ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి ఇవాళ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరిన ఆమె.. తుదిశ్వాస విడిచారు. తెలుగు వెండితెరపై తనదైన ముద్రవేసిన షావుకారు జానకి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించి స్టార్‌గా ఎదిగారు. ఇవాళ ఆమె మరణంతో సినీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
జానకమ్మ మరణం వేళ జానకమ్మకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. దివంగత నటి శ్రీదేవిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది జానకమ్మ గారే. ఆరేళ్ల వయసులోనే బాలనటిగా శ్రీదేవిని వెండితెరపైకి తీసుకొచ్చింది. ఓ సినిమా షూటింగ్‌లో రాజేశ్వరి(శ్రీదేవి అమ్మ) పాపను పట్టుకుని దూరంగా నిలబడి చూస్తున్నారు.
అదే సమయంలో డైరెక్టర్ మురుగన్ ఓ చిన్న పిల్లాడు కావాలని అడిగారు. దీంతో నేను వెంటనే శ్రీదేవి తీసుకుందామని రాజేశ్వరితో చెప్పా.. ఆమె వెంటనే ఒప్పుకున్నారు. మేకప్ వేశాక బాల మురుగన్ పాత్రకు శ్రీదేవి చక్కగా సరిపోయింది. చిన్న చిన్న డైలాగ్‌లు చెప్పమంటే.. ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ, తను చెప్పడం చూసి, మరో ఆలోచన లేకుండా ఓకే చేశారు.


