సోషల్ మీడియాకు భయపడి 'ఆదర్శ కుటుంబం' వాయిదా | Aadarsha Kutumbam Movie Postponed Naga Vamsi Latest Comments | Sakshi
Sakshi News home page

Aadarsha Kutumbam Movie: వాయిదాకి కారణం చెప్పిన నాగవంశీ.. అప్పుడే రిలీజ్

Oct 5 2026 3:47 PM | Updated on Oct 5 2026 4:15 PM

Aadarsha Kutumbam Movie Postponed Naga Vamsi Latest Comments

అనుకున్నదే జరిగింది. ఈ శుక్రవారం థియేటర్లలోకి రావాల్సిన వెంకటేశ్-‍త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగానే ప్రకటించారు. అలానే సోషల్ మీడియాకు భయపడే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పడం ఆసక్తికరంగా అనిపించింది.

(ఇదీ చదవండి: ఎవరూ నాకు ఏ ఆస్తి బహుమతిగా ఇవ్వలేదు.. రకుల్ ప్రీత్ సీరియస్)

'సర్ప్రైజింగ్ విషయం ఏమీ చెప్పడానికి రాలేదు. రాత్రి నుండీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నదే. మమ్మల్ని ఏసుకుంటున్నారు. 'ఆదర్శ కుటుంబం' పబ్లిసిటీ కూడా బాలేదు అని వెంకటేశ్ ఫ్యాన్స్ కంప్లైంట్ చేస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే వెనక్కి వెళ్తున్నాం. అక్టోబర్ 9న రావాల్సిన 'ఆదర్శ కుటుంబం' వాయిదా వేస్తున్నాం. ముందుగా ప్రకటించి ఉంటే సరిపోయేది మిగతా సినిమాల రిలీజ్‌లకి ఇబ్బంది ఎదురైంది. మమ్మల్ని క్షమించండి. ఎప్పుడొచ్చినా వెంకటేశ్ అభిమానులకి కాలర్ ఎత్తుకునే సినిమా ఇస్తాం. రాబోయే రెండు మూడు వారాల్లో మరో రెండు పాటలు, ట్రైలర్, పబ్లిసిటీ పూర్తిచేసి కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం'

'సోషల్ మీడియా మీద మాకున్న భయంతో ఎక్స్‌ట్రా జాగ్రత్త తీసుకోవడం వల్లే ఎలాంటి నిర్ణయాలు త్వరగా తీసుకోలేకపోతున్నాం. సినిమా కాపీ చూశాక 100 శాతం మేం హ్యాపీ అనుకున్న తర్వాతే ప్రొడక్ట్ బయటకి ఇస్తాం. అక్టోబర్ 9న ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమా రిలీజ్ చేసేద్దామని నేనే ట్వీట్ వేశాను. అక్టోబర్ 10 నుంచి స్కూళ్ళకు సెలవులు, కాబట్టి బాగుంటుంది అనే అనుకున్నాను. కానీ ఆ టైంకి 80 శాతం ఔట్పుట్ మాత్రమే రెడీ అవుతుంది. అలానే అక్టోబర్ 30 డేట్ కూడా ఫిక్స్ కాదు. వెంకటేష్ ఇండియాకి వచ్చాక సురేష్ బాబుతో కలిసి చర్చించి అప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేసి నేను చాలా తప్పు చేశాను' అని నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: ఈ వారం నామినేట్ అయింది వీళ్లేనా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement