కోలీవుడ్‌ మూవీలో విలన్‌గా సుహాస్‌.. లుక్ అదిరింది! | Suhas First Look Poster Out From Mandaadi Movie | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌ మూవీలో విలన్‌గా సుహాస్‌.. లుక్ అదిరింది!

Aug 19 2025 1:20 PM | Updated on Aug 19 2025 1:39 PM

Suhas First Look Poster Out From Mandaadi Movie

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుహాస్‌ కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు. ‘సెల్ఫీ’ ఫేమ్ మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ‘మండాడి’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో సూరి హీరోగా నటించగా, సుహాస్‌ తొలిసారి విలన్‌ పాత్ర పోషించాడు. సుహాస్‌ బర్త్‌డే సందర్భంగా నేడు(ఆగస్ట్‌ 19) కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు.  ఈ చిత్రం కోసం సుహాస్ తన లుక్స్ మొత్తాన్ని మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు, కొత్త లుక్ ఇప్పటికే దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 

బర్త్ డే విషెస్ చెబుతూ వదిలిన ఈ కొత్త పోస్టర్ కూడా అందరినీ మెప్పించేలా ఉంది.సూరి, సుహాస్‌లతో పాటు మహిమా నంబియార్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ వంటి అనుభవజ్ఞులైన ప్రతిభావంతులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. క్రీడ నేపథ్యంలో  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మనుగడ, వ్యక్తిగత గుర్తింపు, అజేయమైన మానవ స్ఫూర్తి వంటి అంశాలను ప్రధానంగా చూపించనున్నారు. ఈ మూవీకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement