కిరణ్ అబ్బవరం దర్శకుడిగా, కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘రియాలిటీ’. ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ మేరకు టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో మధ్యతరగతి వ్యక్తిగా కిరణ్ కనిపించనున్నారు.
గ్లింప్స్ చూస్తుంటే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతోందని అర్థమవుతోంది. ఓ మిడిల్ క్లాస్ కుర్రాడిగా, హోటల్లో వంటవాడిగా, తన ఇంటిపై ఉన్న అప్పులన్నీ తీర్చిన బాధ్యత గల యువకుడిగా కనిపించారు. ఇప్పటివరకు లవర్ బాయ్‌గా, మాస్ కుర్రాడిగా కనిపించిన కిరణ్.. ఓ విభిన్నమైన రోల్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు.


