బిగ్‌బాస్ 10: ఈ వారం నామినేట్ అయింది వీళ్లేనా? | Bigg Boss 10 Telugu Fifth Week Nominations Full List | Sakshi
Sakshi News home page

Bigg Boss 10 Telugu: రెచ్చిపోయిన అపూర్వ.. వర్షిణితో గొడవ.. ప్రోమో చూశారా?

Oct 5 2026 3:10 PM | Updated on Oct 5 2026 3:22 PM

Bigg Boss 10 Telugu Fifth Week Nominations Full List

బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్‌లో నాలుగో వారం సృష్టి ఎలిమినేట్ అయింది. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. ఇక సోమవారం రావడంతో ఎప్పటిలానే నామినేషన్ల హడావుడి నడిచింది. ఈసారి కామనర్ అపూర్వ రెచ్చిపోయింది. ప్రోమో అంతా దాదాపుగా ఈమెనే కనిపించింది. వర్ణిణి, ముకేశ్‌లతో గొడవలు పెట్టుకుంది. ఇంతకీ ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారు? ప్రోమోలో ఏముంది?

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: సృష్టి ఎలిమినేట్.. నాలుగు వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే?)

ఈసారి నామినేషన్ల ప్రక్రియ కోసం 'రోడ్ టూ రీలోడ్' అనే కాన్సెప్ట్‌ని బిగ్‌బాస్ పెట్టాడు. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్‌లో ఒకరు ఓ పండుని తీసుకుని ఎదురుగా ఉన్న బాక్సుల్లో ఏదో ఒకదాని దిగువన దాస్తారు. నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు హౌస్‌మేట్స్.. దాన్ని వెతికి పట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరికైతే అది మొదటగా దొరుకుతుందో వాళ్లకు నామినేట్ చేసే అవకాశం దక్కుతుంది.

ప్రోమోలో చూపించినట్లు రాంప్రసాద్.. అమన్‌ని, ముకేశ్.. అపూర్వని, త్రిగుణ్ కూడా అపూర్వనే నామినేట్ చేశాడు. మొత్తంగా చూస్తే ఈసారి నామినేషన్ ప్రక్రియ మంచి హుషారుగా గొడవలు, కొట్లాటలతో రంజుగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలా ఐదోవారానికిగానూ త్రిగుణ్, అమన్, రోహిత్, శాలిని, అపూర్వ, రాంప్రసాద్, చరణ్ నామినేట్ అయినట్లు తెలుస్తోంది. అలానే ఈ వీకెండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చే అవకాశముంది. దీంతో డబుల్ ఎలిమినేషన్ షాక్ గ్యారంటీ అని మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: ఎవరూ నాకు ఏ ఆస్తి బహుమతిగా ఇవ్వలేదు.. రకుల్ ప్రీత్ సీరియస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement