breaking news
Sowcar Janaki
-
షావుకారు జానకి అంత్యక్రియలు
-
షావుకారు జానకి మృతి పట్ల ప్రముఖుల నివాళి
షావుకారు జానకి మృతి పట్ల పలువురు దక్షిణాది స్టార్స్ తమ సంతాపం వ్యక్తం చేశారు.→ షావుకారు జానకిగారు నాకు తల్లిగా ఎన్నో చిత్రాల్లో నటించారు. కొన్ని దశాబ్దాల పాటు మేం ఎన్నో సినిమాల్లో కలిసి పని చేశాం. ఆనాటి హీరోలందరితోనూ నటించిన ఘనత జానకిగారిది. నా గురువు కె. బాలచందర్‌కు ఆమె అంటే ఎంతో గౌరవం. ఆమెకు నా కన్నీటి వీడ్కోలు. – కమల్‌హాసన్→ లెజండరీ నటి షావుకారు జానకిగారితో కలిసి ‘సూర్య మానసం’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. ఆ సినిమా సమయంలోని జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకుంటున్నాను. – మమ్ముట్టి→ తెలుగు, భారతీయ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకిగారి మరణవార్త నాకు ఎంతో బాధ కలిగించింది. జానకిగారి సినీ ప్రయాణం, ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. – ఎన్టీఆర్→ ‘షావుకారు’ చిత్రంతో మొదలైన జానకిగారి సుదీర్ఘ సినీ ప్రస్థానం తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో దాదాపు ఏడు దశాబ్దాలపాటు కొనసాగింది. వైవిధ్యమైన పాత్రలకు తన సహజమైన నటనతో ప్రాణం పోసి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటి ఆమె..– చిరంజీవి→ మన దేశంలో 75 ఏళ్ళ సుదీర్ఘ నటప్రస్థానం చూసిన ఆర్టిస్ట్ షావుకారు జానకిగారు ఒక్కరే అనుకుంటున్నాను. మా నాన్నగారు హీరోగా నటించిన ‘షావుకారు’తోనే ఆమె షావుకారు జానకిగా సుప్రసిద్ధులయ్యారు. మా బ్యానర్లో పలు చిత్రాల్లో నటించారు. ‘రామ్ – రహీమ్, వేములవాడ భీమకవి’ చిత్రాల్లో షావుకారు జానకిగారితో నటించే అదృష్టం నాకు దక్కింది. – బాలకృష్ణ→ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న నటి శ్రీమతి జానకిగారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 400 చిత్రాల్లో నటించారు. కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు పోషించారు. – పవన్ కళ్యాణ్→ దిగ్గజ నటి షావుకారు జానకిగారి మరణం ఎంతో బాధాకరం. ఆమె హుందాతనం, గౌరవప్రదమైన వ్యక్తిత్వం, అద్భుతమైన నట ప్రస్థానం తరతరాలకూ నిలిచిపోతాయి. ఆమెది ఎంత గొప్ప వ్యక్తిత్వమో నేటి యువత తప్పకుండా తెలుసుకోవాలి. – మంచు విష్ణు → జానకమ్మగారితో కలిసి పని చేసే అవకాశం నాకు లభించడం నా అదృష్టం. బలమైన భావాలున్న మనిషి. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె ఓ లెజెండ్. – రాధిక→ దశాబ్దాల పాటు తన అద్భుతమైన నటనతో కన్నడ, తమిళ, తెలుగు పరిశ్రమలలో ప్రేక్షకులను అలరించి, అందరి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు జానకిగారు. ఆమె నిష్క్రమణతో సినిమా రంగంలో ఒక సువర్ణాధ్యాయం ముగిసింది. – సుమలత అంబరీష్→ ఇండియన్ సినిమా గ్రాండ్ ఓల్డ్ లేడీ.. అత్యంత వృత్తి నైపుణ్యంగల కళాకారిణి అయిన జానకి గారితో కలిసి పని చేయడం నా అదృష్టం. ఆమె తన మాటల్లో ఎంతటి స్పష్టత, పరిపూర్ణతను ప్రదర్శించేవారో, తన పనులను కూడా అంతే అద్భుతంగా చేస్తూనే మాకు కథలు చెప్పేవారు, వంట చేసి వడ్డించేవారు. çముక్కుసూటిగా మాట్లాడేవారు. అమ్మా, మీ ప్రయాణంలో ఒక చిన్న భాగాన్ని పంచుకునే భాగ్యం మాకు కలిగింది. వీడ్కోలు. – నందినీ రెడ్డి– సినిమా డెస్క్ -
తల వంచని తార
మంచి నటి... తొలి చిత్రం ‘షావుకారు’తోనే ఆ విషయాన్ని నిరూపించుకున్నారు జానకి. ఆ సినిమా పేరే ఆమె ఇంటి పేరుగా మారిపోయింది. మంచి వ్యక్తిత్వం... వ్యక్తిగా జానకి మీద చాలామందికి ఉన్న అభి్రపాయం ఇది. ఎలాంటి పరిస్థితుల్లోనూ తల వంచలేదు... తనని తాను తగ్గించుకోలేదు. వెండితెరపై నటిగా ఆమె షావుకారు... తెరవెనక నిజజీవితంలో తొలి దశలో పేదరికాన్ని అనుభవించినా నిఖార్సయిన వ్యక్తిగా ఉన్న జానకి వ్యక్తిత్వపరంగానూ షావుకారే! తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించి, నటనకు నిలువెత్తు నిదర్శనంగా పేరు తెచ్చుకోవడంతో పాటు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ ‘షావుకారు’ ఇక లేరు.‘షావుకారు’ జానకి అసలు పేరు శంకరమంచి జానకి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో 1931 డిసెంబరు 11న శచీదేవి, టేకుమళ్ల వెంకోజీరావు దంపతులకు మూడో సంతానంగా జన్మించారు జానకి. ఆమెకు అన్నయ్య, అక్కయ్యతో పాటు చెల్లి కృష్ణకుమారి తోబుట్టువులు. జానకిది సంప్రదాయ కుటుంబం కావడంతో అమ్మ నుంచి ఆచారాలు, శుచీశుభ్రత అలవడ్డాయి. రాజమండ్రి ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏడో తరగతి వరకు చదువుకున్నారు జానకి. అయితే తండ్రి ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలకు మారుతూ ఉండటం వల్ల ఆమె చదువు సరిగ్గా సాగలేదు. చెన్నై వెళ్లిన తర్వాత ఆంధ్ర మహిళా సభలో జానకిని మెట్రిక్‌లో చేర్పించారు. చిన్నతనంలోనే స్పష్టమైన ఉచ్చారణ, అద్భుతమైన వాక్చాతుర్యంతో ఆకాశవాణి నాటికల ద్వారా కళారంగంలో అడుగుపెట్టారామె. ఓ సారి చెన్నైలో ఆకాశవాణిలో ‘బాలానందం’ అనే ప్రోగ్రామ్‌లో జానకి గాత్రం ప్రముఖ దర్శక–నిర్మాత బి. నాగిరెడ్డికి నచ్చింది. దీంతో ‘నీ గాత్రం బాగుంది. పదాలను చక్కగా ఉచ్చరిస్తున్నావు. సినిమాలో చాన్స్ ఇస్తాను.. నటిస్తావా’ అన్నారట. అసలు నటనంటే ఏంటో తెలియకపోయినప్పటికీ ‘నటిస్తాను’ అని చెప్పేసి ఇంటికొచ్చిన జానకి.. జరిగిన విషయాన్నంతా తల్లిదండ్రులకు చెప్పారు. అయితే జానకిని మందలించి, శంకరమంచి శ్రీనివాసరావుతో వివాహం చేశారు తల్లిదండ్రులు. ఓవర్ కోట్ కప్పుకుని పరీక్షకు వెళ్లి... పెళ్లయినప్పుడు జానకి వయస్సు 15 ఏళ్లు. భర్తతో కలిసి విజయవాడలో కొత్త కాపురం ఆరంభించారామె. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల అస్సాంలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు జానకి. అప్పట్లో జానకి చెల్లి కృష్ణకుమారి చదువుకుంటోంది. తనని చదివిస్తూ, తాను కూడా చదువుకుంటూ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పటికీ ఓవర్ కోట్ కప్పుకుని పరీక్ష రాశారు జానకి. పెళ్లి తర్వాత ఎక్కువ రోజులు పుట్టింట్లో ఉండటం సరి కాదని చెన్నైలోని మేనమామ ఇంటికెళ్లారు. అక్కడే యజ్ఞ ప్రభకి జన్మనిచ్చారు. ఆ సమయంలో బి. నాగిరెడ్డి గతంలో తనకు ఇస్తానన్న సినిమా చాన్స్ గురించి భర్తకు చెప్పి, నటించటానికి ఒప్పించారు. చంకలో పాపాయితో ఆడిషన్స్‌కి... అవకాశం కోసం చంకలో పాపాయి, భర్తతో కలిసి బి. నాగిరెడ్డిని కలిశారు జానకి. పలు ఆడిషన్స్ తర్వాత ‘షావుకారు’ సినిమాలో హీరోయిన్గా తొలి అవకాశం వచ్చింది. మూడు నెలలు ఉన్న యజ్ఞ ప్రభని ఇంట్లో వదిలి ‘షావుకారు’లో నటించారు. ఆ సమయంలో ఓ తల్లిగా ఎంతో మానసిక వేదన అనుభవించారట ఆమె. ఆ సినిమాలో ఎన్టీఆర్‌కి జోడీగా నటించారామె. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో బి. నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించిన ‘షావుకారు’ సినిమా 1950 ఏప్రిల్ 7న విడుదలై మంచి విజయం అందుకుంది. తొలి చిత్రంతోనే అసాధారణమైన అభినయాన్ని కనబరిచి, ఆ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకుని ‘షావుకారు జానకి’గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఐదువందల సినిమాల్లో... ‘షావుకారు’ మూవీ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సుమారు 500 సినిమాల్లో నటించి, ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారామె. ఏడు దశాబ్దాలకు పైగా సాగిన సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు జీవం పోసిన జానకి దక్షిణాది సినిమా చరిత్రలో చెరగని అధ్యాయంగా మిగిలిపోయారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి అగ్ర కథానాయకుల సరసన సుమారు రెండు వందలకు పైగా సినిమాల్లో ఆమె కథానాయికగా నటించడం విశేషం. ‘రోజులు మారాయి, కన్యాశుల్కం, జయం మనదే, పాండురంగ మహత్యం, డాక్టర్ చక్రవర్తి, అక్కాచెల్లెలు, బడిపంతులు, సంసారం ఒక చదరంగం, మంచి మనసులు’ వంటి పలు సినిమాలు జానకి నటనా పటిమకు నిదర్శనాలు. బుల్లితెర పైనా... ‘షావుకారు’ జానకి కేవలం వెండితెరపైనే కాదు... సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించారు. తెలుగులో ‘నీడ, వరూధిని పరిణయం’, తమిళంలో ‘ఊరరింద రహస్యం, పెన్, అక్షయ’ వంటి సీరియల్స్‌లో నటించారు జానకి. వయసు మీద పడుతున్నప్పటికీ నటనపై ఉన్న మక్కువతో విశ్రాంతి తీసుకోకుండా ‘బిస్కోత్’ (తమిళం), ‘అన్నీ మంచి శకునములే’ (తెలుగు) వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారామె. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం ‘అన్నీ మంచి శకునములే’(2023).పద్మశ్రీ జానకిషావుకారు జానకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 2022లో భారత ప్రభుత్వం ఆమెకు దేశంలోని అత్యున్నత ΄ûర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీని ప్రకటించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు నంది అవార్డులు అందుకున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పలు అవార్డులు అందుకున్నారు. పలు సంస్థలు ఆమెను జీవిత సాఫల్య పురస్కారాలతో గౌరవించాయి. అస్సాంలోని గౌహతి యూనివర్సిటీలో మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్న జానకి కళారంగంతో పాటు సామాజిక సేవకు గాను యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనా నుంచి డాక్టరేట్ పొందారు. షావుకారు జానకి మృతితో భారతీయ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు నటీనటులు సంతాపం తెలిపారు.ఇంట్లోకి రానివ్వని బంధువులు సినిమాల్లో వేషాలు వేయడానికి వెళ్లడం... హీరోయిన్గా హీరోలతో తాళి కట్టించుకునే సన్నివేశాలు, డ్యాన్స్ చేయడం.. వీటి వల్ల బంధువులు జానకిని ఇంట్లోకి రానిచ్చేవారు కాదట. ఒకసారి ఇల్లు వెతుక్కునే క్రమంలో చుట్టాల ఇంట్లో నిద్రపోదామని వెళ్తే.. ‘వద్దమ్మా! అంకుల్ ఏదైనా అంటారు. రావద్దు’ అని మొహం మీదే చెప్పారట. కుటుంబంలో ఎవ్వరూ ప్రోత్సహించనప్పటికీ వృత్తి పట్ల అంకితభావంతో పని చేశారు. మూడు ప్రసవాలు జరిగినా కెరీర్‌కు ఎలాంటి ఇబ్బంది రాకుండా సంవత్సరానికి 20 సినిమాలు చేయడం విశేషం. ‘నటిగా నువ్వు పనికి రావు’ అన్న కె. వి. రెడ్డితో ‘పనికి వస్తావు’ అనిపించుకునే స్థాయికి ఎదిగానని ఆమె ఓ సందర్భంలో చెప్పారు. నలుగురు ముఖ్యమంత్రులతో... భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఏ నటికీ దక్కని అరుదైన గౌరవం ‘షావుకారు’ జానకికి దక్కింది. దక్షిణాది రాజకీయాల్లో, సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తులుగా వెలిగిన నలుగురు దిగ్గజ ముఖ్యమంత్రులతో ఆమె వెండితెరను పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎం.జి. రామచంద్రన్, జయలలిత, ఎం. కరుణానిధి... ఇలా నలుగురు సీఎంలతో కలిసి నటించారామె. వ్యక్తిత్వంలోనూ షావుకారే... కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే అలవాటు ఉన్న జానకి దానివల్ల కొన్ని అవకాశాలు కోల్పోయారు. ఈ విషయం గురించి ఓ సందర్భంలో ఆమె చెప్పారు. ‘‘ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరికీ నచ్చదు. కెరీర్ మొదట్లో నాకు నచ్చిన పాత్ర మాత్రమే ఎంచుకునేదాన్ని. పాత్రలో పూర్తిగా లీనమవ్వగలనన్న నమ్మకం ఉన్నప్పుడే అంగీకరించేదాన్ని. కొందరు నాకు పొగరు అన్నారు... కొందరు జానకితో సినిమా కష్టం అనేవారు... నేను మాత్రం అలా ఉండడమే నా వ్యక్తిత్వం అంటాను. అలా ఉండడం వల్ల చాలా అవకాశాలు వదులుకోవాల్సి వచ్చింది. అయినా నేను మాత్రం నా వ్యక్తిత్వాన్ని వదులుకోలేదు. కుటుంబం విషయంలోనూ ఇలానే ఉండేదాన్ని... మా అబ్బాయి 19 ఏళ్ల వయసులో చదువు కోసం అమెరికా వెళ్లాడు. అక్కడే సెటిల్ అయిపోయాడు. తిరిగి రాలేదు. అది అతని వ్యక్తిత్వం... అతని నిర్ణయం. ఇక తల్లిదండ్రులు బతికుండగా పిల్లలకు ఆస్తులు పంచకూడదు. ఏ బంధం శాశ్వతం కాదు. ఓసారి ఆరోగ్యం బాలేనప్పుడు పుట్టింటికి వెళ్లా. అప్పుడు వాళ్లకి నేను భారమని నాకు అనిపించింది. పెళ్లయిన తర్వాత ఏ ఆడపిల్లా పుట్టింటికి వెళ్లకూడదనిపించింది. నా భర్తతో విడాకులు తీసుకున్నాక రెండో పెళ్లి చేసుకోవాలనిపించినా పిల్లల కోసం వద్దనుకున్నాను. గొప్పింట్లో పుట్టినా ఆస్తులన్నీ పోయాయి. పేదరికం వల్లే నేను, నా చెల్లి కృష్ణకుమారి సినిమాల్లోకి వచ్చాం. సంపాదించాం. కుటుంబాలను చూసుకున్నాం’’ అని పేర్కొన్నారామె.ఒంటిపూట భోజనం వెండితెరపై రాణించిన జానకి వ్యక్తిగత జీవితం మాత్రం అంత సజావుగా సాగలేదు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తాను కష్టపడి సంపాదిస్తే, తన భర్త విలాసాల కోసం ఖర్చు చేసేవారని, కొంత కాలానికి ఆస్తులన్నీ కరిగిపోయాయని ఆమె ఆ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నమ్మక ద్రోహానికి కూడా గురయ్యానని బాధపడ్డారామె. ఒక దశలో పిల్లల పెంపకం కూడా కష్టమౌతుందని భావించారామె. అందుకే రోజులో ఒక్క పూట మాత్రమే భోజనం చేశానని ఆమె పేర్కొన్నారు.నో బీపీ... షుగర్‘‘షూటింగ్స్ లేనప్పుడు ఇంటి పనులే నాకు పెద్ద వ్యాయామం’’ అని చెప్పేవారు జానకి. అలాగే తన ఆహారపు అలవాట్ల గురించి ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు పంచుకున్నారు. ‘‘నాకు వంట చేయడం బాగా అలవాటు. స్వీట్స్‌లో అరిసెలంటే ఇష్టం. అయితే అవి తిన్నప్పుడు మిగిలినవి కట్ చేస్తాను. వెన్న, నెయ్యి, పాలు వంటి వాటిని పరిమితంగా తీసుకుంటాను. ఆరోగ్యకరమైన భోజనం రోజుకి ఒక్కసారైనా చాలు. ఆకలి లేకపోతే పండు తిని మంచినీళ్లు తాగి పడుకుంటాను. ఈ అలవాట్ల వల్ల నాకు బీపీ, షుగర్లు లేవు. అయితే రెండు మోకాళ్ళకు ఆపరేషన్ చేయించుకున్నాను. గుండె ఆపరేషన్ అయినా పని చేస్తూనే ఉన్నాను. నాకు దేవుడిపై భక్తి ఉంది. కానీ మూఢనమ్మకాలు లేవు. మంచి ఆలోచనలతో ఉంటే దేవుడు ఇక్కడే ఉన్నాడని నమ్ముతాను’’ అని చెప్పుకొచ్చారు షావుకారు జానకి. -
షావుకారు జానకి కన్నుమూత
దక్షిణాది చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన దిగ్గజ నటి షావుకారు జానకి శుక్రవారం కన్నుమూశారు. ఆమె వయస్సు 94 సంవత్సరాలు. చెన్నై తేనాంపేట సెనటాఫ్ రోడ్డులోని నివాసంలో ఉంటూ వచ్చారు జానకి. బుధవారం రాత్రి ఆమె అస్వస్థతకు గురయ్యారు. వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యల కారణంగా చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. శ్వాస సమస్య తలెత్తడంతో వైద్యులు ఐసీయూలో ఉంచి, ఆమెకు చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారామె. జానకి భౌతిక కాయాన్ని ఆస్పత్రి నుంచి రాత్రి సమయంలో తేనాంపేటలోని స్వగృహానికి తరలించారు. జానకికి ఇద్దరు కుమార్తెలు యజ్ఞ›ప్రభ, సచ్చీరావు, కుమారుడు వెంకటరమణ ఉన్నారు. శనివారం సాయంత్రం బీసెంట్ నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయని షావుకారు జానకి మనవరాలు, నటి వైష్ణవి భర్త అరవింద్ మీడియాకు తెలిపారు.శ్రీదేవి పరిచయం జానకి వల్లే! షావుకారు జానకి వల్లే శ్రీదేవి వెండితెరకు పరిచయం అయ్యారు. వాహిని స్టూడియోస్ వాళ్ళు ఒక పెద్ద సినిమా తీస్తున్నారు. ఆ సమయంలో రాజేశ్వరి (శ్రీదేవి తల్లి) తన ఆరేళ్ల కుమార్తె శ్రీదేవితో కలిసి దూరంగా ఉండి షూటింగ్ చూస్తున్నారు. అప్పుడు ఆ చిత్రంలోని బాల మురుగన్ పాత్రకు ఓ పిల్లాడు కావాలి... అందంగా ఉండాలి... బ్రిలియంట్‌గా ఉండాలని దర్శకుడు చెబుతున్నారు. అది విని, శ్రీదేవిని తీసుకుంటే బాగుంటుందని ఆ దర్శకుడితో జానకి అన్నారు. రాజేశ్వరి కూడా ఒప్పుకున్నారు. మేకప్ టెస్ట్ చేస్తే, అందరూ ఆశ్చర్యపోయేలా బాల మురుగన్ పాత్రకు శ్రీదేవి చక్కగా సరిపోయింది. చిన్న చిన్న డైలాగ్స్ చెప్పమంటే... మంచి హావభావాలతో డైలాగ్స్ చెప్పడం చూసి వెంటనే ఓకే చేసేశారు. అలా శ్రీదేవి పరిచయం జానకి వల్ల జరిగింది.ఉచితంగా నాటకాలువెండితెరపై ఓ వెలుగు వెలుగుతున్నప్పటికీ నాటకాల మీద మక్కువ మాత్రం పోలేదు షావుకారు జానకికి. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, పైసా కూడా తీసుకోకుండా సుమారు 300 నాటకాలు చేశారామె. అప్పట్లో కె. బాలచందర్ రచన, దర్శకత్వం వహించిన పలు నాటకాల్లోనూ వేషాలు వేశారు. -
షావుకారు జానకి సిస్టర్స్.. ఆ ఒక్కటీ చేయకలేకపోయారు..!
ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి ఇవాళ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరిన ఆమె.. తుదిశ్వాస విడిచారు. తెలుగు వెండితెరపై తనదైన ముద్రవేసిన షావుకారు జానకి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించి స్టార్‌గా ఎదిగారు. ఇవాళ ఆమె మరణంతో సినీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.జానకమ్మ మరణం వేళ జానకమ్మకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో జానకి పేరు మార్మోగింది. అప్పటి స్టార్ హీరోలందరితో ఆమె సినిమాలు చేసింది. అయితే ఆమెతో పాటే సొంత చెల్లెలు కృష్ణకుమారి సైతం హీరోయిన్గా రాణించారు. ఒకప్పుడు వీళ్లిద్దరే తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్స్ హీరోయిన్లుగా ఎదిగారు.(ఇది చదవండి: షావుకారు జానకి.. తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?)కేవల ఏడాది గ్యాప్‌లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అక్కాచెల్లెళ్లు దశాబ్దాల పాటు సినిమాల్లో కొనసాగారు. కానీ విచిత్రం ఏంటంటే.. ఈ సిస్టర్స్ తమ కెరీర్లో ఒక్కసారి కూడా కలిసి ఏ ఒక్క మూవీలోనూ నటించలేదు. షావుకారు జానకి తమిళ చిత్రాల వైపు దూసుకెళ్లగా.. కృష్ణకుమారి తెలుగులో స్టార్ హీరోయిన్గా రాణించారు. వ్యక్తిగత జీవితం, సినీ కెరీర్‌ను వేర్వేరుగా ఉంచాలనే విధానం.. 1976లో కృష్ణకుమారి సినిమాలకు గుడ్ బై చెప్పడంతో అక్కాచెల్లెళ్లను ఒకే తెరపై చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కలేదు. కాగా.. కృష్ణకుమారి 2018లోనే కన్నుమూశారు. -
షావుకారు జానకి మృతిపై YS జగన్ దిగ్భ్రాంతి
-
షావుకారు జానకి.. తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?
మరో దిగ్గజ సినీతార నింగికెగిసింది. దశాబ్దాల పాటు అభిమానులను మెప్పించిన అలనాటి కథానాయిక కథ ఇక ముగిసింది. దాదాపు 400లకు పైగా చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించిన నాట్య మయూరి ఇక సెలవు తీసుకుంది. తెలుగు వెండితెరపై తనదైన ముద్రవేసిన సీనియర్ నటి షావుకారు జానకి ఇవాళ తుదిశ్వాస విడిచింది. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆమె శాశ్వత నిద్రలోకి జారుకుంది.ఈ విషాద సమయంలో జానకి గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. దాదాపు ఏడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలిన ఆమె ఎన్నో అవార్డులు అందుకున్నారు. నంది అవార్డులతో పాటు ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారానికి కూడా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆమె నటించిన తొలి సినిమాకు ఎంత పారితోషికం తీసుకున్నారనే టాపిక్ ఆసక్తిగా మారింది.షావుకారు జానకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది షావుకారు మూవీనే. అందుకే ఆ సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ హీరోగా నటించారు. ఈ మూవీకి గానూ జానకికి రూ.2500 రూపాయలు ఇచ్చారని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అప్పట్లో ఆర్థికంగా చితికిపోతున్న రోజుల్లో నాకు రెండన్నర్ర లక్షలుగా కనపడిందని జానకి పేర్కొంది. ఇది నాకు ఓ వరంలాగా అనిపించిందని జానకి వెల్లడించింది. -
ప్రముఖ నటి షావుకారు జానకి లాస్ట్ ఇంటర్వ్యూ
-
డాక్టరేట్ షావుకారు జానకి.. అసలు ఆమె ఏం చదివారో తెలుసా?
ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి ఇవాళ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరిన ఆమె.. తుదిశ్వాస విడిచారు. తెలుగు వెండితెరపై తనదైన ముద్రవేసిన షావుకారు జానకి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించి స్టార్‌గా ఎదిగారు. ఇవాళ ఆమె మరణంతో సినీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.జానకమ్మ మరణం వేళ జానకమ్మకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆమె తన సినీ ప్రయాణంలో ఎన్నో అవార్డులు, డాక్టరేట్స్ కూడా అందుకున్నారు. రెండు నంది అవార్డులతో పాటు భారత ప్రభుత్వం అందించే పద్మశ్రీ కూడా ఆమెను వరించింది. అలా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న జానకి.. చదవింది కేవలం మెట్రిక్యులేషన్ మాత్రమేనని తెలుస్తోంది.గతంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన జానకి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. తనకు ఎన్నో డాక్టరేట్స్ వచ్చినప్పటికీ నేను కేవలం మెట్రిక్యులేషన్ మాత్రమే చదువుకున్నానని తెలిపింది. అస్సాంలోని గౌహతి యూనివర్సిటీలో చదివినట్లు పేర్కొంది. ఆమె చదివింది కేవలం మెట్రిక్యులేషన్ మాత్రమే అయినప్పటికీ.అరిజోనా యూనివర్సిటీ నుంచి ఆమె డాక్టరేట్ అందుకున్నారు. -
అతిలోక సుందరిని పరిచయం చేసిన జానకి
ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి ఇవాళ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరిన ఆమె.. తుదిశ్వాస విడిచారు. తెలుగు వెండితెరపై తనదైన ముద్రవేసిన షావుకారు జానకి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించి స్టార్‌గా ఎదిగారు. ఇవాళ ఆమె మరణంతో సినీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.జానకమ్మ మరణం వేళ జానకమ్మకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. దివంగత నటి శ్రీదేవిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది జానకమ్మ గారే. ఆరేళ్ల వయసులోనే బాలనటిగా శ్రీదేవిని వెండితెరపైకి తీసుకొచ్చింది. ఓ సినిమా షూటింగ్లో రాజేశ్వరి(శ్రీదేవి అమ్మ) పాపను పట్టుకుని దూరంగా నిలబడి చూస్తున్నారు.అదే సమయంలో డైరెక్టర్ మురుగన్ ఓ చిన్న పిల్లాడు కావాలని అడిగారు. దీంతో నేను వెంటనే శ్రీదేవి తీసుకుందామని రాజేశ్వరితో చెప్పా.. ఆమె వెంటనే ఒప్పుకున్నారు. మేకప్ వేశాక బాల మురుగన్ పాత్రకు శ్రీదేవి చక్కగా సరిపోయింది. చిన్న చిన్న డైలాగ్‌లు చెప్పమంటే.. ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ, తను చెప్పడం చూసి, మరో ఆలోచన లేకుండా ఓకే చేశారు. -
షావుకారు జానకి మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటు: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: ప్రముఖ సీనియర్ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత షావుకారు జానకి కన్నుమూతపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. ఏడు దశాబ్దాలకు పైగా సాగిన తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి సినీ ప్రేక్షకుల హృదయాల్లో షావుకారు జానకి గారు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి దిగ్గజ నటుల సరసన కథానాయికగా నటించడంతో పాటు, తదనంతరం తల్లి, అమ్మమ్మ, నానమ్మ వంటి విభిన్న పాత్రల్లోనూ తన సహజ నటనతో ప్రేక్షకులను మెప్పించారని గుర్తుచేశారు.భారతీయ చలనచిత్ర రంగానికి షావుకారు జానకి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందని, నంది అవార్డులతో పాటు అనేక పురస్కారాలు ఆమె ప్రతిభకు దక్కిన గౌరవాలని వైఎస్ జగన్ పేర్కొన్నారు. షావుకారు జానకి మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొంటూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ పరిశ్రమకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.👉ఇదీ చదవండి: ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత -
శోకసంద్రంలో టాలీవుడ్ ప్రముఖ నటి షావుకారు జానకి (94) కన్నుమూత
-
జానకమ్మ మరణం.. టాలీవుడ్ సినీతారల నివాళి
ఫ్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి మరణవార్తపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు. ఆమె మనల్ని విడిచివెళ్లడం ఎంతో బాధ కలిగించిందన్నారు. తెలుగు సినీ చరిత్రలో తనదైన ముద్రవేసిన ఆమెను కోల్పోవడం మనకు తీరని లోటు అన్నారు. జానకమ్మ సినీ ప్రయాణం, ఆమె పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచే ఉంటాయన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ… ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ ట్వీట్ చేశారు.షావుకారు జానకి గారి మరణం ఎంతో బాధాకరమని మా అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ఆమె హుందాతనం, గౌరవప్రదమైన వ్యక్తిత్వం, అద్భుతమైన నట ప్రస్థానం తరతరాలకూ ఆదర్శంగా నిలిచిపోతాయని తెలిపారు. నేటి యువత ఆమె ఎంత గొప్ప వ్యక్తిత్వమో తప్పక తెలుసుకోవాలని అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పద్మశ్రీ షావుకారు జానకి గారు ఇక లేరనే వార్త ఎంతో బాధ కలిగించిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆమె మృతి పట్ల తన సంతాపం ప్రకటంచారు. షావుకారు చిత్రంతో మొదలైన ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానం తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో దాదాపు ఏడు దశాబ్దాలపాటు కొనసాగిందని తెలిపారు. వైవిధ్యమైన పాత్రలకు తన సహజమైన నటనతో ప్రాణం పోసి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటి అని కొనయాడారు. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని ప్రశంసించారు. షావుకారు జానకి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు చిరంజీవి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.షావుకారు జానకి అమ్మగారి మరణవార్త విని ఎంతో బాధపడ్డానని నటి రాధిక శరత్ కుమార్ అన్నారు. ఆమె దృఢ సంకల్పం కలిగిన, స్వతంత్ర భావాలున్న, కొత్త ఒరవడిని సృష్టించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. నా తండ్రి శ్రీ రాధా గారికి సన్నిహిత మిత్రురాలిగా ఉంటూ.. పరస్పరం ఎంతో గౌరవాభిమానాలు కలిగి ఉన్న ఆమెతో పరిచయం, కలిసి పనిచేసే అవకాశం నాకు లభించిందని అన్నారు. తెలుగు మరియు భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకి గారి మరణవార్త ఎంతో బాధ కలిగించింది.జానకి గారి సినీ ప్రయాణం, ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి.వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. 🙏— Jr NTR (@tarak9999) August 21, 2026 -
ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత
దక్షిణాది సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సీనియర్ నటి షావుకారు జానకి(94) తీవ్ర అనారోగ్యంతో కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. ఏడు దశాబ్దాలకు పైగా సాగిన సుదీర్ఘ సినీ ప్రయాణంలో కథానాయికగా, ఆర్టిస్టుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు జీవం పోసిన ఆమె.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రసీమల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్నారు. షావుకారుతో మొదలైన ఆమె నట ప్రస్థానం.. వందలాది పాత్రలతో సాగి.. దక్షిణాది సినిమా చరిత్రలో చెరగని అధ్యాయంగా మిగిలిపోయింది. ఆమె మరణంతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. రాజమండ్రిలో జననం..1931 డిసెంబరు 12న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించిన జానకి అసలు పేరు శంకరమంచి జానకి. చిన్న వయసులోనే కళలపై ఆసక్తి పెంచుకున్న ఆమె రేడియో నాటికల ద్వారా తన కళా ప్రయాణాన్ని ప్రారంభించారు. అనంతరం సినిమాల్లోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా కథానాయికగా ఎదిగారు.‘షావుకారు’తో గుర్తింపుదర్శకుడు ఎల్.వి. ప్రసాద్ తెరకెక్కించిన ‘షావుకారు’ (1950) చిత్రంతో జానకి వెండితెరకు పరిచయమయ్యారు. ఆ సినిమాలో ఆమె పోషించిన పాత్రతో ‘షావుకారు జానకి’గా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అనంతరం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి దక్షిణాది చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్‌తో..తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించిన జానకి.. తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్ తదితర ప్రముఖ నటులతో కలిసి పనిచేశారు. ‘రోజులు మారాయి’, ‘కన్యాశుల్కం’, ‘జయం మనదే’, ‘పాండురంగ మహత్యం’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘అక్కాచెల్లెలు’, ‘బడిపంతులు’, ‘సంసారం ఒక చదరంగం’ తదితర చిత్రాలు ఆమెకు గుర్తింపును తీసుకొచ్చాయి. ఇలా ఏడు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రయాణంలో షావుకారు జానకి దాదాపు 400 పైగా చిత్రాల్లో నటించారు.ప్రతిష్ఠాత్మక పురస్కారాలునటనకు గాను జానకి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి కళైమామణి, ఆంధ్రప్రదేశ్ నుంచి నంది పురస్కారాలు, ఇతర జీవిత సాఫల్య పురస్కారాలు ఆమెను వరించాయి. 2022లో భారత ప్రభుత్వం ఆమెకు దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీని ప్రకటించింది. -
సీనియర్ నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత
ప్రముఖ సీనియర్ సినీ నటి షావుకారు జానకి (95) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారం రోజుల క్రితం శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అయితే బుధవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు.కాగా.. 1950ల్లో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కథానాయికల్లో షావుకారు జానకి ఒకరు. 'షావుకారు' సినిమాతో పరిచమైన ఆమెకు సినిమా పేరే ఇంటి పేరుగా మార్చుకున్నారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చిన ఆమె అద్భుతమైన వాయిస్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. అప్పటి నుంచి నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె తెలుగుతో పాటు తమిళంలో సైతం హీరోయిన్గా రాణించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇప్పటికీ పలు సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. -
15 ఏళ్లకే పెళ్లి.. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు.. సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్న నటి!
-
అలాంటి ఆడవాళ్లను షూట్ చేసి పడేయాలి..!
-
వీరప్పన్, కన్నడ రాజ్ కుమార్ ని అలా చూసుకున్నాడు: సౌకా జానకి
-
ఎన్టీఆర్, కృష్ణ కుమారి మీద నాకు ఎప్పుడు అనుమానం రాలేదు ..!
-
అతి మంచితనం కూడా మంచిది కాదు .. చాలా నష్టపోయాను
-
15 ఏళ్లకే పెళ్లి చేసి పంపించేశారు.. చాలా కష్టాలు పడ్డాను
-
నువ్వు దేనికి పనికిరావు అన్నాడు... దాంతో నేనేంటో చూపించాను
-
సినిమాలో చేసిన సీన్స్ చూసి మా ఆయన ఫీల్ అయ్యాడు..!
-
ఏ ఆడది చేయకూడని తప్పు చేశాను.. ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
-
ఇప్పుడు అందరికీ డబ్బుమీదనే ఆశ : సౌకార్ జానకి
-
నా సొంత కొడుకు నన్ను గాలికి వదిలేసాడు: సౌకార్ జానకి
-
ఆ క్షణం కి రెండో పెళ్లి చేసుకోవాలని ఆలోచన వచ్చింది
-
ఎన్టీఆర్ కుటుంబం చూసి నాకు చాలా భయమేసింది..!
-
అడుక్కుతినే పరిస్థితికి మాత్రం నేను రాకూడదు: సౌకార్ జానకి
-
11 మంది పిల్లలు ఉన్నవాడికి మా చెల్లెల్ని ఇచ్చి ఎలా పెళ్లి చేస్తాం..
-
రామారావుతో చేయలేని పనులు నాగేశ్వర్ రావుతో చేసేదాన్ని
-
ఆ రోల్స్ వల్లే నా భర్త బాధ పడ్డాడు..
-
కృష్ణ కుమారి విషయంలో ఎన్టీఆర్ ని నిలదీశారా..?
-
ఆస్తులన్ని పోయాయి, ఒక్క పూట భోజనమే చేసేదాన్ని: ‘షావుకారు’ జానకి
Sowcar Janaki About Her Divorce And Assets: 1950ల్లో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కథానాయికల్లో షావుకారు జానకి ఒకరు. 'షావుకారు' సినిమాతో పరిచమైన ఆమెకు సినిమా పేరే ఇంటి పేరుగా మార్చుకున్నారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చిన ఆమె అద్భుతమైన వాయిస్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. అప్పటి నుంచి నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె తెలుగుతో పాటు తమిళంలో సైతం హీరోయిన్గా రాణించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇప్పటికీ పలు సినిమాల్లో నటించిన ఆమె గతకొద్ది రోజులుగా ఎలాంటి సినిమాలు చేయడం లేదు. చదవండి: బర్త్‌డే రోజే బాత్రూమ్లో విగతజీవిగా మోడల్, భర్తే చంపాడా? ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆమె తాజాగా ఓ యూట్యూబ్‌లో చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తెలుగు పరిశ్రమ తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదని, తనని పక్కన పెట్టేశారని ఆమె బాధపడినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమెకు దీనిపై ప్రశ్న ఎదురవగా.. అలాంటిది ఏం లేదని, తనకు తెలుగులో మంచి ఆఫర్స్ వచ్చాయన్నారు. ఈ వార్తల్లో నిజం లేదని, ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో కలిసి చేసిన ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయని ఆమె పేర్కొన్నారు. అనంతరం భర్తతో విడాకులపై ఆమె స్పందించారు. తాను సంపాదించిదంతా తన భర్త నాశనం చేశాడని చెప్పారు. ‘నేను కష్టపడి సంపాదిస్తుంటే. మా ఆయన ఆ డబ్బును తాగుడు, వ్యసనాలకు వృధా చేసేవాడు. కొంతకాలానికి చూస్తే ఆస్తులన్ని కరిగిపోయాయి. పిల్లల పేరు మీద కొన్న ఆస్తులు కూడా పోయాయి. ఎంతో నమ్మ ద్రోహానికి గురయ్యా. ఇప్పుడు అవన్ని ఉంటే కొన్ని వందల, వేల కోట్లు ఉండేవి. ఇక ఆయనతో ఉంటే పిల్లలను పెంచే పరిస్థితి కూడా ఉండదేమోనని నిర్ణయించుకున్న. అందుకే విడాకులు తీసుకున్నా’ అని ఆమె చెప్పారు. చదవండి: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లి డేట్ ఫిక్స్ అంతేగాక ‘సినిమాలు చేస్తూ చాలా కష్టపడ్డాను. డబ్బు ఉంటే రియల్ ఎస్టేట్‌లో పెట్టేదాన్ని. ఎక్కడ పడితే అక్కడ స్థలాలు కొన్నాను. కానీ మా ఆయన తన తాగుడు కోసం ఆస్తులు అమ్ముతూ వచ్చాడు. కనీసం నా గురించి, పిల్లల గురించి కూడా ఆలోచించలేదు. ఆయన వల్ల కుటుంబం విచ్ఛిన్నం అయ్యే పరిస్థితి వచ్చింది. అంత కష్టపడుతూ కూడా నేను ఒక్క పూట భోజనం చేసిన రోజులు కూడా ఉన్నాయి’ అంటూ షావుకారు జానకి చెప్పుకొచ్చారు. -
బౌండరీలు దాటే మనస్సు నాదీ... సెంచరీలు కొట్టే వయస్సు నాది
శంకరమంచి జానకి... షావుకారు చిత్రంతో ఇంటిపేరు మారిపోయింది.. తొమ్మిది పదులు నిండినా ఇప్పటికీ తన పని తనే చలాకీగా చేసుకుంటున్నారు.. 74 సంవత్సరాల క్రితం నటించిన షావుకారు చిత్రంలోని డైలాగులను నిద్రలో లేపి అడిగినా నేటికీ ఒప్పచెబుతున్నారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆవిడ ఎంత యాక్టివ్‌గా ఉన్నారో! వయసు తన శరీరానికే కానీ, తన మనస్సు మాత్రం బౌండరీలు దాటుతోందంటున్న షావుకారు జానకి తన ఆరోగ్య రహస్యాలను సాక్షితో పంచుకున్నారు. ఆ వివరాలు ఆవిడ మాటల్లోనే... నేను బ్రిటిషు వారి పరిపాలనా కాలంలో.. 1931 డిసెంబరు 11న తూ. గో. జిల్లా రాజమండ్రిలో పుట్టాను. మాది చాలా ఆచారవంతుల కుటుంబం. అమ్మ శచీదేవి, నాన్న టేకుమళ్ల వెంకోజీరావు. అమ్మ పద్ధతులు, శుభ్రత అన్నీ అలవడ్డాయి. నాకు ఇప్పుడు 89 పూర్తయ్యి 90కి వచ్చాను. నా కంటె ముందు అన్నయ్య, అక్కయ్య, నా తరవాత, చెల్లి కృష్ణకుమారి. అక్కయ్య చాలా చిన్నతనంలోనే కన్నుమూసింది. రాజమండ్రి ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏడో తరగతి వరకు చదువుకున్నాను. నాన్న ఉద్యోగరీత్యా చాలా రాష్ట్రాలకు మారుతుండటం వల్ల నా చదువు సరిగ్గా సాగలేదు. నాన్న హిందూ పేపర్ చదవటం అలవాటు చేశారు. మద్రాసు ఆంధ్ర మహిళా సభలో మెట్రిక్‌లో చేర్పించారు. క్రమేపీ తెలుగు రాయటం, మాట్లాడటం నేర్చుకున్నాను. బాల్య వివాహం... పదిహేను సంవత్సరాలకే పెళ్లి చేసేశారు. మద్రాసు ఆకాశవాణిలో బాలానందం ప్రోగ్రామ్ లో నా గొంతు విన్న బి.