రీసెంట్‌గా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మామ వాసు భగ్నానీ, భర్త జాకీ భగ్నానీకి సంబంధించిన నిర్మాణ సంస్థ ఆఫీసులపై ఐటీశాఖ దాడులు చేసింది. అయితే వీటితో తనని లింక్ చేస్తుండటంపై రకుల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో సుధీర్ఘ పోస్ట్ పెట్టింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఆ సోదాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: సృష్టి ఎలిమినేట్.. నాలుగు వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే?)
'నా గురించి వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అబద్ధం. నేను ఆర్మీ నేపథ్యం నుంచి వచ్చాను. ఇండస్ట్రీలో నాకు ఎలాంటి గాడ్‌ఫాదర్ లేరు. కష్టపడి, బాధ్యతాయుతమైన పౌరురాలిగా, 20 ఏళ్ల వయసు నుంచే క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నాను. ఏ నిర్మాణ సంస్థ తరఫున చట్టవిరుద్ధమైన విదేశీ నగదు లావాదేవీలకు పాల్పడలేదు. దేశంలో కానీ, విదేశాల్లో కానీ ఎవరి తరఫునా నాకు ఎలాంటి బినామీ ఆస్తులు లేవు. ఎవరూ నాకు ఎప్పుడూ ఎలాంటి ఆస్తి బహుమతిగా ఇవ్వలేదు. ఇలాంటి ఖరీదైన బహుమతులు స్వీకరించడం నా రూల్స్‌కి విరుద్ధం. నాపై తప్పుడు కథనాలు ప్రచురించిన మీడియా సంస్థలు వాటిని తీసేసి నిజాలు చెప్పాలి. మీడియా సంస్థలకు ఒత్తిళ్లు ఉంటాయని అర్థం చేసుకోగలను. కానీ వాటి కోసం నిజాల్ని త్యాగం చేయకూడదు. ఒక వ్యక్తి ప్రతిష్ఠ, జీవనోపాధిని దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదు' రకుల్ ప్రీత్ సింగ్ సీరియస్ అయింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు మిస్ కావొద్దు)


