రజినీకాంత్‌ ‘జైలర్‌2’ ట్రైలర్‌ వచ్చేసింది | Rajinikanth Jailer 2 Movie Trailer Released | Sakshi
Sakshi News home page

Jailer2 Trailer: రజినీకాంత్‌ ‘జైలర్‌2’ తమిళ ట్రైలర్‌ రిలీజ్‌

Oct 5 2026 6:02 PM | Updated on Oct 5 2026 6:21 PM

Rajinikanth Jailer 2 Movie Trailer Released

సూపర్ స్టార్ రజినీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘జైలర్‌-2’. 2023లో విడుదలైన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.  

ఈ నేపథ్యంలో మరో అప్‌డేట్‌తో అభిమానులను ఉత్సాహపరించింది చిత్రబృందం. ఈ రోజు( సోమవారం) ఈసినిమా నుంచి తమిళ ట్రైలర్‌ను విడుదల చేసింది. తెలుగులో రావాల్సి ఉంది.  కాగా ఈ సినిమాకి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, విద్యా బాలన్, హృతిక్‌ రోషన్, రమ్యకృష్ణ, యోగిబాబు, మిర్నా మీనన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. 
(ఇదీ చదవండి: అమ్మాయిగా నేటికి పదేళ్లు.. ‘బిగ్‌బాస్‌’ ఫేమ్‌ ప్రియాంక ఎమోషనల్‌ పోస్ట్‌)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement