అల్లరి నరేష్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ రంభ ఊర్వశి మేనక. ఈ సినిమాకు చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్– హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ ఫుల్ కామెడీని తలపించింది. ఇంద్రలోకం నుంచి భూలోకానికి రంభ, ఊర్వశి, మేనక వస్తే ఎలా ఉంటుందనే ఆసక్తికర కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు.
తాజాగా ఈ మూవీ నుంచి బ్యాడ్ టైమ్ బ్యాండ్ బాజా అంటూ పాట రిలీజ్ చేశారు. వెళ్లవే పేదరికం.. ఇక్కడే ఇల్లరికం అనే లిరిక్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు భాస్కర భట్ల రవికుమార్ లిరిక్స్ అందించగా..రామ్ మిరియాల ఆలపించారు. ఈ పాటను చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ మూవీలో నరేష్ వీకే, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబరు 4న గ్రాండ్ రిలీజ్ కానుంది.