ఎన్. రెడ్డి గారు నన్ను పిలిపించి, ‘సినిమాలో చేస్తావా’ అన్నారు. ఏమీ తెలియక పోయినా ‘చేస్తాను’ అనేసి, ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పాను. నాన్న చీవాట్లు పెట్టి, శంకరమంచి శ్రీనివాసరావుతో నాకు పెళ్లి చేసేశారు. ఆ తరవాత నాన్నగారు బదిలీ మీద అస్సాం వెళ్లిపోయారు. విజయవాడలో కొత్త కాపురం... మేం విజయవాడ సత్యనారాయణపురంలో కాపురం పెట్టాం. అయితే ఆయనకు సంపాదన అంతగా లేక పోవడంతో క్రమేపీ మాకు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దాంతో మమ్మల్ని అస్సాం రమ్మన్నారు నాన్న. అక్కడ కొన్నాళ్లు ఉన్నాం. పెళ్లి అయ్యాక పుట్టింట్లో ఉండటం ఇబ్బందిగా అనిపించింది. అప్పట్లో మా చెల్లి కృష్ణకుమారి చదువుకుంటోంది. ఊరికే కూర్చోలేక, తనని చదివిస్తూ, నేను ప్రైవేట్‌గా పరీక్ష రాశాను. అప్పుడు నాకు పదిహేడు సంవత్సరాలు. నిండు నెలలు, ఓవర్‌కోట్ కప్పుకుని పరీక్ష రాశాను. షావుకారు ఇంటి పేరుగా మారింది.. ఎక్కువ రోజులు పుట్టింట్లో ఉండటం మర్యాద కాదని, మద్రాసు మా మేనమామ ఇంటికి చేరాం. అక్కడే నాకు పెద్దమ్మాయి యజ్ఞ ప్రభ పుట్టింది. ఒక రోజున మా వారితో, గతంలో నాకు వచ్చిన సినిమా అవకాశం గురించి చెప్పి, నేను నటించటానికి ఒప్పించి, బిఎన్ రెడ్డిగారిని కలిశాను. చేతిలో పాపాయి, పక్కన మా వారు. ఆయనకు నా కళ్లల్లో మా ఇబ్బంది కనిపించి, వారి తమ్ముడు తీస్తున్న ‘షావుకారు’ చిత్రం గురించి చెప్పారు. ఎన్నో పరీక్షల తరవాత ఆ చిత్రంలో హీరోయిన్ అవకాశం వచ్చింది. అప్పటి నుంచి షావుకారు జానకి అయ్యాను. షావుకారు íసినిమాలో బాగా చేస్తేనే నిలదొక్కుకోగలను అనుకున్నాను. ఇంట్లో మూడు నెలల పాపను వదిలి, తల్లిగా మానసిక వేదన అనుభవిస్తూ, ఆ సినిమా చేశాను. ఆ సినిమాకు 2500 రూపాయలు పారితోషికం. అలా కుటుంబం కోసం సినిమాలలోకి ప్రవేశించాను. నాలుగు కాలాల పాటు ఉండే పాత్రలు చేస్తూ, ‘నువ్వు పనికిరావు’ అన్న కె. వి. రెడ్డిగారితో ‘పనికి వస్తావు’ అనిపించుకునే స్థాయికి ఎదిగాను. శివాజీ గణేశన్ గారి ప్రోద్బలంతో పుదియ పరవై అనే తమిళ చిత్రంలో గ్లామర్ రోల్ చేసి, అందరి ప్రశంసలు అందుకున్నాను. బాలచందర్ నాటకాలలో... 500 సినిమాలు చేసినా, నాటకాల మీద వ్యామోహం పోలేదు. సినిమాలలో చేస్తూనే, పైసా కూడా తీసుకోకుండా 300 నాటకాలు చేశాను. అప్పట్లో కె. బాలచందర్ రచన, దర్శకత్వం వహించిన నాటకాలలో కూడా వేశాను. కలైమామణి అవార్డు, అరిజోనా యూనివర్సిటీ డాక్టరేట్ కూడా అందుకున్నాను. సంవత్సరానికి 20 సినిమాలు చేశాను ‘ఈ రోజు ఎంత ఆనందంగా ఉన్నానో, ప్రతిరోజూ ఇలాగే గడవనీ’ అని దేవుడికి దండం పెట్టుకుంటాను. మా కుటుంబం నుంచి ఎవ్వరూ నన్ను ప్రోత్సహిం^è కున్నా, వృత్తి పట్ల అంకితభావంతో పనిచేశాను. నా కష్టాలు ఎవ్వరికీ తెలియనివ్వలేదు. మూడు ప్రసవాలు జరిగినా కెరీర్ కు ఇబ్బంది రాకుండా సంవత్సరానికి 20 సినిమాలు చేశాను. ఉదయమే దేవుడికి దండం పెట్టుకుని, కాఫీ, బ్రెడ్ తీసుకున్నాక, పేపర్ చదువుతాను. ఇప్పుడు కాఫీ మానేసి, వేడినీళ్లు, తేనె, శొంఠి పొడి, జీలకర్ర పొడి కలిపిన నీళ్లు తాగుతున్నాను. ఆరోగ్యకరమైన భోజనం తింటాను. ఎవరినీ బాధపెట్టను. గౌరవంగా, మర్యాదగా, తృప్తిగా బతకడానికి ఎంత డబ్బు కావాలో అంతే కావాలి అని కోరుకుంటాను. వీలైతే సహాయం చేస్తూంటాను. పబ్లిసిటీ, ఆర్భాటం ఇష్టం లేదు. ఇంటిపనే నాకు పెద్ద వ్యాయామం నాకు వంట బాగా అలవాటు. స్వీట్లలో అరిసెలు ఇష్టం. ఇవి తినాలంటే మిగిలినవి కట్ చేసేస్తాను. పెరుగు, అరటి పండు, ఒక కూర/పప్పు/ చారు/పులుసు ఏదో ఒకటి మాత్రమే. వెన్న, నెయ్యి, పాల వంటివి పరిమితంగా తింటాను. ఆరోగ్యకరమైన భోజనం çరోజుకొకసారి చాలు. ఆకలి లేకపోతే పండు తిని, మంచినీళ్లు తాగి పడుకుంటా. ఈ అలవాట్ల వల్ల నాకు సుగర్, బీపీలు లేవు. రెండు మోకాళ్లకు ఆపరేషన్ చేయించుకున్నాను. గుండె ఆపరేషన్ అయినా పని చేస్తూనే ఉన్నాను. సినిమాలు లేకపోయినా ఇంటి పనే నాకు పెద్ద వ్యాయామం. దేవుడి మీద భక్తి ఉంది. మూఢ నమ్మకాలు లేవు. మంచి ఆలోచనలతో ఉంటే దేవుడు ఇక్కడే ఉన్నాడని భావిస్తాను. మాట వెనక్కు తీసుకుంటానన్నారు.. పుల్లయ్యగారి దర్శకత్వంలో ‘వెంకటేశ్వర మహాత్మ్యం’లో ఎరుకలసాని వేషం వేసే అవకాశం వచ్చింది. సాయంత్రం షూటింగ్ అయితే, మధ్యాహ్నం చెప్పారు. నేను భయపడ్డాను. పుల్లయ్యగారు ధైర్యం చెప్పి, నాకు ట్రయినింగ్ ఇచ్చారు. పదిహేను నిమిషాల పాత్ర. చెప్పింది చెప్పినట్లుగా నేర్చుకున్నాను. ఆ సినిమా చూసిన కె. వి. రెడ్డిగారు తన మాటను వెనక్కు తీసుకుంటాను అన్నారు. ఎంతో సంతోషించాను. అదే నాకు నిజమైన సినిమా అనుకుంటాను ఇప్పటికీ. – సంభాషణ: వైజయంతి పురాణపండ -
షావుకారు జానకి @ 400
నలుపు తెలుపు చిత్రాల నుంచి రంగుల చిత్రాల వరకూ చేసిన తారల్లో అలనాటి తార షావుకారు జానకి ఒకరు. కథానాయికగా ఒకప్పుడు వెండితెరను ఏలిన జానకి ఇప్పుడు బామ్మ పాత్రలు చేస్తున్నారు. ఆమె సినీ మైలురాయి 400వ చిత్రానికి చేరుకుంది. తమిళ హాస్యనటుడు సంతానం హీరోగా కన్నన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బామ్మ కస్తూరి పాత్రలో నటిస్తున్నారు జానకి. ఇది ఆమెకు 400వ చిత్రం కావడం విశేషం. ‘‘జానకిగారి ల్యాండ్ మార్క్ మూవీ మా చిత్రం కావడం సంతోషంగా ఉంది. ఆమె ఎంతటి ప్రతిభాశాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మా చిత్రకథ, పాత్ర నచ్చి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. -
షావుకారు జానకి @400
సినిమా: 400 చిత్రాలు ఒక గొప్ప సాధన. ఈ సాధనకు అర్హురాలు ఎవరో కాదు షావుకారు జానకినే. తెలుగులో షావుకారు చిత్రంతో నాయకిగా పరిచయం అయ్యి తొలి చిత్రంతోనే తనదైన ముద్రవేసుకుని షావుకారు జానకీగా ప్రసిద్ధికెక్కారు. ఇక తమిళంలో పార్త జ్ఞాపకం ఇలైయో పాట వింటే ముందుగా జ్ఞాపకం వచ్చేది షావుకారు జానకినే. కోలీవుడ్‌లో వళైయాపతి అనే చిత్రం ద్వారా 1952లో పరిచయం అయిన షావుకారు జానకి ఆపై తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ అంటూ పలు భాషల్లో నటించేస్తూ ఇప్పటికీ నాటౌట్‌గా రాణిస్తున్నారు. ఎంజీఆర్, శివాజీగణేశన్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, జెమినీ గణేశన్, నాగేశ్, శ్రీకాంత్, ఏవీఎం రాజన్ వంటి ప్రఖ్యాత నటులతో కలిసి నటించిన ఘనత షావుకారు జానకిది. అయితే వీళ్లలో శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, శ్రీకాంత్‌లతో ఎక్కువ చిత్రాల్లో నటించారు. శివాజీగణేశన్‌కు జంటగా నటించిన పుదియపార్వై చిత్రంలోని పార్త జ్ఞాపకం ఇలైయో అనే పాట నేటికీ అజరామరంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయ్యింది. ఆ పాట షావుకారు జానకి చాలా పెద్ద గుర్తింపును తెచ్చిపెట్టింది. అదే విధంగా జెమినీ గణేశన్‌తో నటించిన భాగ్యలక్ష్మీ చిత్రంలోని మాలై పొళుదిన్ మయక్కత్తిలే అనే పాటలో భర్తను కోల్పోయిన భార్యగా తన భావోద్రేకాలను ప్రదర్శించిన విధం అందరినీ ఆకట్టుకుంటుంది. జయలలిత, సరోజాదేవి, కేఆర్.విజయ, జయంతీ, వాణీశ్రీ వంటి వారితో పాటు హాస్యనటి సచ్చు వంటి నటీమణులతోనూ నటించి మెప్పించారు. కాగా సినిమాల్లోకి రాక ముందు ఆకాశవాణిలో 300లకు పైగా నాటకాల్లో పాలు పంచుకున్నారు. శ్రీకాంత్‌తో కలిసి పలు నాటకాలు ఆడారు. ఇరు కోడుగళ్ చిత్రంలో నటనకు గానూ రాష్ట్రప్రభుత్వ అవార్డును, ఫిలిం ఫేర్, సైమా సంస్థల నుంచి జీవిత సాఫల్య అవార్డులను అందుకున్నారు. అదే విధంగా ఎంజీఆర్ అవార్డు, ఆంధ్ర రాష్ట్రం అందించే ప్రతిష్టాత్మక నంది అవార్డుతోనూ గౌరవించబడ్డారు. కమలహాసన్‌తో నటించిన హే రామ్ చిత్రం తరువాత 14 ఏళ్లు గ్యాప్ తీసుకుని తమిళంలో వానవరాయన్ వల్లవరాయన్ చిత్రంతో రీ ఎంట్రీ అయ్యారు. అప్పుటి నుంచి ప్రాముఖ్యత కలిగిన పాత్రల్లో నటిస్తున్న షావుకారు జానకీ నాలుగు సెంచరీలు కొట్టారు. అవును ఈ ప్రఖ్యాత నటి తాజాగా ఆర్.కన్నన్ దర్శకత్వంలో వినోదభరిత పాత్రను పోషిస్తున్నారు. ఇది షావుకారు జానకి నటిస్తున్న 400వ చిత్రం అవుతుంది. సంతానం కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. -
ఈ ఉద్యమాలతో ఏం సాధిస్తారు?
‘‘నేను స్త్రీవాదినే. కాకపోతే ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న ‘మీటూ’ ఉద్యమమంతా రబ్బిష్ (చెత్త) ’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటి షావుకారు జానకి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇలా పేర్కొన్నారామె. ఓ తమిళ చానెల్ ఇంటర్వ్యూలో ‘మీటూ’ గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘కొన్ని రోజులుగా టీవీల్లో, పేపర్స్‌లో ‘మీటూ’ గురించే వార్తలు వస్తున్నాయి. ఎప్పుడో ఇలాంటి ఓ పనికి అంగీకరించి ప్రస్తుతం ప్రమోషన్ కోసం దానిని వాడుకుంటున్నారు. ఇలాంటి పనుల వల్ల మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పరువు పోవడం తప్ప ఏం లేదు. ఇలాంటి ఉద్యమాలతో ఏం సాధిస్తారు? చీప్ పబ్లిసిటీ కోసం ఎప్పుడో జరిగినవాటి గురించి, లేదా జరగని వాటి గురించిన ఆరోపణలు చేస్తున్నారు వీళ్లంతా’’ అని పేర్కొన్నారు షావుకారు జానకి. -
గీత స్మరణం
పల్లవి : ఓహో ఓహో... ఓహో ఓహో పావురమా... వయ్యారి పావురమా (2) మావారి అందాలు నీవైన తెలుపుమా (2) ॥ఓహో॥ చరణం : 1 మనసు మధురమైనది మమతలు నిండినది సొగసు నేనెరుగనిది చూడాలని ఉన్నది ॥ అరువుగ నీ కనులు కరుణతో ఇవ్వగలవా? (2) కరవుతీర ఒక్కసారి కాంతునమ్మ వారినీ ॥ఓహో॥ చరణం : 2 వలపుకన్న తీయని పలుకులు వారివి తలచుకున్న చాలును పులకరించు నా మేను ॥ మగసిరి దొరయని మరునికి సరియని (2) అందరు అందురే అంత అందమైనవారా ఓహో ఓహో॥ చరణం: 3 అందరి కన్నులు అయ్యగారి మీదనే దిష్టి తగలగలదనీ తెలిపిరమ్మ కొందరు ॥ అన్నది నిజమేనా అల్లిన కథలేనా (2) కన్నులున్న నీవైనా ఉన్నమాట చెప్పుమా ఓహో ఓహో॥ చిత్రం: వుంచివునసులు (1962) రచన: ఆచార్య ఆత్రేయ సంగీతం: కె.వి.వుహదేవన్, గానం: ఎస్.జానకి నిర్వహణ: నాగేశ్


