breaking news
Mandaadi Movie
-
ఈ హీరోకు తొలిసారి రూ.75 కోట్ల బడ్జెట్!
హాస్యనటుడిగా కెరీర్ ప్రారంభించి, కథానాయకుడిగా అవతారమెత్తిన నటుడు సూరి. ఈయన హీరోగా నటించి విడుదలైన గరుడన్, మామన్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా సూరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మండాడి. ఆర్ఎస్ ఇన్ఫోటెయిన్మెంట్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి మదిమారన్ పుహళేంది దర్శకత్వం వహిస్తున్నారు. ఇది సముద్ర తీరంలో జరిగే జాలర్ల బోటు పందేల ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న సినిమా. ఇందులో సూరి జాలరిగా నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆయన చాలా వర్కౌట్ చేసి పూర్తిగా మారిపోయారు. రూ.75 కోట్లతో రూపొందుతున్న మండాడి సూరి కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రమని యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ స్టంట్ నిపుణులతో ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ 40 రోజులపాటు చిత్రికరించినట్లు చెప్పారు. చిత్రంలోని బోటు ఫైట్ సన్నివేశాలు థ్రిల్లింగ్గా ఉంటాయన్నారు. దీనికి ప్రకాష్కుమార్ సంగీతం మరింత బలాన్ని చేకూర్చిందన్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి. -
వెట్రి మారన్ సినిమా షూటింగ్ లో ప్రమాదం..
-
సుహాస్-సూరి సినిమా షూటింగ్లో ప్రమాదం.. వీడియో వైరల్
సుహాస్, సూరి కలిసి నటిస్తున్న ‘మండాడి’ సినిమా షూటింగ్లో ప్రమాదం చోటు చేసుకుంది. కొన్ని సన్నివేశాలను సముద్రంలో చిత్రీకరిస్తుండగా, సాంకేతిక నిపుణులు ఉన్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కోటి రూపాయల విలువ చేసే కెమెరాలు, ఇద్దరు వ్యక్తులు నీట మునిగిపోయారు. రామనాథ పురం జిల్లా తొండి అనే సముద్రతీర ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. యూనిట్ సభ్యులు నీట మునిగిన వ్యక్తులను రక్షించడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే విలువైన కెమెరాల సహా ఇతర సామాగ్రి నీట మునిగిపోయింది.మండాడి విషయానికొస్తే.. క్రీడ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమిళ నటుడు సూరి హీరోగా, తెలుగు నటుడు సుహాస్ విలన్ గా నటిస్తున్నాడు. ఇదే సినిమా తెలుగులో సుహాస్ హీరోగా సూరి విలన్గా కనిపించనున్నాడు. సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. Video - A boat capsized during the shooting of #Soori's film #Mandaadi, causing damage to the cameras on board....🫣- This kind of accident happened while the shooting of this film was taking place at a location called Thundi in Ramanathapuram....🥹pic.twitter.com/yDjTrLOHT1— Movie Tamil (@_MovieTamil) October 4, 2025 -
కోలీవుడ్ మూవీలో విలన్ గా సుహాస్.. లుక్ అదిరింది!
-
కోలీవుడ్ మూవీలో విలన్గా సుహాస్.. లుక్ అదిరింది!
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ‘సెల్ఫీ’ ఫేమ్ మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ‘మండాడి’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో సూరి హీరోగా నటించగా, సుహాస్ తొలిసారి విలన్ పాత్ర పోషించాడు. సుహాస్ బర్త్డే సందర్భంగా నేడు(ఆగస్ట్ 19) కొత్త పోస్టర్ని విడుదల చేశారు. ఈ చిత్రం కోసం సుహాస్ తన లుక్స్ మొత్తాన్ని మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు, కొత్త లుక్ ఇప్పటికే దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బర్త్ డే విషెస్ చెబుతూ వదిలిన ఈ కొత్త పోస్టర్ కూడా అందరినీ మెప్పించేలా ఉంది.సూరి, సుహాస్లతో పాటు మహిమా నంబియార్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ వంటి అనుభవజ్ఞులైన ప్రతిభావంతులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. క్రీడ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మనుగడ, వ్యక్తిగత గుర్తింపు, అజేయమైన మానవ స్ఫూర్తి వంటి అంశాలను ప్రధానంగా చూపించనున్నారు. ఈ మూవీకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు.


