మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి 'ఆదర్శ కుటుంబం' సినిమా రాబోతుంది. వెంకటేశ్ హీరో కాగా త్రివిక్రమ్ దర్శకుడు. లెక్క ప్రకారం గతవారమే రిలీజ్ కావాలి. కానీ ఈ వీకెండ్ అని ప్రకటించారు. కానీ ఈసారి కూడా వాయిదా పడొచ్చనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయమై క్లారిటీ రావాలి. ఇది కాకుండా శ్రీ విష్ణు 'కామ్రేడ్ కల్యాణ్', రీసెంట్ సెన్సేషన్ హిట్ 'హనుమాన్ అంశ్'(తెలుగు) చిత్రాలతో పాటు మయూఖ, బా..బా.. బ్లాక్ షీప్ బిగ్ స్క్రీన్స్‌పైకి రానున్నాయి.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: సృష్టి ఎలిమినేట్.. నాలుగు వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే?)

మరోవైపు ఓటీటీల్లో ఈ వారం 23 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో మండాడి, ఎపిక్, ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్, రిపోర్టింగ్ లైవ్ చిత్రాలు ఉన్నంతలో చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు 'ఐస్' అనే డబ్బింగ్ సిరీస్ కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబర్ 05 నుంచి 11 వరకు)
నెట్‌ఫ్లిక్స్
లెస్ ఆఫ్ ఏ స్ట్రేంజర్ (పోలిష్ మూవీ) - అక్టోబర్ 07
ఇన్‌సైడ్ ద సర్కిల్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబర్ 07
మండాడి (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 08
బిలో (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 08
ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబర్ 09
ఎపిక్ (తెలుగు చిత్రం) - అక్టోబర్ 09
రిపోర్టింగ్ లైవ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 09
టేక్ ఛార్జ్ ఆఫ్ మై హార్ట్ (కొరియన్ సిరీస్) - అక్టోబర్ 09
యానిమల్స్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబర్ 09
హాంటెడ్ హోటల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 09
100 డేస్ ఆఫ్ డిసెప్షన్ (కొరియన్ సిరీస్) - అక్టోబర్ 10
హాట్‌స్టార్
మోర్టల్ కాంబాట్ 2 (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 08
షెరిఫ్ కంట్రీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 09
పతి పత్నీ ఔర్ పంగా సీజన్ 2 (హిందీ రియాలిటీ షో) - అక్టోబర్ 10
విజయనగర్ హిరే (బెంగాలీ మూవీ) - అక్టోబర్ 10
ట్రెజర్ ఐలాండ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 11
అమెజాన్ ప్రైమ్
స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 06 (రెంట్)
ఇన్సెడియస్: ఔట్ ఆఫ్ ద ఫర్దర్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబర్ 06 (రెంట్)
కేరీ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 07
ఇష్కా ఇష్కా (హిందీ సిరీస్) - అక్టోబర్ 07
సోనీ లివ్
ఐస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 09
ఆపిల్ టీవీ ప్లస్
స్మాల్ ప్రొఫెట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 07
మ్యాచ్ బాక్స్ ద మూవీ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 09
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'అక్క'.. లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్)


