షావుకారు జానకి.. తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా? | Sowcar Janaki First Movie Remunaration Goes Viral | Sakshi
Sakshi News home page

Sowcar Janaki: షావుకారు జానకి తొలి సినిమా పారితోషికం ఎంతంటే?

Aug 21 2026 5:21 PM | Updated on Aug 21 2026 5:37 PM

Sowcar Janaki First Movie Remunaration Goes Viral

మరో దిగ్గజ సినీతార నింగికెగిసింది. దశాబ్దాల పాటు అభిమానులను మెప్పించిన అలనాటి కథానాయిక కథ ఇక ముగిసింది. దాదాపు 400లకు పైగా చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించిన నాట్య మయూరి ఇక సెలవు తీసుకుంది. తెలుగు వెండితెరపై తనదైన ముద్రవేసిన సీనియర్ నటి షావుకారు జానకి ఇవాళ తుదిశ్వాస విడిచింది. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆమె శాశ్వత నిద్రలోకి జారుకుంది.

ఈ విషాద సమయంలో జానకి గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. దాదాపు ఏడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలిన ఆమె ఎన్నో అవార్డులు అందుకున్నారు. నంది అవార్డులతో పాటు ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారానికి కూడా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆమె నటించిన తొలి సినిమాకు ఎంత పారితోషికం తీసుకున్నారనే టాపిక్‌ ఆసక్తిగా మారింది.

షావుకారు జానకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది షావుకారు మూవీనే. అందుకే ఆ సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ హీరోగా నటించారు. ఈ మూవీకి గానూ జానకికి రూ.2500 రూపాయలు ఇచ్చారని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అప్పట్లో ఆర్థికంగా చితికిపోతున్న రోజుల్లో నాకు రెండన్నర్ర లక్షలుగా కనపడిందని జానకి పేర్కొంది. ఇది నాకు ఓ వరంలాగా అనిపించిందని జానకి వెల్లడించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement