన్స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్‌తో బాగానే సంపాదిస్తోందిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సబ్స్క్రిప్షన్ తీసుకున్నవాళ్లు 4728 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఒక నెలకి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే రూ.390లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన మొత్తం సుమారు.రూ.18లక్షల పైనే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా బ్రాండ్ ప్రమోషన్స్, సోషల్ మీడియా ద్వారా వచ్చే ప్రాజెక్టులు ద్వారా కూడా అదనంగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం.సినిమా విషయానికి వస్తే..అల్లరి నరేష్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’. ఈ సినిమాకు చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహించారు. సురభి హీరోయిన్. ఈ చిత్రం సెప్టెంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్– హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంది. ఇటీవలే విడుదలైన సాంగ్‌లో అల్లరి నరేశ్‌తో కలిసి రాశీ సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్‌లు చిందులేశారు. నరేష్ వీకే, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఇదీ చదవండి: గణేశుడిని ఇంట్లోనే నిమర్జనం.. ఆపై మొక్కగా.. -
దేవకన్యలా మెరిసిపోతున్న రాశీ (ఫొటోలు)
-
హీరోయిన్ ప్రిషా సింగ్ బ్యూటిఫుల్ (ఫొటోలు)
-
సినిమా పోతే నా గడ్డం గీసుకుంటా...
-
‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టైటిల్ సాంగ్ రిలీజ్ (ఫొటోలు)
-
రంభ ఊర్వశి మేనక.. ముగ్గురు భామలతో టైటిల్ సాంగ్
అల్లరి నరేష్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ కామెడీ ఎంటర్టైనర్ రంభ ఊర్వశి మేనక. ఈ సినిమాకు చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్– హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు.ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఫుల్ ఫన్‌గా అనిపించింది. తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ చూస్తుంటే ఈ మూవీలో హైలెట్‌గా ఉండనుందని తెలుస్తోంది. భారీస్థాయిలో ఈ పాటను షూట్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ పాటకు సురేశ్ బనిశెట్టి లిరిక్స్ అందించగా.. ధనుంజయ్ సీపన, సాహితి చాగంటి ఆలపించారు. ఈ పాటను చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ టైటిల్ సాంగ్ మీరు కూడా చూసేయండి. రంభ ఊర్వశి మేనక... స్టెప్ వేస్తే తెల్లార్లూ వేడుక ❤️🔥The Ultimate Dance Blast number #RambaOorvasiMenaka Title Song Lyrical Video Out Now🕺💃💃💃-- https://t.co/4Jy3mHDKnYIN CINEMAS SEPTEMBER 4th, 2026 😀@allarinaresh @Surbhiactress @RashiReal_ #VishnuPriya… pic.twitter.com/fgu1zb3EYP— Annapurna Studios (@AnnapurnaStdios) August 27, 2026 -
రంభ ఊర్వశి మేనక ట్రైలర్.. ఫుల్ ఫన్‌గా ట్రైలర్
అల్లరి నరేష్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. కామెడీ గోస్ కాస్మిక్ అన్నది ట్యాగ్‌లైన్ ఈ సినిమాకు చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్– హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీని తలపిస్తోంది. ఇంద్రలోకం నుంచి భూలోకానికి వచ్చిన రంభ, ఊర్వశి, మేనక ఎలాంటి ఇబ్బందులు పడ్డారనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీలో నరేష్ వీకే, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబరు 4న గ్రాండ్ రిలీజ్ కానుంది. -
రంభ ఊర్వశి మేనక.. బ్యాండ్ బాజా మోగాల్సిందే..!
అల్లరి నరేష్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ రంభ ఊర్వశి మేనక. ఈ సినిమాకు చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్– హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ ఫుల్ కామెడీని తలపించింది. ఇంద్రలోకం నుంచి భూలోకానికి రంభ, ఊర్వశి, మేనక వస్తే ఎలా ఉంటుందనే ఆసక్తికర కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు.తాజాగా ఈ మూవీ నుంచి బ్యాడ్ టైమ్ బ్యాండ్ బాజా అంటూ పాట రిలీజ్ చేశారు. వెళ్లవే పేదరికం.. ఇక్కడే ఇల్లరికం అనే లిరిక్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు భాస్కర భట్ల రవికుమార్ లిరిక్స్ అందించగా..రామ్ మిరియాల ఆలపించారు. ఈ పాటను చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ మూవీలో నరేష్ వీకే, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబరు 4న గ్రాండ్ రిలీజ్ కానుంది. -
‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'రంభ, ఊర్వశి, మేనక భూలోకానికి వస్తే..' ఆసక్తిగా టీజర్
అల్లరి నరేష్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. కామెడీ గోస్ కాస్మిక్ అన్నది ట్యాగ్‌లైన్ ఈ సినిమాకు చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్– హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి.తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇంద్రలోకం నుంచి భూలోకానికి రంభ, ఊర్వశి, మేనక వస్తే ఎలా ఉంటుందనే ఆసక్తికర కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. టీజర్లో సన్నివేశాలు ఫుల్ కామెడీని తలపిస్తున్నాయి. ఈ మూవీతో అల్లరి నరేశ్ తన కామెడీ ట్రాక్‌లో సక్సెస్ కొట్టేలా కనిపిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీలో నరేష్ వీకే, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబరు 4న గ్రాండ్ రిలీజ్ కానుంది. -
అల్లరి నరేశ్ రంభ ఊర్వశి మేనక.. క్రేజీ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ నటించిన లేటేస్ట్ మూవీ రంభ ఊర్వశి మేనక. ఈ చిత్రానికి చంద్రమోహన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సురభి హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా.. సెప్టెంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. నా కంటి మీద కునుకే’అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు భాస్కర భట్ల రవికుమార్ లిరిక్స్ అందించగా.. ధనుంజయ్ ఆలపించారు. ఈ సాంగ్‌ను చేతన్ భరద్వాజ్ కంపోజ్ చేశారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హస్య మూవీస్ బ్యానర్లో రాజేశ్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు.


