సీనియర్ నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత | Senior Actress Sowcar Janaki Gets Hospitalized With Health Issues, Check Out Her Health Condition | Sakshi
Sakshi News home page

Sowcar Janaki: షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత

Aug 20 2026 3:06 PM | Updated on Aug 20 2026 3:21 PM

Senior Actress Sowcar Janaki gets Hospitalized with Health Issues

ప్రముఖ సీనియర్‌ సినీ నటి షావుకారు జానకి (95) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారం రోజుల క్రితం శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అయితే బుధవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని  వైద్యులు ప్రకటించారు.

కాగా.. 1950ల్లో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కథానాయికల్లో షావుకారు జానకి ఒకరు.  'షావుకారు' సినిమాతో పరిచమైన ఆమెకు సినిమా పేరే ఇంటి పేరుగా మార్చుకున్నారు.  చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చిన ఆమె అద్భుతమైన వాయిస్‌, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. అప్పటి నుంచి నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె తెలుగుతో పాటు తమిళంలో సైతం హీరోయిన్‌గా రాణించారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఇప్పటికీ పలు సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement