భరద్వాజ్ దాయాల దర్శకుడిగా ఏఐ టెక్నాలజీతో రూపొందుతున్న చిత్రం ‘కిరికిరి’. ఈ చిత్రాన్ని వన్ మ్యాన్ షో ఫిలింస్ బ్యానర్ పై రవికాంత్ వీరేపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ మేకింగ్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ తో ఈరోజు మొదలుపెట్టారు.
ఇది ఒక కొత్త ప్రయోగం
ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ .. ‘ డైరెక్టర్ భరద్వాజ్ దాయాల రూపొందిస్తున్న కిరికిరి సినిమా 180 రోజుల్లో తీసుకురాబోతున్నారు. వారి ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నా. వారి స్టూడియోను నేను చూశాను. తెరకెక్కించే ప్రతి సీన్ ను వారు కంప్యూటర్ నుంచి స్క్రీన్ మీద ప్రేక్షకులకు ఎలా ఉండబోతుంది అనేది చూసుకుంటున్నారు. ఇది ఒక కొత్త ప్రయోగం’ అని అన్నారు.
డైరెక్టర్ భరద్వాజ దాయాల మాట్లాడుతూ - ఈ సినిమా స్క్రీన్ ప్లే నెల రోజుల్లో కంప్లీట్ చేస్తాం. ఏఐ వల్ల మన ఉద్యోగాలు పోతాయని భయపడుతున్నారు. కానీ కొత్త టెక్నాలజీ ఎప్పుడూ వచ్చినా అది ఎన్నో కొత్త దారులు తెరుస్తుంది. టెక్నాలజీ ఉపయోగిస్తూ వేగంగా సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. కిరికిరి ప్రాజెక్ట్ ను మంచి క్వాలిటీ మూవీ చేయాలనుకుంటున్నాం’ అని అన్నారు.
(ఇదీ చదవండి: లవ్ విషయంలో ఇప్పటికీ కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నా: నాగచైతన్య)


